S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/26/2018 - 01:52

విజయవాడ, ఏప్రిల్ 25: తెలుగుదేశం పార్టీ సైకిల్ యాత్రలపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. పార్టీ వ్యూహాత్మక కమిటీ సమావేశం బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించారు. ఏఏ నియోజకవర్గాల్లో యాత్రలు ప్రారంభం కాలేదో చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

04/26/2018 - 00:11

విజయవాడ, ఏప్రిల్ 25: రాష్ట్రంపై జరుగుతున్న అన్ని కుట్రల్లోనూ గవర్నర్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ, అమిత్‌షా మాఫియా టీమ్ అని, వారు చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో గవర్నర్ పాత్రధారిగా ఉంటున్నారని ఆరోపించారు.

04/26/2018 - 00:10

విజయవాడ, ఏప్రిల్ 25: నెల్లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి అకాల మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివేకానందరెడ్డి తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

04/26/2018 - 00:09

విజయవాడ, ఏప్రిల్ 25: ఒప్పిచర్ల దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీనిపై తన నివాసం వద్ద గ్రీవెన్స్ కార్యాలయంలో బుధవారం పోలీస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఫిర్యాదు వచ్చిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశామని ముఖ్యమంత్రికి పోలీస్ అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ‘మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

04/26/2018 - 00:08

విజయవాడ, ఏప్రిల్ 25: ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ నృత్య మహోత్సవం ఈ నెల 27, 28, 29 తేదీల్లో నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరుగుతుంది. ‘నాట్య త్రిదళం’ పేరిట పరమశివునికి సమర్పణగా ఈ వేదిక జరగనుంది.

04/26/2018 - 02:55

విజయవాడ, ఏప్రిల్ 25: రాష్ట్రంలో ఏపీఐఐసీ ద్వారా వివిధ పరిశ్రమలు, సంస్థలకు కేటాయించిన భూములను సకాలంలో వినియోగంలో తీసుకొచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ ప్రాజెక్టులు - భూముల కేటాయింపు అంశంపై బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.

04/26/2018 - 00:07

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 25: పాలిసెట్-2018 పరీక్షలు ఏప్రిల్ 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌బి టెట్ చైర్మన్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ జీఎస్ పండాదాస్ తెలిపారు.

04/26/2018 - 00:06

విజయవాడ, ఏప్రిల్ 25: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మే 2న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరుగుతుంది. నిరుద్యోగ భృతి, తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

04/26/2018 - 00:06

సత్యవేడు/ తడ, ఏప్రిల్ 25: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటైన శ్రీసిటీ పారిశ్రామికవాడను చెన్నై, పుదుచ్చేరిలోని ఫ్రాన్స్ దేశం వాణిజ్య రాయబారి క్యాథరిన్ సువార్డ్ బుధవారం సందర్శించారు. శ్రీసిటీ అధ్యక్షులు రమేష్ సుబ్రహ్మణ్యం ఆమెకు స్వాగతం పలికి శ్రీసిటీలోని వౌలిక వసతులు, ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు.

04/26/2018 - 00:05

విజయవాడ, ఏప్రిల్ 25: ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో బాగా వెనుకబడిన జిల్లానేకాక 177 గిరిజన తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటని, శ్రీకాకుళం పట్టణంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే శాఖ మంత్రి పీయూష్ కుమార్ గోయల్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ ఉందని తెలిపారు.

Pages