S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/14/2018 - 05:30

ముంబయి, జూన్ 13: ఆర్‌బీఐ రెపోరేట్లు ఆగస్టు నెలలో మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం రేటు మే నెలలో 4.87 శాతానికి చేరడంతో, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఆగస్టునెలలో ద్రవ్యపరపతి కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటును పెంచవచ్చని నిపుణులంటున్నారు. రెపోరేటును పెంచడం వల్ల విదేశీపెట్టుబడులు మందగిస్తాయని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వర్గాలు భావిస్తున్నాయి.

06/14/2018 - 05:28

ముంబయి, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో స్వల్పంగా లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 47 పాయింట్లు పుంజుకొని, 35,739.16 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి, 10,856 పాయింట్ల వద్ద స్థిరపడింది.

06/14/2018 - 05:26

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్రంలో 34 జీ2 సేవలు అందించేందుకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) నిర్ణయించింది. తొలుత ఈ సేవలు పైలట్ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం, ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో 2018 ఆగస్టు కంటే ముందు ప్రారంభిస్తామని బిఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ సీజీఎం వి. సుందర్ తెలిపారు.

06/14/2018 - 05:25

న్యూఢిల్లీ, జూన్ 13: ఈ నెల 19వ తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ రెండవ సారి భారత్-22 ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)ను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఈ ఫండ్ ద్వారా రూ. 8400 కోట్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి రోజు 19వ తేదీన యాంకర్ ఇనె్వస్టర్లకు , రెండవ రోజు నుంచి సంస్థాగత, రిటైల్ ఇనె్వస్టర్లకు ఇష్యూను ఆఫర్ చేస్తారు. ఈ నెల 22వ తేదీ వరకు ఇష్యూ అమలులో ఉంటుంది.

06/14/2018 - 05:24

న్యూఢిల్లీ, జూన్ 13: వరుస స్కాంలతో తలడిల్లుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ప్రతి రోజూ ఒక దెబ్బ తగులుతోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం క్యాపిటల్ అడెక్వెసీ రేషియో (సిఏఆర్) 11.5 శాతంపైన ఉండాలి. గత ఏడాది ఎక్కువ నష్టాలు చవిచూసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఏఆర్ మార్చి 31వ తేదీతో 9.20 శాతానికి దిగజారింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి 11.66 శాతం సాధించింది.

06/14/2018 - 05:23

న్యూఢిల్లీ, జూన్ 13: ఎస్సీ, ఎస్టీవర్గాలకు చెందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు అవసరమైన సామాగ్రిని సేకరించిన రేటు 2017-18లో కేవలం 0.47 శాతం మాత్రమే. గత ఏడాది దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం రూ. 26102.45 కోట్ల ఉత్పత్తులను సేకరించాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ పరిశ్రమల ఉత్పత్తుల వాటా రూ.540.75 కోట్లు. ఈ వివరాలను ఎంఎస్‌ఎంఇ సంబంధ్ పోర్టల్ డాటా పేర్కొంది.

06/13/2018 - 00:53

న్యూఢిల్లీ, జూన్ 12: పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.9 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఐఐపి 3.2 శాతం నమోదైంది. తయారీ రంగం, మైనింగ్ సెక్టార్, భారీ యంత్రపరికరాల రంగంలో వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఐపి పరుగులుపెట్టింది. ఈ ఏడాది మార్చినెలలో ఐఐపి 4.6 శాతం నమోదైంది. అంతకుముందు ఈ ఏడాది అదే కాలంలో ఐఐపి 4.3 శాతం రికార్డయింది.

06/13/2018 - 00:52

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గత నాలుగు నెలల కాలంలో రికార్డు స్థాయిలో 4.87 శాతానికి చేరుకుంది. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాల ధరలు పెరిగాయి. వీటికి పెట్రో ధరల రేట్లు తోడయ్యాయి. వినిమయ ధరల సూచికను విశే్లషిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4.58 శాతం నమోదైంది. గత ఏడాది మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువలో తక్కువగా కేవలం 2.18 శాతం నమోదైంది. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 5.7 శాతం నమోదైంది.

06/13/2018 - 00:50

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రభుత్వ రంగ బ్యాంకుల పర్యవేక్షణకు ఎక్కువ అధికారాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కల్పించాలని ఆ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదేశంపై ఆ కమిటీ సమావేశానికి మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

06/13/2018 - 00:49

న్యూఢిల్లీ, జూన్ 12: వచ్చే నెలాఖరుకు కొత్త టెలికాం పాలసీని ప్రకటిస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ, నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీని వచ్చే నెలాఖరులోపల కేంద్రం ఆమోదిస్తుందన్నారు. ఈ పాలసీపై ముసాయిదా సిద్ధమైందన్నారు. ఈ ముసాయిదా నుంచి జారీచేశామన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలోకి రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు.

Pages