S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/25/2018 - 03:13

విజయవాడ, ఏప్రిల్ 24: రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఈనెల 28తేదీ ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కోట్ల శివశంకరరావు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.

04/25/2018 - 03:12

కదిరి, ఏప్రిల్ 24: ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లయినా పట్టుకుంటానని సినీనటుడు, బాగేపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయికుమార్ పేర్కొన్నారు.

04/24/2018 - 03:58

చిత్తూరు, ఏప్రిల్ 23: జిల్లాలో వివిధ కేసుల కింద స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్లలో శిథిలావస్థకు చేరుకున్న 607 నాటు తుపాకులను సోమవారం చిత్తూరులోని పోలీస్ మైదానంలో పోలీస్ అధికారులు రోడ్డు రోల్లరుతో తొక్కించి ధ్వంసం చేశారు.

04/24/2018 - 04:24

నరసాపురం: పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు సహా స్థానిక సంస్థలన్నింటిలో సంపూర్ణ మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసాపురం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల సాయితో పాటు 16 మంది టీడీపీ కౌన్సిలర్లు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు.

04/24/2018 - 03:54

కర్నూలు, ఏప్రిల్ 23: దేశ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోందన్న ఆందోళనలో కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా పరిణమించింది. జనాభా తగ్గుదల కారణంగా కేంద్రం నుంచి ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధుల వాటాలో దక్షిణాది రాష్ట్రాలు గణనీయంగా నష్టపోతున్నాయని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

04/24/2018 - 03:51

విజయవాడ, ఏప్రిల్ 23: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజలు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు అరగంట సేపు లైట్లు తీసివేసి బ్లాక్‌డేగా పాటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.

04/24/2018 - 03:51

విజయవాడ, ఏప్రిల్ 23: ఈనెల 1వ తేదీ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించిన సీఎఫ్‌ఎంఎస్ విధానం మొత్తంపై గందరగోళంగా తయారైంది. ఏప్రిల్ 1వ తేదీ తరువాత రిటైరైన వారికి ఈరోజు పెన్షన్ అందలేదు. దానికి కారణం గతంలో వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారికున్న ఐడీ నెంబర్, ఇతర వివరాలు సిస్టమ్‌లో డిలీట్ కాకపోవటం, కొత్తగా ఐడీ నెంబరు క్రియేట్ కాకపోవటం వలన పెన్షన్ పేమెంట్ చేయటానికి వీలు లేకుండా ఉంది.

04/24/2018 - 03:50

కర్నూలు, ఏప్రిల్ 23: తన తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి చిరకాల స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మధ్య ఏర్పడిన వివాదంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందే భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మనస్ఫర్థలు బయటపడినా నాటి ఎన్నికల దృష్ట్యా టీడీపీ అధినేత జోక్యంతో ఏవీ పార్టీ కోసం పనిచేశారు.

04/24/2018 - 03:49

విజయవాడ, ఏప్రిల్ 23: కర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు తెలుగుదేశం అధిష్ఠానానికి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. గతంలో ఇరువర్గాల మధ్య రాజీ ప్రయత్నంతో విభేదాలు సద్దుమణిగినప్పటికీ, ఆళ్లగడ్డ ఘటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆళ్లగడ్డలో ఆదివారం జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

04/24/2018 - 03:49

తిరుపతి, ఏప్రిల్ 23: టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా నియమితులై అన్యమతస్తురాలిగా విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే అనిత తరహాలోనే టీటీడీ చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేకుంటే ప్రభుత్వమే ఆయన్ను తొలగించాలని హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ డిమాండ్ చేశారు.

Pages