S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/26/2018 - 01:42

న్యూఢిల్లీ, జూన్ 25: రోజుకు మిలియన్ బ్యారళ్ల మేర చమురు ఉత్పత్తిని పెంచాలని ఓపెక్ దేశాలు తీసుకున్న నిర్ణయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఇది వివేచనాయుత నిర్ణయమని, అధికంగా చమురు వినియోగించే భారత్ వంటి దేశాల పరంగా ఇది సానుకూల నిర్ణయమని వ్యాఖ్యానించింది. అమెరికా, భారత్, చైనా దేశాల్లోని వినియోగదార్లు చమురు ధరలు పెరగడంపై ఓపెక్ దేశాలు గతవారం చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించాయి.

06/26/2018 - 01:42

ముంబయి, జూన్ 25: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాలర్‌తో రూపాయి మారకం విలువను 68.1466గాను, యూరోతో 79.3499 గాను నిర్ణయించింది. 2018, జూన్ 22న ఈ మారకం రేట్లు 67.7695, 78.8566గా ఉండేవి. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా పౌండ్, యెన్‌లతో రూపాయి మారకం రేటు వరుసగా 90.2738, వంద యెన్‌లకు 62.27లుగా నిర్ణయించింది.

06/26/2018 - 01:41

న్యూఢిల్లీ, జూన్ 25: స్టాక్ మార్కెట్ల నుంచి గరిష్ట ఆదాయాన్ని పొందేందుకు వీలుగా, ఈక్విటీ సంబంధ పథకాల పరిధిని మరింత విస్తృతం చేసే అంశంపై రిటైర్‌మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌ఓ ట్రస్టీలు మంగళవారం పరిశీలన జరుపుతారు.

06/26/2018 - 01:40

ముంబయి, జూన్ 25: బ్యాంక్ ఆఫ్ మహారాష్టక్రు చెందిన ఉనతాధికార్లను గత వారం అరెస్ట్ చేయడం అసాధారణమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే ఈ విధంగా అరెస్ట్‌ల ద్వారా బ్యాంకర్లను వేధిస్తున్నారని భావించరాదని ఆయన స్పష్టం చేశారు.

06/25/2018 - 16:22

ముంబయి: దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 17.18 పాయింట్ల నష్టంతో 35672.42 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 8.20 పాయింట్ల నష్టంతో 10813.70 పాయింట్ల వద్ద మొదలైంది. చివరకు సెన్సెక్స్‌ 219 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 10,800 మార్కు దిగువకు చేరింది. సెన్సెక్స్‌ 219.25 పాయింట్ల నష్టంతో 35,470.35 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 59.40 పాయింట్ల నష్టంతో 10,762.45 పాయింట్లకు చేరింది.

06/25/2018 - 05:32

హూస్టన్, జూన్ 24: అమెరికాలోని నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ రోడ్ షోకు సానుకూల స్పందన లభించింది. ఎంతో మంది ఔత్సాహికులు ఈ షోను చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ జరిగిన రోడ్ షోల్లో భారత్‌లో దర్శనీయ స్థలాలపై డిజిటల్ డిప్లేలు, కరపత్రాలు, ఫొటోలు, ఇతర టూరిజం ప్రచార సమాగ్రి ద్వారా అవగాహన కల్పించారు.

06/25/2018 - 05:31

న్యూఢిల్లీ, జూన్ 24: అమెరికా ఫెడర్ రిజర్వ్ (యూఎస్‌ఎఫ్‌ఆర్) విత్‌డ్రాలు కొనసాగడంతో భారత క్యాపిటల్ మార్కెట్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఒక్క నెలలోనే ఇప్పటి వరకూ 14,500 కోట్ల రూపాయల మేరకు విదేశీ పెట్టుబడలను యూఎస్‌ఎఫ్‌ఆర్ వెనక్కు తీసుకుంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్స్ (ఎఫ్‌పీఐ)లు 46,600 కోట్ల రూపాయలను ఉపసంహరించుకుంది.

06/25/2018 - 05:31

హైదరాబాద్, జూన్ 24: ఒక క్యాన్సన్ మందుపై పేటెంట్ హక్కుకేసులో డాక్టర్ రెడ్డీస్‌కు వ్యతిరేకంగా అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. అమెరికాలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకోసం ఉపయోగించే ‘అలిమ్టా’ (కీమోథెరపీకి ఉపయోగించే ఇంజెక్షన్- దీని కంపెనీ బ్రాండ్ పేరు పెమెట్రిక్స్‌డ్)) ఔషధంపై పేటెంట్ హక్కు కోసం ఎలి లిల్లీ, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల మధ్య అమెరికాలోని ఇండియానా కోర్టులో వివాదం నడిచింది.

06/25/2018 - 05:30

ముంబయి, జూన్ 24: ఏటీఎంలు నెలకొల్పే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కంపెనీకి చెందిన 42 శాతం వాటాలను టీపీజీ, యాక్టిస్‌లనుంచి తిరిగి కొనుగోలు చేసినట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే వాటాల తిరిగి కొనుగోలుకు ఎంతమొత్తం చెల్లిచిందీ వెల్లడించలేదు. 2011లో టీపీజీ రూ.500 కోట్లు చెల్లించి కంపెనీలో 26శాతం వాటాలను కొనుగోలు చేసింది.

06/25/2018 - 05:30

న్యూఢిల్లీ, జూన్ 24: భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో పురాతనమైనదైన ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సీఐ) నిధుల వేటలో పడింది. ఆర్థిక విస్తరణ పథకంలో భాగంగా కనీసం రూ.3000 కోట్లను బాండ్లు తదితర రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో, నెలకు రూ.500 కోట్ల చొప్పున రుణాలను మంజూరు చేయాలని యోచిస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి నిధుల సేకరణ అత్యవసరమైంది.

Pages