S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/15/2018 - 04:12

విజయవాడ, మే 14: పిడుగుపాటు నుంచి ప్రజలను రక్షించేందుకు వీలుగా అన్ని పంచాయతీల్లో సైరన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిడుగులు పడే ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికగా సైరన్లు మోగించాలని తెలిపారు. సమాచార గోప్యత, రక్షణ అత్యంత కీలకమని అధికారులను ఆదేశించారు.

05/15/2018 - 04:09

కర్నూలు మే 14: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆశీస్సుల కోసమే వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. సోమవారం కర్నూలులో విలేఖరులతో మాట్లాడుతూ అలిపిరిలో అమిత్ షాపై చంద్రబాబు చేయించాడని జగన్ చెప్పటమే బీజేపీ, వైసీపీ లాలూచీకి నిదర్శనమన్నారు.

05/15/2018 - 04:07

విజయవాడ, మే 14: రాష్ట్రంలోకి గుజరాత్ నుంచి అనుమతి లేని పత్తి విత్తనాలు వస్తున్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయంపై సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా కట్టడి చేయాలని ఆదేశించారు.

05/01/2018 - 03:14

విజయవాడ, ఏప్రిల్ 30: వర్షాకాలం వచ్చేలోగా మే, జూన్ నెలల్లో వీలైనంత వేగంగా పోలవరం ఎర్త్‌వర్క్, కాంక్రీట్ పనులు చేపట్టాలని, లక్ష్యాన్ని అధిగమించినప్పుడే ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయగలమని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్దేశించారు. నీరు-ప్రగతి పనులు కూడా ముమ్మరంగా జరగాలని, తాను ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తానని వెల్లడించారు.

05/01/2018 - 02:57

గుంటూరు, ఏప్రిల్ 30: చట్టసభల హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.

05/01/2018 - 02:55

తిరుపతి, ఏఫ్రిల్ 30: ప్రముఖ సంఘసేవకురాలు సుధానారాయణమూర్తి సోమవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు సోమవారం ఉదయం 6 గంటలకు సుధానారాయణమూర్తితో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో సుధానారాయణమూర్తికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

05/01/2018 - 02:55

తిరుపతి, ఏప్రిల్ 30: ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో తిరుపతి క్షేత్రంలో ఇచ్చిన హామీలను గుర్తు చేయాలని పార్టీకు అతీతంగా సోమవారం తిరుపతిలో నిర్వహిస్తున్న ధర్మపోరాట బహిరంగ సభకు భారీ భద్రత కల్పించారు. సుమారు 2వేలమంది పోలీసులను నియమించారు. సోమవారం సాయంత్రం 5గంటలకు ఎస్వీయు తారకరామస్టేడియంలో ఈ ధర్మపోరాట సభ ప్రారంభం అయ్యింది.

05/01/2018 - 02:53

విజయవాడ, ఏప్రిల్ 30: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లక్ష కోట్లు సంపాదించడం వంచన కాదా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ఓ ప్రకటనలో విశాఖలో వైకాపా వంచనదినంపై విరుచుకుపడ్డారు. వంచకులకు నయవంచన దినం పాటించే అర్హత ఉందా అన్నారు. 12 ఛార్జిషీట్లు ఉన్న జగన్ వంచకుడా.. లేక 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పేదలకు సేవచేసే చంద్రబాబు వంచకుడా అని ప్రశ్నించారు.

05/01/2018 - 02:53

తిరుపతి, ఏప్రిల్ 30: ప్రధాని నరేంద్రమోదీ ఎంతో గొప్ప వ్యక్తి అని భావించానని, అయితే ఆకారం భీకరమని, లోపలంతా డొల్ల అనే విషయం ఆయన ఆంధ్రరాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుతో తేటతెల్లమయ్యిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

05/01/2018 - 02:51

విజయవాడ, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో స్వయం ఉపాధి యూనిట్ల రుణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు 10వ తేదీ వరకు పొడిగించినట్టు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ కోట్ల శివశంకరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

Pages