S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/10/2018 - 01:34

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఆదాయం పన్ను శాఖ గత ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 6.86 కోట్ల రిటర్న్స్‌లో 0.35 శాతం కేసులను మాత్రమే స్క్రూటినీకి చేపట్టినట్లు పేర్కొంది. ఆదాయం పన్ను చెల్లింపుదార్లంటే తమకు విశ్వాసం ఉందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. పన్ను ఎగవేతదారులను వదిలిపెట్టే ప్రసక్తిలేదన్నారు.

08/09/2018 - 23:37

న్యూయార్క్, ఆగస్టు 9: భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అలాగే పెట్టుబడులు బలపడటం, వస్తు వినియోగం విస్తృతంగా పెరగడం వల్ల జీడీపీ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరుగుతుందని తన తాజా అంచనాలో ఐఎంఎఫ్ పేర్కొంది.

08/09/2018 - 22:24

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: 2,898.00 రూపాయలు
8 గ్రాములు: 23,184.00 రూపాయలు
10 గ్రాములు: 28,980.00 రూపాయలు
100 గ్రాములు: 2,89,800.00 రూపాయలు
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: 3,099.465 రూపాయలు
8 గ్రాములు: 24,795.72 రూపాయలు
10 గ్రాములు: 30,994.65 రూపాయలు
100 గ్రాములు: 3,09,946.50 రూపాయలు
వెండి

08/09/2018 - 12:14

ముంబయి: లాభాలతో ప్రారంభించిన సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకాయి. తొలిసారిగా 38,000 మార్క్‌ను దాటి ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ కూడా లాభాల్లో సాగుతోంది. పీ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 118.09 పాయింట్లతో, 0.31 శాతం పెరిగి 38,005.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 25.75 పాయింట్ల లాభంతో 0.22 శాతం పెరిగి 11,475.75వద్ద ముగిశాయి. పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యి 38వేల మార్క్‌ను తాకింది.

08/09/2018 - 00:33

న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఇంకా రాణించాల్సి ఉందని, తన పనితీరును ఉత్తమ స్థాయికి పెంచుకోవలసి ఉందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అప్పుడు దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎన్‌ఎస్‌ఈని ప్రారంభించారు. ఎన్‌ఎస్‌ఈ ప్రారంభమయి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఇక్కడ నిర్వహించిన రజతోత్సవాలలో ఆయన పాల్గొన్నారు.

08/09/2018 - 00:31

ముంబయి, ఆగస్టు 8: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తిరిగి సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ వంటి ఇంధన రంగ దిగ్గజ కంపెనీల షేర్లు బాగా రాణించడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి.

08/09/2018 - 00:24

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశాభివృద్ధిలో ఎగుమతిదారులు కీలకపాత్ర వహిస్తారని, లాటిన్ అమెరికా, ఆఫ్రికాదేశాలకు ఎగుమతులను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు కోరారు. ఈ దేశాల్లో శరవేగంగా విస్తరిస్తున్న మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ఎగుమతులను పెంచేందుకు వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేశామన్నారు.

08/08/2018 - 04:05

ముంబయి: రెండు రోజుల పాటు లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంధన, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

08/07/2018 - 23:50

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అధిక స్థాయిల వద్ద ఉండటం వల్ల దేశంలో గత రెండు నెలల కాలంలో తొలిసారి మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 77ను దాటింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం విడుదల చేసిన ధరల పట్టిక ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర తొమ్మిది పైసలు పెరిగి, రూ. 77.06కు చేరుకోగా, డీజిల్ ధర ఆరు పైసలు పెరిగి, రూ. 68.50కు చేరింది.

08/07/2018 - 23:48

న్యూఢిల్లీ, ఆగస్టు 7: గతంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)లు దాఖలు చేయని 2.09 లక్షల మంది తొలిసారి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌లు దాఖలు చేయడంతో పాటు రూ. 6,416 కోట్లు ఆదాయపు పన్ను (ఐటీ) రూపంలో చెల్లించారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఒక ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.

Pages