S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/01/2019 - 04:55

కర్నూలు, డిసెంబర్ 31 : రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతోందన్న వార్త ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా జనాభా నియంత్రణకు అలవాటుపడిన ప్రజలు ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇచ్చినా జనాభా పెరుగుదల కోసం అధిక సంతానం పొందడానికి ఎంతవరకూ సిద్ధపడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

01/01/2019 - 04:54

వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 31: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. ధర్మపురం, గరుడభద్ర, అక్కుపల్లి, ఎం.గడూరు, గుణుపల్లి, మెట్టూరు మీదుగా ఒంకులూరు వరకు చేరుకుంది. గరుడభద్ర వద్ద ఉపాధి కూలీలతో మాట్లాడారు.

01/01/2019 - 04:52

కాకినాడ సిటీ, డిసెంబర్ 31: నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం మంత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తన అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, నూతన సంవత్సర ప్రణాళికలను మంత్రి తెలియచేశారు.

01/01/2019 - 04:44

హైదరాబాద్, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావులా మాట్లాడేందుకు తమకు సంస్కారం అడ్డు వస్తున్నదని తెలంగాణ టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునుద్ధేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన భాష చాలా దారుణంగా ఉందని ఆయన సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

12/31/2018 - 16:49

గుంటూరు: గుంటూరు లాలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై 160 కి.మీ వేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని తరువాత లారీని ఢీకొన్నది. కారులో ఉన్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. వీరు ఆర్‌వీఆర్ ఆండ్ జేసీ ఇంజనీరింగ్ విద్యార్థులు. కారు ఢీకొనటంతో లారీ సైతం బోల్తా పడింది. మృతులు ధనుష్, కోటేశ్వరరావు, సాయిరామ్, కపూర్‌గా గుర్తించారు.

12/31/2018 - 12:37

అమరావతి: అభివృద్ధిలో ఏపీ మరింత ముందుకు సాగాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం నీరు-ప్రగతిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధిలో ప్రపంచం ఏపీ వైపు చూసేలా అధికారులు కృషిచేయాలని అన్నారు.

12/31/2018 - 12:35

విశాఖపట్నం: విశాఖ మన్యంలో చలి పంజా విసిరింది. గత పదేళ్లలో ఎన్నడూ నమోదుకాని ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీనికితోడు పొగమంచు కమ్ముకోవటంతో వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందికరంగా మారింది. చింతపల్లి, లంబసంగిలో 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్నిప్రాంతాల్లో మంచు జల్లులు సైతం కురుస్తున్నాయి.

12/31/2018 - 12:31

అమరావతి:రాజ్యసభలో తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లును అడ్డుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జీకి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.ఈ బిల్లు ముస్లీంలను అణిచివేసే విధంగా ఉందని అన్నారు. బీజేపీయేతర పక్షాలు ఏకంకావాలని అన్నారు.

12/31/2018 - 04:30

విజయవాడ (సిటీ), డిసెంబర్ 30: రాష్టవ్య్రాప్తంగా ఉన్న వెలుగు ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం 13 జిల్లాల వెలుగు జేఏసీ నాయకులు మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో చంద్రబాబును కలిశారు. ఈసందర్భంగా ఆయన వారితో మట్లాడుతూ మీపై నాకు ప్రత్యేక మైన అభిమానం ఉందని, మీ విషయాల పట్ల సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారు.

12/31/2018 - 04:28

విశాఖపట్నం (కల్చరల్), డిసెంబర్ 30: విశాఖ నగర ప్రజలను, పర్యాటకులను మూడు రోజుల పాటు ఉర్రూతలూగించిన విశాఖ ఉత్సవ్ ఆదివారం ముగిసింది. తొలిరోజు ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించగా, ముగింపు సందర్భంగా సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రత్యేక ఆకర్షణగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా విశాఖ ఉత్సవ్‌ను అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు.

Pages