S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/15/2018 - 00:29

న్యూఢిల్లీ, ఆగస్టు 14: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలై నెలలో 5.09 శాతానికి తగ్గింది. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. జూన్ నెలలో 5.77 శాతం ఉన్న టోకు ద్రవ్యోల్బణం.. ఆహార వస్తువుల ధరలు ముఖ్యంగా పళ్లు, కూరగాయల ధరలు తగ్గడం వల్ల జూలై నెలలో 5.09 శాతానికి తగ్గింది. 2017 జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతం ఉండింది.

08/14/2018 - 13:29

ముంబయి: రూపాయి మంగళవారం మరింత బలహీనపడింది. అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి విలువ ఎన్నడూ లేని రీతిలో భారీగా తగ్గి 70.07 పైసలకు చేరుకుంది.

08/14/2018 - 01:31

విశాఖపట్నం: కెమికల్, పెట్రోకెమికల్ పరిశ్రమలు ప్రస్తుతం పశ్చిమ తీరంలోనే అత్యధికంగా ఏర్పాటయ్యాయని తూర్పు తీరం కూడా ఈ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమేననిన కేంద్ర కెమికల్, పెట్రోకెమికల్ విభాగం కార్యదర్శి పీ రాఘవేంద్ర రావు అన్నారు.

08/14/2018 - 01:33

ముంబయి, ఆగస్టు 13: వరుసగా రెండు సెషన్లలో కూడా సెనె్సక్స్ పతన బాటలోనే సాగింది. గత రెండు వారాల్లో ఎన్నడూలేని దిగువకు చేరుకుని 224 పాయింట్లు కోల్పోయి 37,645 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక పక్క రూపాయి విలువ తగ్గడం, టర్కీలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన కారణంగా మదుపుదారులు భారీగా అమ్మకాలకు పాల్పడడంతో దాని ప్రభావం సెనె్సక్స్‌పై భారీగా పడింది.

08/14/2018 - 00:49

లండన్, ఆగస్టు 13: లండన్‌లో 2021 సంవత్సరానికల్లా తాజ్ బ్రాండ్ పేరిట అతి పెద్ద హోటల్ ప్రారంభం కానుంది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ అతి పెద్ద తాజ్ వివాంటా హోటల్ ఏర్పాటుకు సంబంధించి హేరే గ్రూప్ లిమిటెడ్ కంపెనీతో ఐహెచ్‌సీఎల్ గత వారం అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

08/14/2018 - 00:48

విజయవాడ, ఆగస్టు 13: ఎస్సీ, ఎస్టీ వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు మూడు రకాల కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎక్కడైనా పారిశ్రామికవృద్ధికి అవసరమైన వృత్తి విద్యా కోర్సులు చదువుకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

08/14/2018 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఈక్రమంలో మరో ఐదు నుంచి ఆరు శాతం నిల్వలు తగ్గినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ (డీబీఎస్) నివేదిక పేర్కొంది.

08/13/2018 - 14:04

ముంబయ:రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.69.62 పైసలకు దిగజారిపోయింది.

08/13/2018 - 04:36

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం గణాంకాలు, కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక (క్యూ1) ఆదాయాలు, ప్రపంచ సంకేతాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. అందువల్ల వచ్చే వారంలో మార్కెట్లు నాలుగు రోజులే పనిచేస్తాయి.

08/13/2018 - 02:42

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలోని పది అత్యంత విలువయిన కంపెనీలలోని ఏడు కంపెనీల విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 47,498.74 కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) అత్యధికంగా లాభపడింది. విలువ పెరిగిన మిగతా కంపెనీలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ ఉన్నాయి.

Pages