S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/17/2018 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర తీసుకుంటున్న చర్యలు, ఆర్‌బీఐ తీర్మానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఇటీవల బ్యాంక్‌లకు చేరుతున్న డబ్బు స్పష్టం చేస్తున్నది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, రెపో రేట్‌ను ఇటీవలే ఆర్‌బీఐ పెంచిన విషయం తెలిసిందే. దీనికితోడు కేంద్రం దివాలా చట్టాన్ని చురుగ్గా అమలు చేస్తున్నది. దీనితో మొండి బకాయులు క్రమంగా తిరిగి రావడం మొదలైంది.

08/17/2018 - 00:45

ముంబయి, ఆగస్టు 16: రూపాయి పతనం గురువారం కూడా కొనసాగింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు పడిపోయి, 70.15 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 70 మార్కుకన్నా కిందికి దిగజారడం చరిత్రలో ఇదే మొదటిసారి. టర్కీ కరెన్సీ సంక్షోభం ప్రతికూల ప్రభావం వల్ల రూపాయి బలహీనపడుతోంది.

08/16/2018 - 13:32

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 46 పాయింట్లు నష్టపోయి 37,805 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 11,421 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.

08/16/2018 - 13:28

ముంబయి: రూపాయి మరింత బలహీనపడింది. అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి విలువ ఎన్నడూ లేని రీతిలో భారీగా గురువారం ట్రేడింగ్‌లో తాజా జీవన కాల కనిష్ఠానికి పడిపోయింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.32కు చేరింది.

08/16/2018 - 01:28

న్యూఢిల్లీ: కరెన్సీ మార్కెట్‌లో ఎలాంటి అనుచిత ఒడిదుడుకులు తలెత్తినప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి భారత్ తగినన్ని విదేశీ మారకద్రవ్య నిల్వలను కలిగి ఉన్నదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కరెన్సీ మార్కెట్ పరిణామాలను జాగ్రత్తగా గమనించడం జరుగుతోందని కూడా ఆయన బుధవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పలు సందేశాలలో పేర్కొన్నారు.

08/16/2018 - 01:30

న్యూఢిల్లీ, ఆగస్టు 15: భారత స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతున్నప్పటికీ దానివల్ల బాగా లాభపడుతున్నది మార్కెట్ విలువ ఎక్కువగా గల పెద్ద కంపెనీలే. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేక పోయాయి.

08/16/2018 - 01:08

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు ఇటీవల మదుపరులను బాగా ఆకట్టుకున్నాయి. మదుపరులు జూలై నెలలో భారీగా రూ. 10,585 కోట్ల నిధులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఈక్విటీ ఎంఎఫ్)లలో పెట్టుబడులుగా పెట్టారు.

08/16/2018 - 01:32

న్యూఢిల్లీ, ఆగస్టు 15: నానాటికీ పెరుగుతున్న బ్యాంకుల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏల) విలువను తగ్గించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన బ్యాంకుల అకౌంట్లను ఆడిట్ చేయనుంది. దాదాపు 200కు పైగా పెద్ద అకౌంట్ల లావాదేవీలను నిశితంగా పరిశీలించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీని వల్ల బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువను తగ్గించేందుకు వీలవుతుంది.

08/16/2018 - 01:05

టోరంటో, ఆగస్టు 15: స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ శక్తిని తక్కువగా వినియోగించడంతోబాటు, బ్యాటరీల జీవిత కాలాన్ని పొడిగించేందుకు దోహదం చేసే ఓ ప్రత్యేక యాప్‌ను ఇక్కడి శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఈ శాస్తవ్రేత్తల్లో భారత సంతతికి చెందిన క్షీరసాగర్ నాయక్ కూడా ఒకరు కావడం విశేషం. ఈ యాప్ ద్వారాప్రతిరోజూ స్మార్ట్ఫోన్ బ్యాటరీ కనీసం గంటకుపైగా అదనంగా పనిచేస్తుంది.

08/15/2018 - 05:06

ముంబయి: రెండు రోజుల నష్టాలకు తెరదించుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి బలపడ్డాయి. ప్రధానంగా ఫైనాన్సియల్, హెల్త్‌కేర్, ఐటీ రంగాల షేర్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి. జూలై నెలలో ద్రవ్యోల్బణం తగ్గడం, డాలర్‌తో పోలిస్తే టర్కీ కరెన్సీ లీరా కొంతవరకు కోలుకోవడం మదుపరులలో విశ్వాసాన్ని పాదుగొలిపింది.

Pages