S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/02/2019 - 03:59

విజయవాడ, జనవరి 1: అమరావతి రాజధాని నగర సందర్శన యాత్రకు కొత్త సంవత్సరం తొలిరోజు మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి 800 మంది ప్రజలు 17 బస్సుల్లో తరలివచ్చారు.

01/02/2019 - 03:58

విజయవాడ, జనవరి 1: గత సంవత్సరం మాదిరిగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువ కింద చెరువులకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేసి చెరువులన్నింటినీ నింపేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మంగళవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ ఏడాది మరింత దారుణంగా కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

01/02/2019 - 04:12

విజయవాడ (క్రైం): ఆంధ్రప్రదేశ్ హైకోర్టును దేశంలోనే అత్యుత్తమ న్యాయస్ధానంగా తీర్చిదిద్దాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

01/02/2019 - 04:22

గుంటూరు, జనవరి 1: దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే స్ర్తి నిధి పథకం ఫలాలు అందేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు.

01/02/2019 - 04:23

విశాఖపట్నం, జనవరి 1: విభజన జరిగి నాలుగేళ్లయినా తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన జీసీసీ ఆస్తుల పంపకాలు మాత్రం ఇప్పటికీ జరగలేదు. 58:42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాల ఆస్తులు పంచాల్సి ఉన్నా దీనికి సంబంధించి కమిటీలు వేయడం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, రెండు రాష్ట్రాలకు చెందిన అదికారులు అనేకసార్లు సమావేశాలు కావడం, దీనిపై పరిశీలన చేసి మరీ ఓ నివేదికను తయారు చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.

01/02/2019 - 04:05

విజయవాడ, జనవరి 1: తాను రచించిన పుస్తకాన్ని విజయవాడలోని ప్రముఖుల మధ్య ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉందని ప్రముఖ చరిత్రకారుడు, మహాత్మా గాంధీ మనవడు ఆచార్య రాజమోహన్ గాంధీ అన్నారు. నవభారత ప్రకాశరావు ప్రాంగణంలో యద్దనపూడి సులోచనారాణి సాహిత్య వేదికపై ఎన్టీఆర్ ట్రస్ట్, సాంస్కృతిక శాఖ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన 30వ పుస్తక మహోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు.

01/01/2019 - 16:47

అమరావతి: ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ మంగళవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

01/01/2019 - 10:40

విజయవాడ: నేడు భవానీ దీక్షల విరమణ కావటంతో భక్తులు దుర్గగుడికి పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అర్థరాత్రి నుంచే భక్తులు అమ్మ దర్శనం కోసం వేచి వున్నారు. భవానీ దీక్షల నేపథ్యంలో అర్థరాత్రి 2 గంటల నుంచే భక్తులను వదిలారు. జనవరి 1వ తేదీ అర్థరాత్రి వరకు భక్తులను దర్శనం కోసం అనుమతినిస్తామని ఈఓ కోటీశ్వరమ్మ తెలిపారు.

01/01/2019 - 10:38

తిరుమల: తిరుమలలో భక్తులు రద్దీ సాధారణంగా ఉంది. నేడు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏడు కంపార్టమెంట్‌లలో భక్తులు వేచి వున్నారు. సర్వ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

01/01/2019 - 05:58

విజయవాడ, డిసెంబర్ 31: డీఎస్సీ- 2018 స్కూల్ అసిస్టెంట్లు (వ్యాయామ), పీఈటీలకు జనవరి 4 నుంచి భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 337 స్కూల్ అసిస్టెంట్లకు, 12552 పీఈటీలు ఆప్షన్లు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. వీరికి జనవరి 13వరకూ ఆచార్య నాగార్జున వర్సిటీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్‌లో 700 మంది చొప్పున 1400 మందికి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.

Pages