S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/29/2019 - 23:48

హైదరాబాద్, జనవరి 29: రియల్ ఎస్టేట్ యజమానుల కోసం వినూత్నమైన స్టాంజా ఎస్టేట్ యాప్‌ను స్టాంజా లింగ్ విడుదల చేసింది. 2021 నాటికి ఒక లక్ష పడకల సామర్థ్యానికి చేరుకోవడమే లక్షంగా పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రాపర్టీ లిస్టింగ్స్‌కు వనరులను సృష్టించనుంది. ప్రాపర్టీ యజమానులకు అధిక రాబడులను ఆఫర్ చేస్తుంది. స్టూడెంట్ లింగ్ అసెట్‌గా రియల్-టైమ్ ప్రాపర్టీ అవకాశాల విశే్లషణకు అవకాశం కల్పిస్తుంది.

01/29/2019 - 23:47

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,172.00
8 గ్రాములు: రూ.25,376.00
10 గ్రాములు: రూ. 31,720.00
100 గ్రాములు: రూ.3,17,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,392.513
8 గ్రాములు: రూ. 27,140.104
10 గ్రాములు: రూ. 33,925.13
100 గ్రాములు: రూ. 3,39,251.13
వెండి
8 గ్రాములు: రూ. 332.00

01/29/2019 - 23:47

ముంబయి, జనవరి 29: విదేశాల్లో తలదాచుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్ మోదీకి చెందిన పోష్ బంగ్లా కూల్చివేత పనులు రెండు రోజుల విరామానంతరం మంగళవారం మళ్లీ ఆరంభమయ్యాయి. అంతకు ముందు ఈ భవనం కూల్చివేత చేపట్టిన సందర్భంగా అతి విలాసవంతమైన ఫిట్టింగ్‌లు ఉన్నట్టు కనుగొన్న అధికారులు కూల్చివేత పనులను రెండు రోజులపాటు ఆపివేయడం జరిగింది.

01/29/2019 - 23:46

న్యూఢిల్లీ, జనవరి 29: అక్రమ లావాదేవీలు నడుపుతున్న నాలుగు సంస్థలకు మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ మంగళవారం సుమారు రూ.64 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ కంపెనీల అనుచిత లావాదేవీలు బీఎస్సీ స్టాక్ మార్కెట్ ఐశ్చికాల విషయంలో మదుపర్లను తప్పుదోవ పట్టించినట్టు సెబీ గుర్తించింది.

01/29/2019 - 04:54

విజయవాడ : విభజన తరువాత తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి శ్రమకు ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ను రాష్ట్రానికి రప్పించడంలో ముఖ్యమంత్రి కృతకృత్యులయ్యారు. అనంతపురం జిల్లాల్లో రాష్ట్రానికే మణిహారంగా కియా మోటార్సు వెలుగొందనుంది.

01/29/2019 - 03:31

న్యూఢిల్లీ, జనవరి 28: టైర్-2 సిటీల్లోని విమానాశ్రయాల్లో వౌలిక సదుపాయాలను పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా సింగపూర్‌కు వెళ్లే భారత టూరిస్టుల సంఖ్య పెరగవచ్చన్న అభిప్రాయం సింగపూర్ ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన లైఫ్‌స్టైల్ సర్వీసెస్ బ్రాండ్ అంచనాల మేరకు ఇకపై ఇరు దేశాల మధ్య విమాన ఫ్రీక్వెన్సీలు గణనీయంగా పెరుగుతాయి.

01/29/2019 - 03:29

ముంబయి, జనవరి 28: హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు సరికొత్త సర్వీసును ప్రారంభిస్తున్నట్టు దేశీయ విమానయాన రంగంలో కీలకమైన ఎయిర్ ఇండియాలోని ప్రధాన విభాగం ఎలియన్స్ ఎయిర్ ప్రకటించింది. ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ విమానం హైదరాబాద్‌లో బయలుదేరి, నాసిక్ మీదుగా అహ్మదాబాద్‌కు వెళుతుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన దేశవాళీ విమాన సర్వీసుల అనుసంధానం ‘ఉడాన్’లో భాగంగా ఎలియన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

01/29/2019 - 01:57

న్యూఢిల్లీ, జనవరి 28: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు భవిష్యత్తులో ద్రవ్యలోటుకు కారణమవుతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

01/29/2019 - 01:56

ముంబయి, జనవరి 28: ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సోమవారం ప్రతికూల సూచీలు నమోదయ్యాయి. సోమవారం జరగాల్సిన కేంద్ర కేబినెట్ సమావేశం జరగకపోవడం, ఈనెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా, మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుండడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.

01/29/2019 - 01:54

న్యూఢిల్లీ, జనవరి 28: మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తన ప్రముఖ బ్రాండ్ కారు బెలనో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 5.40 నుంచి 8.77 లక్షల మధ్య ఉంటుంది. ఈ కొత్త వెర్షన్‌లో స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్‌ను బిగించారు. ఈ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, టైర్లు, పిస్టన్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినట్టు మారుతీ సుజుకీ ఒక ప్రకటనలో తెలిపింది.

Pages