S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/20/2017 - 23:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: వధూవరుల వివాహ పరిచయ ఆన్‌లైన్ పోర్టల్స్‌ను నిర్వహించే మాట్రిమోనీ డాట్‌కామ్ షేర్లు గురువారంనుంచి దేశీయ ప్రధాన స్టాక్ మార్కెట్లయిన బిఎస్‌ఇ, ఎన్‌ఇలలో మదుపరులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సంస్థ గత వారం తన తొలి పబ్లిక్ ఇష్యూను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నెల 11-13వరకు గడువులోగా రూ.500 కోట్ల విలువైన ఈ ఐపిఓ 4.44 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది.

09/20/2017 - 23:05

ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల సంస్థ (ఒఎన్‌జిసి) అరేబియా సముద్రంలోని తన ప్రధాన ముంబయి హై చమురు క్షేత్రాలకు పశ్చిమంగా చెప్పుకోదగ్గ పరిమాణంలో చమురు నిల్వలను కొత్తగా కనుగొనిందని ఆ సంస ఉన్నతాధికారి చెప్పారు. ఈ డబ్ల్యుఓ-24-3 బావిలో దాదాపు 20 మిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు.

09/20/2017 - 23:03

ప్రముఖ స్మార్ట్ఫోన్స్ తయారీ సంస్థ శాంసంగ్ పండుగ ఆఫర్లను ఆవిష్కరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులు తమ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా శాంసంగ్ ఇండియా ‘నెవర్ మైండ్ ఆఫర్’ను ప్రకటించింది.

09/20/2017 - 23:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశ రాజధాని ఢిల్లీలోని నౌరోజి నగర్‌లో ఏర్పాటు చేయబోయే వాణిజ్య సముదాయం ప్రాజెక్టును ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ రంగంలోని నేషనల్ బల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బిసిసి) బుధవారం తెలిపింది.

09/21/2017 - 22:29

నిర్మాణ రంగంపై జిఎస్‌టి అమలు కారణంగా అటు వినియోగదారుడు, ఇటు బిల్డర్ అనవసర భారాన్ని మోయాల్సి వస్తోంది.
జిఎస్‌టి వలన నిర్మాణ వ్యయం
ఎస్‌ఎఫ్‌టికి 150 నుంచి 200 రూపాయలు పెరిగిపోయింది. జిఎస్‌టి రాక ముందు ప్లాట్ కొనుగోలు చేసిన మొత్తంలో ఎంత మొత్తాన్ని వైట్‌గా చూపిస్తారో, ఆ మొత్తానికి ఆరు శాతం ఫీజ్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది 12 శాతానికి పెరిగింది.

09/20/2017 - 22:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా మూడు ఐటిడిసి హోటళ్లనుంచి వైదొలగి వాటిలోని తన వాటాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.

09/20/2017 - 00:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశ ఆర్థిక వృద్ధి మందగించడానికికారణాలు, దాన్ని సరిదిద్దడానికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర ప్రజెంటేషన్‌ను రూపొందించే పని ఇంకా పూర్తి కాకపోవడంతో దేశ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి ఆర్థిక మంత్రి, ఆ ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జరపాల్సిన సమావేశం వాయిదా పడింది.

09/20/2017 - 00:55

ముంబయి, సెప్టెంబర్ 19: దేశ ఆర్థిక వ్యవస్థ గత ఏడాది సెప్టెంబర్‌నుంచి దిగజారుతూనే ఉందని, ఈ మాంద్యం నిజమైందే తప్ప సాంకేతికపరమైంది కాదని ఎస్‌బిఐ రిసెర్స్ ఒక నివేదికలో స్పష్టం చేసింది.

09/20/2017 - 00:54

ముంబయి, సెప్టెంబర్ 19: ఈ నెలాఖరుకుకానీ, లేదా వచ్చే నెల ప్రారంభానికల్లా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంతగా బొగ్గు సరఫరాలు లభిస్తాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటున్నందున ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు.

09/20/2017 - 00:52

హైదరాబాద్, సెప్టెంబర్ 19: పెట్రోలియం ఉత్తత్తులపై వచ్చే ఆదాయాన్ని వౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉపయోగించే ప్రభుత్వ విధానాన్ని యుపిఏ ప్రభుత్వంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేసిన ఎస్ జైపాల్ రెడ్డి తప్పుబట్టారు. డీజిల్, పెట్రోలు ధరల పెరుగుదల మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆయన అన్నారు.

Pages