S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/28/2019 - 23:18

న్యూఢిల్లీ, జనవరి 28: పెళ్లిళ్ల సీజీన్ కనకం ధరలకు కొత్త కాంతులిచ్చింది. విఫణిలో సోమవారం తులం (10 గ్రాముల) బంగారం ధర 350 రూపాయలు పెరిగి మొత్తం రూ.33,650 పలికింది. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ వల్ల బంగారానికి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని విశే్లషకులు భావిస్తున్నారు. వెండి ధరలు సైతం కిలోపై 850 రూపాయలు పెరిగి మొత్తం ధర రూ.40,900 చేరింది.

01/28/2019 - 23:17

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,172.00
8 గ్రాములు: రూ.25,376.00
10 గ్రాములు: రూ. 31,720.00
100 గ్రాములు: రూ.3,17,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,392.513
8 గ్రాములు: రూ. 27,140.104
10 గ్రాములు: రూ. 33,925.13
100 గ్రాములు: రూ. 3,39,251.3
వెండి
8 గ్రాములు: రూ. 330.40

01/28/2019 - 04:28

అనంతపురం : రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో భారతదేశంలోనే తొలిసారిగా దక్షిణ కొరియా కార్ల దిగ్గజం ఏర్పాటు చేసి కియా కంపెనీ జిల్లా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి కాబోతోంది. ఈ కంపెనీ ఇండియాలో తయారుచేసిన తన తొలికారును ఈ నెల 29వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు.

01/28/2019 - 01:39

న్యూఢిల్లీ, జనవరి 27: సీఎన్‌జీ వాహనాలను వినియోగించడంలో ఢిల్లీ దేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈనెల ఒకటవ తేదీనాటి గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రంలోలో 10,58,111 సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. పదిలక్షల వాహనాల మైలురాయిని అధిగమించిన తొలి రాష్ట్రం కూడా ఢిల్లీ కావడం విశేషం. రాష్ట్ర రాజధానిసహా ఎన్నో నగరాలు, పట్టణాలు తీవ్రమైన కాలుష్య సమస్యతో అల్లాడుతున్న విషయం తెలిసిందే.

01/28/2019 - 01:38

న్యూఢిల్లీ, జనవరి 27: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఇన్ఫోసిస్ వంటి బడా సంస్థలు ఇప్పటికే త్రైమాసిక ఫలితాలను ప్రకటించగా, భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల మరికొన్ని కంపెనీల ప్రకటనలతో స్టాక్ మార్కెట్‌కు మరింత ఊపు ఖాయమని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి కూడా ఆ వాదనకు బలాన్నిస్తోంది.

01/28/2019 - 01:36

న్యూఢిల్లీ, జనవరి 27: దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో సేంద్రియ రసాయనాలు ఉనికిని చాటుకుంటున్నాయి. 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఈ రసాయనాల ఎగుమతుల విలువ పెరుగుతునే ఉంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.35,241.28 కోట్ల విలువైన రసాయనాలను ఎగుమతి చేయడం జరిగింది. 2010-11లో ఈ మొత్తం 41,051.75 కోట్ల రూపాయలకు పెరిగింది.

01/28/2019 - 01:35

న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో పత్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశ గా వెళుతున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 355 లక్షల బేళ్లను ఉ త్పత్తి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఒకొక్కటీ 170 కిలోలతో బేళ్లను సిద్ధం చేస్తారు. ఈ ఆర్థిక సం వత్సరానికి ఎంచుకున్న లక్ష్యంలో ఇప్పటికే 324.83 లక్షల బేళ్ల ఉత్పత్తి జరిగినట్టు ప్రాథమిక అంచనా నివేదిక స్పష్టం చేస్తున్నది.

01/28/2019 - 01:32

భువనేశ్వర్, జనవరి 27: ఒడిశాలోని పారదీప్ ఓడరేవునుంచి ఈ యేడాది 110 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయాలన్న లక్ష్యం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఓడరేవు నుంచి 102 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగింది. దీన్ని మరో 11.56 శాతం పెంచాలన్న లక్ష్యం ఉందని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా జరిగిన సభలో మాట్లాడుతూ పారదీప్ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రింకేష్ రాయ్ తెలిపారు.

01/27/2019 - 04:29

న్యూఢిల్లీ: రానున్న పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నగల వ్యాపారులు, రిటైలర్లు కొనుగోళ్ల కోసం ఎగబడుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 140 రూపాయల వరకు అత్యధికంగా పెరిగింది. దీంతో ఈ వారాంతానికి 10 గ్రాముల బంగారం 33,000 వేల రూపాయలకు చేరుకుంది.

01/27/2019 - 02:04

న్యూఢిల్లీ, జనవరి 26: దేశీయంగా పేరెన్నికగన్న ‘శీఘ్రంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువులు’ (ఎఫ్‌ఎంసీజీ) తయారీ సంస్థల్లో ఒకటైన ‘ఇమామీ’ జర్మనీకి చెందిన పర్సనల్ కేర్ బ్రాండ్ ‘క్రీమ్ 21’ కంపెనీ నిర్వహణను చేపట్టబోతోంది. ఇమామీ శుక్రవారం నాడిక్కడ ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. ఐతే ఇందుకోసం ఎంతమొత్తం వెచ్చించేదీ ఆ సంస్థ వెల్లడించలేదు.

Pages