S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/24/2018 - 02:46

విజయవాడ, జూలై 23: పోటీదారులను మించి సౌకర్యాలు కల్పించగలిగినప్పుడే యాత్రికులు రాష్ట్ర పర్యాటక అతిథి గృహాల వైపుకు ఆకర్షితులవుతారని పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆ క్రమంలో రాష్ట్రంలో అన్ని హరిత భవనాలను ఆదునికీకరించాలని సూచించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో పర్యాటక శాఖ నేతృత్వంలో జరుగుతున్న వివిధ పనులపై సమీక్ష నిర్వహించారు.

07/24/2018 - 02:45

అమరావతి, జూలై 23: రాజధాని అమరావతి నిర్మాణానికి వృద్ధాప్య పెన్షనర్లు ముందుకొచ్చారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఫించనుదార్లు తమకు వచ్చిన పెన్షన్ సొమ్ము రూ 65వేలు రాజధాని నిర్మాణం నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సోమవారం సీఎం గ్రీవెన్స్‌సెల్‌లో అందజేశారు.

07/24/2018 - 02:45

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 23: అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం 108 సిబ్బంది సమ్మె సైరన్ మ్రోగించారు. తమ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని కోరుతూ 108 ఉద్యోగులు సమ్మె నోటీసును మెనేజ్‌మెంట్‌కు అందించారు. ఈ మెరుపు సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 450కి పైగా 108 అంబులెన్స్‌లు ఎక్కడివక్కడే ఆగిపోనున్నాయి.

07/24/2018 - 02:44

విజయవాడ (కార్పొరేషన్), జూలై 23: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ చెబుతుంటే, టీడీపీ, వైకాపాలకు తెచ్చే శక్తి లేదు కాబట్టి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 మంది ఎంపీలను ఇచ్చి ప్రత్యేక హోదా పొందాలని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు.

07/24/2018 - 02:44

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 23: ప్రత్యేక హోదా అంశంలో సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదాకు మీరు వ్యతిరేకమా అని ఆయన సోమవారం ట్వీట్టర్ వేదికగా సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

07/24/2018 - 02:41

మార్కాపురం, జూలై 23: ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదిని అయిన శ్రీపూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు సోమవారం విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయిన విషయం పాఠకులకు విదితమే.

07/24/2018 - 02:41

నందికొట్కూరు, జూలై 23: హంద్రీనీవా ఎత్తిపోతల నుంచి సీమకు కృష్ణాజలాలు సోమవారం విడుదలయ్యాయి. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 850.60 అడుగులకు చేరుకోవడంతో కర్నూలు జిల్లా మల్యాలలోని హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకం నుంచి సోమవారం నీరు విడుదల చేశారు. రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నారు. రానున్న రోజుల్లో మిగతా పంపుల ద్వారా నీరు విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

07/24/2018 - 02:40

కర్నూలు, జూలై 23: శ్రీశైలం జలాశయం వేగంగా నిండుతోంది. ఎగువన కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా జలాశయంలో సోమవారం రాత్రికి 82.01 టిఎంసీల నీరు వచ్చి చేరింది. జలాశయం నీటిమట్టం 850.90 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 1,78,894 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. హంద్రీ-నీవా పథకం నుంచి రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

07/24/2018 - 01:34

అనంతపురం టౌన్, జూలై 23: నాలుగేండ్లు నరేంద్ర మోదీకి సాష్టాంగ నమస్కారం చేసిన వారు వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. 25 ఎంపీ సీట్లు ఎందుకివ్వాలి, మోదీకి అమ్ముకోవడానికా అని ఆయన తెలుగుదేశంపై ధ్వజమెత్తారు.

07/24/2018 - 01:31

అమరావతి, జూలై 23: పోలవరం నిర్వాసిత కాలనీలను ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు నష్టపరిహారం తదితర అంశాలపై ముఖ్యమంత్రి వర్చువల్ రివ్యూ నిర్వహించారు.

Pages