S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/23/2018 - 04:08

తిరుపతి, జూలై 22: రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీ రానున్న ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానమైనా గెలుచుకుంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన్ను ఏపీ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘనంగా సన్మానించారు.

07/23/2018 - 04:15

శ్రీకాకుళం: సరిగ్గా 2004 సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులే ఉత్తరాంధ్రలో ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరాయి. అందులో టీడీపీ కంచుకోట, అధికారాన్ని అందిపుచ్చుకునేందుకు సెంటిమెంట్ జిల్లా శ్రీకాకుళంలో టీడీపీ జయాపజయాలు ఫిఫ్టీ-్ఫఫ్టీ కంటే బలహీనంగా ఉంటాయన్న సర్వేలు ఆ పార్టీ అధిష్ఠానానికి హైబీపీ తెప్పించింది.

07/22/2018 - 06:07

శ్రీకాకుళం, జూలై 21: పొరుగు రాష్ట్రం ఒడిశా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. మరో 24 గంటల్లో వరద భయం ఉండొచ్చని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ, నాగావళి, వంశధార నదుల పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.

07/22/2018 - 05:43

విశాఖపట్నం, జూలై 21: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీన పడి అల్పపీడనంగా మారింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబంగ తీరంలో బాలాసూర్-డిజా మధ్య శనివారం సాయంత్రం తీరం దాటినట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది క్రమంగా బలహీన పడుతూ అల్పపీడనంగా కొనసాగుతుందన్నారు.

07/22/2018 - 05:42

అమరావతి, జూలై 21: కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస పర్వం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర విభజన హక్కుల సాధన కోసం ఇకపై న్యాయపోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇచ్చిన వివరణను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రేపటి నుంచి లోక్ సభలో ఆందోళన తీవ్రతరం చేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు.

07/21/2018 - 05:50

సబ్బవరం, జూలై 20: విశాఖ జిల్లా సబ్బవరం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద మూడు, ఐదో సంవత్సరం న్యాయ విద్యార్థులు 78 మంది శుక్రవారం సాయంత్రం వర్షంలో బైఠాయించడం సంచలనం రేపింది. విషయం తెలిసి అక్కడకు వెళ్లిన విలేఖరులకు గతంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.

07/21/2018 - 05:49

విజయవాడ, జూలై 20: అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా... వివిధ రూపాల్లో అవిశ్వాసానికి మద్దతు వ్యక్తమయింది. ఈ సందర్భంగా దేవాలయాల్లో పూజలు, మానవహారాలు, ధర్నాలు, ప్రదర్శనలు, ప్లెక్సీలు, కాగడాల ప్రదర్శనలు హోరెత్తాయి. అత్యధిక ప్రజలు టీవీలకే అతుక్కుపోయారు.

07/21/2018 - 05:47

రాజవొమ్మంగి, జూలై 20: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో మోటారు బైకుతోపాటు కొట్టుకుపోతున్న తండ్రీ కుమార్తెలను గ్రామస్థుల సహాయంతో పోలీసులు రక్షించారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి మండలంలోని చినఏరు నెల్లిమెట్ల సమీపంలో రహదారిపై ఉద్ధృతంగా ప్రవహించసాగింది.

07/21/2018 - 05:46

విజయవాడ, జూలై 20: డిమాండ్‌ల సాధన నిమిత్తం ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా లారీ యజమానులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలిరోజు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైంది. దాదాపు మూడున్నర లక్షల లారీలు, ట్యాంకర్‌లు, మినీలారీలు, ఇతర రవాణా వాహనాలు ఉండగా అందులో 90శాతం సమ్మెలో పాల్గొన్నాయి. లారీల సమ్మెతో జాతీయ రహదారులు వెలవెలపోతూ కన్పించాయి.

07/21/2018 - 05:45

విజయవాడ, జూలై 20: కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకతతో నిర్వహించేందుకు వీలుగా ఈ-టెండర్ విధానం దశల వారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఎపీఎస్ ఆర్టీసీ ఈడీ (ఇంజనీరింగ్) ఎ.కోటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇక నుంచి సంస్థకు అవసరమైన వివిధ కొనుగోళ్లను ఈ-టెండర్ విధానంలో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

Pages