S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/27/2019 - 02:03

ముంబయి, జనవరి 26: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం ట్రేడింగ్‌ను పరిశీలిస్తే, మదుపరులు, బ్రోకర్లతో దాడుగు మూతలాడినట్టు స్పష్టమవుతుంది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ మార్కెట్ రాబోయే రోజుల్లో ఏ దిశలో పయనిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. విశే్లషకులు, నిపుణులతోసహా ఎవరి అంచనాలకూ అందని రీతిలో ఈవారం స్టాక్ మార్కెట్ ప్రస్థానం కొనసాగింది.

01/27/2019 - 02:01

ముంబయి, జనవరి 26: రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వాటాలను జాయింట్ డెవలప్‌మెంట్ (జెడీ) విధానంతో ఆరంభించడంతో ఇటీవల కొనే్నళ్లుగా ప్రగతిపథంలో ఉన్న నిర్మాణ రంగం ప్రస్తుతం జీఎస్టీ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని జాయింట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులపై విధించిన కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన జరిగే అభివృద్ధి తిరోగమనంలో పడిందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది.

01/27/2019 - 01:59

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,172.00
8 గ్రాములు: రూ.25,376.00
10 గ్రాములు: రూ. 31,720.00
100 గ్రాములు: రూ.3,17,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,392. 513
8 గ్రాములు: రూ. 27,140.104
10 గ్రాములు: రూ. 33,925.13
100 గ్రాములు: రూ. 3,39,251.3
వెండి
8 గ్రాములు: రూ. 331.20

01/27/2019 - 01:59

న్యూఢిల్లీ, జనవరి 26: ప్రభుత్వానికి పన్ను చెల్లించాలన్న డిమాండ్‌తో మైండ్‌ట్రీలో వీజీ సిద్ధార్ధ, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సంస్థలకు చెందిన కొన్ని వాటాలను ఐటీ శాఖ స్తంభింపజేసింది. ఐటీ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం బెంగళూరు కేంద్రంగా గల కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులపై తీవ్ర ప్రభావం చూపనుంది. మైండ్‌ట్రీలో వీజీ సిద్ధార్ధకు 21 శాతం వాటాలు ఉన్నాయి.

01/25/2019 - 20:47

న్యూఢిల్లీ, జనవరి 25: నిపుణత, సామర్ధ్యాలను అభివృద్థి చేసే సంస్థగా గుర్తింపు ఉన్న ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌కు గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక లాభాల్లో 1.5 శాతం తగ్గుదల నమోదైంది. ఈ మూడు నెలల్లో రూ.19.4 లాభాలు వచ్చాయని, గడచిన యేడాది ఇదే త్రైమాసికంలో రూ.19.7 కోట్ల లాభాలు వచ్చాయని అధికారులు వివరించారు.

01/25/2019 - 20:46

స్టాక్ మార్కెట్ శుక్రవారం ఆశాజనకంగానే మొదలైంది. మధ్యాహ్నం వరకూ లాభాల్లోనే కొనసాగింది. కానీ, ద్వితీయార్ధంలో అమ్మకాల ఒత్తిళ్లు పెరగడంతో నష్టాలు తప్పలేదు. సెనె్సక్స్ అత్యధికంగా 36,474.48 పాయింట్లు, అత్యల్పంగా 35,953.15 పాయింట్లు నమోదయ్యాయి. చివరి క్షణాల్లో కొంత వరకూ మెరుగుపడడంతో, చివరికి 36,025.54 పాయింట్ల వద్ద సెనె్సక్స్‌కు తెరపడింది.

01/25/2019 - 20:34

న్యూఢిల్లీ, జనవరి 25: ఖాతాదారులకు విలువైన సేవలు అందించడంతలో ప్రభుత్వ రంగంలోవ పని చేస్తున్న భారత తపాలా చెల్లింపుల బ్యాంక్ (ఐపీపీబీ) ముందున్నదని, ఈ కారణంగానే బ్యాంకింగ్ రంగంలో దూసుకెళుతున్నదని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. మహామతి ప్రనాథ్‌జీ పోస్టల్ స్టాంపును ఆయన శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు.

01/25/2019 - 20:32

న్యూఢిల్లీ, జనవరి 25: మారుతీ సుజుకీ ఇండియా హర్యానాలో ‘జిమ్’ పేరిట సరికొత్త తయారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ‘జపనీస్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ (జిమ్) పేరిట ఏర్పాటు కానున్న ఈ యూనిట్‌కోసం మారుతీ సుజుకీ ఇండియా, హర్యానా రాష్ట్రాల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఇందులో 500 మంది యువకులకు శిక్షణను ఇస్తారు.

01/25/2019 - 20:31

ముంబయి, జనవరి 25: కొన్ని విదేశీ బ్యాంకుల తరహాలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషన్ (ఎస్‌బీఎం) సైతం ఆరోగ్యప్రదమైన, విశాల దృక్పథంతో భారత్‌లో వ్యాపార విస్తరణకు పూనుకుంది. వచ్చే రెండేళ్లలో తన శాఖా కార్యాలయాలను ద్విగుణీకృతం చేసి రుణాల పంపిణీని రూ.5వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1994 నుంచి ఇక్కడ ఓ శాఖా కార్యాలయంగా సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం నాలుగు శాఖా కార్యాలయాలను నిర్వహిస్తోంది.

01/25/2019 - 20:30

న్యూఢిల్లీ, జనవరి 25: గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్సూమర్ హెల్త్‌కేర్ (జీఎస్‌కేసీహెచ్) ఇండియా కంపెనీని హిందూస్థాన్ యూనీ లీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్)లో విలీనం చేసేందుకు సంబంధించిన పథకానికి వాణిజ్య నియంత్రణ విభాగం ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది.

Pages