S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/19/2018 - 12:48

తిరుమల: ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ వైపు ఉన్నారని, కాంగ్రెస్‌ను తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సినీ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నో అంటామని, అవన్నీ జరుగుతాయా, కార్యకర్తలో ఆత్మవిశ్వాసం నింపేందుకు అలా మాట్లాడనని చెప్పుకొచ్చారు.

12/19/2018 - 04:26

నాగాయలంక, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ కారణంగా సముద్రంలో గల్లంతైన కాకినాడకు చెందిన మత్స్యకారుల బోట్లలో ఒక బోటు మంగళవారం సాయంత్రం కృష్ణాజిల్లా నాగాయలంక తీరానికి చేరింది. 12 మందితో ప్రయాణిస్తున్న బోటు నాగాయలంక మండలం గుల్లలమోద లైట్ హౌస్ వద్ద కృష్ణానదిలో చిక్కుకుంది. ఆయిల్ అయిపోవటంతో బోటు ఎటూ కదలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బోటులో ఉన్న మత్స్యకారులు లంగరు వేశారు.

12/19/2018 - 02:31

అమరావతి, డిసెంబర్ 18: పేదల గృహ నిర్మాణం అత్యున్నత సంక్షేమ కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రూ 80వేల కోట్లతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. మనం సొంతిల్లు కట్టుకునేటప్పుడు ఎంతో ఆనందం.. లక్షలాది పేదలకు ఇళ్లు కట్టిస్తే అమితానందం అన్నారు. మంగళవారం గృహనిర్మాణ పథకంపై కలెక్టర్లు, బ్యాంకర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/19/2018 - 02:29

అమరావతి, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్‌లైన్లు, సబ్‌స్టేషన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి 24 గంటల్లో సరఫరాను అందించినట్లు రాష్ట్ర ఇంధనవనరుల శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిత్లీ తుపానులో ఏర్పడిన విద్యుత్ సమస్యలను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తిచేశామని గుర్తుచేశారు.

12/19/2018 - 02:25

విశాఖపట్నం, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలోని హమీల అమలు కోసం, రాష్ట్రానికి కేంద్ర నిధుల కేటాయింపులపై పార్లమెంట్ చివరి సమావేశాల సందర్భంగా జనవరి 4న సీపీఐ, సీపీఐ (ఎం)ల ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

12/19/2018 - 02:25

అమరావతి, డిసెంబర్ 18: నల్గొండ జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఏపీ సచివాలయ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి పీఎస్ భాస్కర్ అందించిన సేవలు మరువలేనివని పలువురు సహచర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

12/19/2018 - 02:24

కొత్తచెరువు, డిసెంబర్ 18: చైనాలోని వాణిజ్య నగరమైన షాంఘైలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన కిషోర్ (29) మృతి చెందాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లి గ్రా మానికి చెందిన కిషోర్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి షాంఘైలో ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తున్నా డు.

12/19/2018 - 02:23

పాడేరు, అరుకులోయ, పాతపట్నం, మెళియాపుట్టి, బుచ్చెయ్యపేట, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను ప్రభావంతో వీచిన తీవ్ర చలి గాలులకు విశాఖ జిల్లా పాడేరు మండలంలో ఇద్దరు, అరుకులోయ మండలంలో ఇద్దరు, బుచ్చెయ్యపేట మండలంలో ఒకరు, రావికమతం మండలంలో ఒకరు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఒకరు, పాతపట్నం మండలంలో ఒకరు చనిపోగా పాతపట్నం మండలంలోనే ఉపాధ్యాయుడు ఒకరు విద్యుదాఘాతంతో దుర్మరణం చెందారు.

12/19/2018 - 03:10

అమరావతి: ఎన్నికల్లో ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రామ్‌ప్రకాష్ సిసోడియా స్పష్టం చేశారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం సిసోడియా అధ్యక్షతన అందరికీ అందుబాటులో ఎన్నికలు అనే అంశంపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాష్టస్థ్రాయి స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది.

12/18/2018 - 04:40

మచిలీపట్నం/గుంటూరు: పెథాయ్ తుపాను కృష్ణా, గుంటూరు జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ముఖ్యంగా పంట చేతికందే దశలో దాదాపు లక్ష ఎకరాల్లో వరి రైతులకు భారీ దెబ్బ తగిలింది. చేతికందుతున్న పంట అకాలవర్షంతో చేజారుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు దైన్యంగా చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

Pages