S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/17/2018 - 06:02

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జూలై 16: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ఉన్న హుండీలను సోమవారం ఉదయం దేవస్థానం ఈవో ఎం పద్మ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కించగా 2కోట్ల, 3వేల, 763 రూపాయలు లభించాయి.

07/17/2018 - 06:01

శ్రీకాకుళం, జూలై 16 : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ఇన్‌చార్జి ఊమెన్ చాందీ అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇందిర విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

07/17/2018 - 06:00

విశాఖ (జగదాంబ),జూలై 16: రాష్ట్రం కేవలం అవినీతి, అక్రమాలలో మాత్రమే అభివృద్ధి చెందిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి 1,500 రోజుల పాలనతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిలేదున్నారు. ఎన్నికల హామీల్లో ప్రకటించిన డ్వాక్రా మహిళల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు.

07/17/2018 - 05:59

విజయవాడ, జూలై 16: రాష్ట్రంలో ఎర్ర చందాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల ఆట కట్టించేందుకు అటవీ శాఖ సమాయత్తం అవుతోంది. ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుని, ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన కొంతమంది ఎర్ర చందన వృక్షాలను నరికి, కలపను ఆక్రమంగా విదేశాలకు తరలిస్తుండటం తెలిసిందే.

07/17/2018 - 05:58

శ్రీకాకుళం, జూలై 16 : బీజేపీకి అధికారం ఇస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపి స్వంతంగా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.

07/16/2018 - 03:39

తెనాలి, జూలై 15: కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని లంక గ్రామాల రైతులకు పోతార్లంక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వరం కానుందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పోతార్లంకలో నిర్మాణం పూర్తి చేసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆదివారం ఆయన జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

07/16/2018 - 03:37

రాజమహేంద్రవరం, జూలై 15: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉభయ గోదావరి జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. శనివారం అర్థరాత్రి నుండి మొదలైన వర్షం ఆదివారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. ఫలితంగా ఏజెన్సీలోని వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కనే్నరు, పెద్దేరు, మడేరు, సీతపల్లి, పాములేరు, సోకులేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

07/16/2018 - 03:35

రాజమహేంద్రవరం, జూలై 15: ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల అసోసియేషన్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల ఫెడరేషన్‌లో విలీనమయ్యాయి.

07/16/2018 - 03:34

కర్నూలు, జూలై 15 : 2024లో అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకుని 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

07/16/2018 - 03:34

విశాఖపట్నం, జూలై 15: విశాఖ రైల్వే జోన్‌పై రాజకీయ నిర్ణయం అయిపోయిందని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఈనెల 13నే మోదీ దీనిపై నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రైల్వే జోన్ తానే తీసుకువస్తానని ఎంపీ హరిబాబు పదేపదే చెబుతున్నారు. ఏదియేమైనా ఆగస్ట్ నెలాఖరులోగా జోన్ వస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దశలో విశాఖలో మళ్లీ దీక్షలు మొదలవుతున్నాయి.

Pages