S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/11/2018 - 02:28

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల నుంచి శుక్రవారం పడిపోయాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉండటం వల్ల మార్కెట్ కీలక సూచీలు దిగజారాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 155 పాయింట్లు పడిపోయి కీలకమయిన 38వేల పాయింట్ల స్థాయికన్నా దిగువన ముగిసింది.

08/11/2018 - 01:24

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను మొండి బకాయిలు తీవ్ర స్థాయిలో దెబ్బతీశాయి. ఎస్‌బీఐ శుక్రవారం ప్రకటించిన ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలలో భారీగా రూ. 4,876 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. ఎస్‌బీఐ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 2,006 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

08/11/2018 - 01:23

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తగ్గాయి. గత తొమ్మిది నెలల్లో మొదటిసారి, గత నెల ఈ తగ్గుదల నమోదైంది. జీఎస్‌టీ అమల్లో తలెత్తుతున్న సమస్యలే దీనికి ప్రధాన కారణమని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్‌ఐఏఎం) ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. గత ఏడాది జూలై మాసంలో 1,92,845 ప్యాసింజర్ వాహనాల అమ్మకం జరిగిందని, ఈ ఏడాది అదే సమయానికి 1,91,979 వాహనాలు అమ్ముడయ్యాయని పేర్కొంది.

08/11/2018 - 01:21

న్యూఢిల్లీ, ఆగస్టు 10: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జీఎస్‌టీ పరిహారం కింద కేంద్ర 52,077 కోట్ల రూపాయలు చెల్లించింది. 2017 జూలై నుంచి 2018 మార్చి వరకు 48,178 కోట్ల రూపాయలు, అదే విధంగా ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో మొత్తం 3,988 కోట్ల రూపాయలు చొప్పున చెల్లించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్ సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.

08/11/2018 - 01:21

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: 2,934.00 రూపాయలు
8 గ్రాములు: 23,472.00 రూపాయలు
10 గ్రాములు: 29,340.00 రూపాయలు
100 గ్రాములు: 2,83,400.00 రూపాయలు
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: 3,137.968 రూపాయలు
8 గ్రాములు: 25,103.744 రూపాయలు
10 గ్రాములు: 31,379.568 రూపాయలు
100 గ్రాములు: 3,13,796.80 రూపాయలు
వెండి

08/10/2018 - 04:42

హైదరాబాద్: ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) సదరన్ రీజనల్ కౌన్సిల్ చైర్మన్‌గా తిక్కవరపు రాజీవ్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలలో దేశంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు.

08/10/2018 - 01:38

న్యూఢిల్లీ, ఆగస్టు 9: జీఎస్‌టీ ఆదాయం పెరిగే కొద్దీ ఎక్కువ వస్తువులపై వస్తు సేవా పన్నును తగ్గించేందుకు వీలవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే వర్తకుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఆయన ఇక్కడ లోక్‌సభలో జీఎస్‌టీ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ నాలుగు బిల్లులు ప్రవేశపెట్టారు.

08/10/2018 - 01:24

న్యూఢిల్లీ, ఆగస్టు 9: సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించినందుకు 117 కేసుల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సెబి ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఈ చట్టాల ఉల్లంఘన కేసులు 52 శాతం తగ్గాయి. ధరల రిగ్గింగ్, మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడడం తదితర నేరాలకు పాల్పడే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని సెబి పేర్కొంది. 2017-18లో 117 కేసులను సెబి దర్యాప్తుకు చేపట్టింది. 145 కేసుల దర్యాప్తును పూర్తి చేశారు.

08/10/2018 - 01:22

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత్ ఫార్మాస్యూటికల్ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం నామమాత్రంగా మూడు శాతం పెరిగి, 17.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పెరగడంతో పాటు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒత్తిడి పెరగడం వల్ల ఫార్మాస్యూటికల్ ఎగుమతులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన స్థాయిలో పెరగలేదు.

08/10/2018 - 01:21

న్యూఢిల్లీ, ఆగస్టు 9: బ్యాంకింగ్, లోహ రంగాల షేర్లు పరుగులు తీయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. మార్కెట్ కీలక సూచీలు రెండూ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ తొలిసారి 38వేల మార్కుకు పైన ముగిసింది. ఈ సూచీ 136 పాయింట్లు పుంజుకొని 38,024 పాయింట్ల వద్ద ముగిసింది.

Pages