S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/30/2018 - 01:40

విజయవాడ (బెంజిసర్కిల్), ఏప్రిల్ 29: కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలకు దేశంలో ఒకే ఒక్క పేటెంట్‌దారుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్‌కే రోజా విమర్శించారు. నాలుగేళ్లుగా పదవులు అనుభవించిన చంద్రబాబు ఇన్నాళ్లూ హోదాను ఉరితీశారని ఆరోపించారు.

04/30/2018 - 04:04

ద్వారకాతిరుమల: చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జగద్రక్షకుడైన శ్రీనివాసుడు సర్వాభరణ భూషితుడై నుదుటన కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతున్న ఉభయదేవేరులను పెళ్లాడారు.

04/30/2018 - 01:42

శ్రీకాకుళం, ఏప్రిల్ 29: తిరుపతి వెంకటేశ్వస్వామి ఎదురుగా 2014 ఏప్రిల్ 30న ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక హోదాతోపాటు ఇచ్చిన ఇతర హామీలను వివరిస్తూ సభా వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. తిరుపతి నుంచే ఐదు కోట్లు ఆంధ్రుల ఆకాంక్ష కోసం పోరాటం ఉద్ధృతం చేసేందుకు నాంది పలికామని పేర్కొన్నారు.

04/30/2018 - 01:01

విజయవాడ, ఏప్రిల్ 29: తిరుపతిలో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన ధర్మపోరాట సభ ‘్ధర్మం’పై చంద్రబాబు చేస్తున్న అధర్మ పోరాటమని బీజేపీ అభివర్ణించింది. చంద్రబాబు పదేపదే చెబుతున్నట్లు నరేంద్ర మోదీ ఒక్క తిరుపతిలోనే కాదు, ఏనాడూ ఎక్కడా ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదని పార్టీ ఎంపీ గోకరాజు గంగరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల స్పష్టం చేశారు. బాబుదంతా అభూత కల్పన అంటూ మండిపడ్డారు.

04/30/2018 - 00:59

ఉయ్యూరు, ఏప్రిల్ 29: వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి శనివారం కృష్ణా జిల్లా ఉయ్యూరులో సభ నిర్వహించిన ప్రాంతాన్ని పసుపునీళ్లతో టీడీపీ శ్రేణులు ప్రక్షాళన చేస్తున్నారనే వదంతులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. వైకాపా, టీడీపీ శ్రేణులు పట్టణ ప్రధాన వీధిలో మోహరించగా, పోలీసులు అడ్డుగా నిలిచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కాపుకాశారు.

04/30/2018 - 00:57

విజయవాడ, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని రైతులకు పోలవరం ప్రాజెక్టు చూపించడానికి రూ. 22.25 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వటం ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో ఏమాత్రం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. అన్ని జిల్లాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రైతులు, విద్యార్థులను పోలవరం ప్రాజెక్టు చూపించడానికి తీసుకెళుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

04/30/2018 - 00:57

విజయవాడ, ఏప్రిల్ 29: ఎంసెట్ ఫలితాలను మే 2న ప్రకటించనున్నారు. ముందుగా మే 3న ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే ఫలితాలు ప్రకటించనున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడంతో త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు వీలైంది. విజయవాడలో ఆరోజు మధ్యాహ్నం 12గంటలకు ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు.

04/30/2018 - 00:56

పామర్రు, ఏప్రిల్ 29: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ సీనియర్ రాజకీయ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి 500 మంది అనుచరులతో ఆదివారం కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలిలో వైకాపా అధినేత జగన్‌మోహనరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేశారు. జగన్ కాటసానిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండవా కప్పారు.

04/30/2018 - 01:43

విజయవాడ, ఏప్రిల్ 29: రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయినా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. హైదరాబాద్‌లోని సచివాలయ భవనం, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, సిబ్బంది క్వార్టర్లను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

04/30/2018 - 04:02

రాజమహేంద్రవరం: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు మట్టిపని జోరుగా సాగుతోంది. జూన్‌లోపు నిర్దేశిత మట్టి పని పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు జరుగుతున్న క్రమంలో అడ్డుకట్టలు వేసి, మట్టి పనులు పూర్తిచేస్తున్నారు. పోలవరం పవర్‌హౌస్‌కు సంబంధించి ఎర్త్‌వర్కు గడువులోగా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కాంక్రీటు పనికి మరో ఆరు నెలల గడువు పొడిగించారు.

Pages