S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/21/2017 - 00:34

హైదరాబాద్, మార్చి 20: పొగాకు సాగుదారులకు సహేతుకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమలు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ఫార్మర్స్ అసోసియేషన్ (ఫైసా) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చాల పరిశ్రమలు జిఎస్‌టిని స్వాగతించి అమలు కోసం ఆశగా ఎదురు చూస్తుంటే, పొగాకు రైతులు మాత్రం చాలా ఆందోళనతో ఉన్నారని, జిఎస్‌టి తమ జీవితాలను ఛిద్రం చేసే అవకాశం ఉందని ఫైసా జనరల్ సెక్రటరీ మురళిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

03/21/2017 - 00:33

సోమవారం బెంగళూరులో మార్కెట్‌కు పరిచయమైన హోండా డబ్ల్యుఆర్-వి కారు.
దీని ధర 7.75 లక్షల నుంచి 9.99 లక్షల రూపాయల మధ్య ఉంది

03/21/2017 - 00:31

హైదరాబాద్, మార్చి 20: సిర్పూర్-కాగజ్‌నగర్ పేపరు మిల్లుసహా ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కె తారకరామారావు స్పష్టం చేశారు. అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో కలిసి బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలతో మంత్రి కెటిఆర్ సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

03/21/2017 - 00:31

హైదరాబాద్, మార్చి 20: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి బ్యాంక్ ఖాతాలన్నింటినీ ఆధార్ సీడింగ్ చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలపై సచివాలయంలో సోమవారం ఆర్థిక శాఖ, బ్యాంకర్లతో ఎస్‌పి సింగ్ సమావేశం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీల టాస్క్ఫోర్స్ కమిటీలో ఐటి అధికారులను కూడా చేర్చాలని ఆయన సూచించారు.

03/21/2017 - 00:30

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్రంలో 80 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న 2,500 అట్టపెట్టెల కంపెనీలను ఆదుకోవాలని ఈ కంపెనీల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. అట్టపెట్టెల తయారీదారుల సంఘం ప్రతినిధులు ఆదిత్య శర్మ, సాగర్‌గాల, ఎంఎల్ అగర్వాల్, ఎంవిఎం భరత్ తదితరులు ఎఫ్‌టాప్సి ఆడిటోరియంలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

03/21/2017 - 00:28

న్యూఢిల్లీ, మార్చి 20: రైతులకు ఎక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీలను క్రమబధ్దీకరించాలని వైఎస్‌ఆర్‌సిపి లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభలో సప్లిమెంటరీ డిమాండ్లపై మాట్లాడుతూ చివరకు సూక్ష్మరుణ సంస్థలు కూడా రైతుల నుండి అధిక వడ్డీ వసూలు చేయటం అన్యాయమని విమర్శించారు.

03/20/2017 - 00:32

న్యూఢిల్లీ, మార్చి 19: బ్యాంకుల్లో మొండి బకాయిలు గణనీయంగా పేరుకుపోతుండటం పట్ల బ్యాంకుల బోర్డు బ్యూరో (బిబిబి) చీఫ్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

03/20/2017 - 00:30

న్యూఢిల్లీ, మార్చి 19: ప్రస్తుతం ద్రవ్యోల్బణం గణాంకాలు వాస్తవ పరిస్తితిని ప్రతిబింబించడం లేదని పార్లమెంటరీ కమిటీ ఒకటి అభిప్రాయ పడుతూ వైద్య సేవలు, విద్యారంగం లాంటి వాటిలో పెరిగి పోతున్న ఖర్చులను ప్రతిబింబించేందుకు వీలుగా సేవల రంగం కోసం ప్రత్యేక ధరల సూచీని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.

03/20/2017 - 00:30

న్యూఢిల్లీ, మార్చి 19: ఆర్థిక సమస్యలతో సమతమతమవుతున్న ఎయిర్ కోస్టా విమానయాన సంస్థను ఇప్పుడు సిబ్బంది వలస మరింత కుంగదీస్తోంది. సిబ్బందికి వేతనాలు సరిగా చెల్లించలేకపోతుండటంతో గత కొద్ది వారాల్లో 40 మంది పైలెట్లు సహా పలువురు ఉద్యోగులు ఈ సంస్థకు గుడ్‌బై చెప్పారు.

03/20/2017 - 00:28

ముంబయి, మార్చి 19: వజ్రాల వ్యాపారంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భారత్‌తో నేరుగా సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు జింబాబ్వే ప్రభుత్వం ప్రకటించింది. ‘మా దేశంలో గనుల నుంచి వెలికితీసిన వజ్రాలను భారత్ ఇప్పటివరకూ మధ్యవర్తుల ద్వారా దిగుమతి చేసుకుంటోంది.

Pages