S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/13/2018 - 02:41

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ముడి చమురు ధరల్లో తగ్గుదల, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ నిలకడగా ఉండటం, జూన్ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటం వల్ల భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ మదుపరులు ఉత్సాహం చూపుతున్నారు. గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో ఫారిన్ ఇనె్వస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో రూ. 8,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

08/13/2018 - 02:39

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దివాలా ప్రక్రియ స్మృతి (ఐబీసీ) వల్ల రుణాల వసూళ్ల వేగం పెరిగిందని, దీని వల్ల బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపడిందని ఫీక్కీ అనే వాణిజ్య సంస్ధ పేర్కొంది. ఈ స్మృతి అమలులోకి వచ్చిన తర్వాత బకాయిపడిన పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రమోటర్లు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారని ఫిక్కీ పేర్కొంది.

08/13/2018 - 02:38

హైదరాబాద్, ఆగస్టు 12: నగదు బదిలీ, ఫారిన్ ఎక్సేంజ్, పేమెంట్స్, క్రెడిట్ సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూఏఈ ఎక్సేంజ్ భారతదేశ కార్యకలాపాలను యునిమోని పేరుతో నిర్వహించనుంది.

08/13/2018 - 02:38

హైదరాబాద్, ఆగస్టు 12:కొత్త పాదరక్షల డిజైన్లతో ఏరోబ్లూ మార్కెట్‌లోకి వస్తోంది. యామి గౌతమి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న ఏరోబ్లూ సరికొత్త డిజైన్లతో మార్కెట్‌ను పెంచుకోనుందని సంస్థ కంట్రీ హెడ్ జ్యోతి కృష్ణ చెప్పారు. సంస్థను 1996లో సూరత్‌లో ప్రారంభించామని, యుఎఈ కేంద్రంగా పనిచేస్తున్న అదానీ సోదరుల సహకారంతో పాదరక్షల ఉత్పత్తి రంగంలో రాణిస్తున్నామని అన్నారు.

08/12/2018 - 01:37

జగిత్యాల, ఆగస్టు 11: మధ్య తరగతి ప్రజల అవసరాలే ఆసరాగా చేసుకొని, వారికి ఉన్న కొద్దిపాటి ఆస్తులనే తనఖాగా పెట్టుకొని జరుగుతున్న వడ్డీ వ్యాపారం సరిహద్దుల ఎల్లలు చెరిపివేస్తూ, జగిత్యాల నుంచి రాష్టమ్రంతా విస్తరిస్తున్నది. అంతర్ రాష్ట్ర వ్యాపారంగా మారింది. పిల్లల చదువుకోసం కొందరు.. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం మరి కొందరు.. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

08/11/2018 - 23:51

వాషింగ్టన్, ఆగస్టు 11: మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతికి చెందిన నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ కంపెనీలో తనకు ఉన్న షేర్లలో మూడో వంతు షేర్లను విక్రయించి దాదాపు 35 మిలియన్ డాలర్లను ఆర్జించారు. నాదెళ్ల 328000 షేర్లను అమెరికా డాలర్‌లో 109.08 చొప్పున విక్రయించారు. ఈ వివరాలతో రెగ్యులేటరీ ఫైలింగ్ కూడా చేశారు. దీని వల్ల 35 మిలియన్ డాలర్ల ఆదాయం సత్య నాదెళ్ల ఖాతాలో చేరింది.

08/11/2018 - 23:49

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ-కామర్స్ విధాన ముసాయిదాపై సంబంధిత వ్యక్తులు, సంస్థలతో మరోసారి సంప్రదింపులు జరపాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం అధికారులను ఆదేశించారు.

08/11/2018 - 23:47

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కోల్ ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది తొలి త్రైమాసిక కాలంలో 61.07 శాతం వృద్ధిరేటుతో రూ. 3786.44 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది. ఈ వివరాలను కోల్ ఇండియా వెల్లడించింది. ఈ సంస్ధ గత ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో రూ.2350.78 కోట్ల నికర లాభాలు సాధించింది. అదే విధంగా నికర ఆదాయం రూ.21,774.42 కోట్ల నుంచి రూ. 25,470.86 కోట్లకు పెరిగింది. నికర ఆదాయలో 17 శాతం వృద్ధిరేటునమోదైంది.

08/11/2018 - 17:07

ముంబయి: బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ శేఖర్ బజాజ్ ఎకైక కుమారుడు, వ్యాపారవేత్త అనంత్ బజాజ్(41) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. రెండు నెలల క్రితమే అనంత్ బజాజ్ ఎండీగా నియమితులయ్యారు.

08/11/2018 - 04:13

విజయవాడ : రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం జారీ చేయనున్న సీఆర్‌డీఏ బాండ్లను బొంబాయి స్టాక్ ఏక్సేంజ్ (బీఎస్‌ఈ)లో లిస్టింగ్ చేయనున్నారు. లిస్టింగ్ కార్యక్రమం మంగళవారం జరుగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాండ్ల లిస్టింగ్ ఏర్పాట్ల గురించి సీఎంకు అధికారులు వివరించారు.

Pages