S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/26/2018 - 00:04

విజయవాడ, ఏప్రిల్ 25: ఆళ్లగడ్డలో టీడీపీ నేతపై రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య రాజీకి సంబంధించిన సమావేశం గురువారానికి వాయిదా పడింది. మంత్రి, సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఇటీవలి కాలంలో మళ్లీ విభేదాలు తలెత్తడంతో వీరి వ్యవహారం పార్టీకి తలనెప్పిగా మారింది. ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది.

04/26/2018 - 00:03

విజయవాడ, ఏప్రిల్ 25: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో అన్న క్యాంటీన్ల ఏర్పాట్లపై పురపాలక శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 71 మున్సిపాలిటీల్లో 203 అన్న క్యాంటీన్లు మంజూరు చేశామన్నారు.

04/25/2018 - 03:31

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 24: రాష్ట్రం బలంగా ఉంటేనే కేంద్రం కూడా బలంగా ఉంటుందని, అధికారాల్లో కేంద్రం, రాష్ట్రం ఒకటేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలను బలోపేతం చేశారని, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎపుడూ జరగని అభివృద్ధి జరిగిందంటే అది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

04/25/2018 - 03:29

కర్నూలు, ఏప్రిల్ 24: రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించి అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు కుట్ర పన్నాయని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. కర్నూలులో మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశ దిశ లేని వైకాపా అధినేత జగన్ సీఎం కుర్చీ కోసం అర్రులు చాస్తూ దాన్ని అందుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు.

04/25/2018 - 03:26

కాకినాడ, ఏప్రిల్ 24: ఏపీ ఎంసెట్-2018లో భాగంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న పరీక్షలు మంగళవారంతో తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తయ్యాయి. బుధవారం అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మొత్తం 93.69 శాతం హాజరు నమోదయినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు.

04/25/2018 - 03:25

అనంతపురం, ఏప్రిల్ 24: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అనంతపురంలో మంత్రి పరిటాల సునీత, జడ్పీటీసీ సభ్యులు మంగళవారం ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసార ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.

04/25/2018 - 03:23

శ్రీకాకుళం, ఏప్రిల్ 24: ప్రత్యేక హోదా కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున ప్రధానితో ధర్మపోరాటం చేస్తున్నారని, గవర్నర్ రాయబారానికి వచ్చినా ఈ పోరాటం ఆగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని చెప్పడం కంటే, జరుగుతున్నది, జరిగేది గవర్నర్ కేంద్రానికి చెప్పాలని, అలా చేయకపోవడం వల్లే ఏపీలో ప్రత్యేక హోదా పోరు ధర్మపోరాటంగా మారిందన్నారు.

04/25/2018 - 03:23

సింహాచలం, ఏప్రిల్ 24: రాష్ట్రంలో కొత్తగా 65 గురుకుల పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలు మంజూరయ్యాయని మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం అడివివరం గురుకుల పాఠశాలలో రాష్ట్ర గురుకుల విద్యార్థుల శిక్షణా శిబిరాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడారు.

04/25/2018 - 03:22

విజయవాడ, ఏప్రిల్ 24: 2022 వరకు హజ్ సబ్సిడీ కొనసాగిస్తూ అంచెలంచెలుగా సబ్సిడీ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పట్టించుకోకుండా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 2018లోనే హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసిందని ఏపీ స్టేట్ హజ్ కమిటీ మండిపడింది.

04/25/2018 - 03:21

విజయవాడ, ఏప్రిల్ 24: వివిధ విభాగాలను ఈ-ప్రగతి వేదికతో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ-ప్రగతి అనుసంధానంపై మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని విభాగాలను ఈ-ప్రగతి ఫ్లాట్‌ఫారంపైకి తీసుకువచ్చి, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.

Pages