S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/24/2019 - 22:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: భారతి ఏఎక్స్‌ఏ జనరల్ ఇన్సూరెన్స్ ఆదాయంలో వృద్ధి నమోదైంది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి ప్రథమార్ధంలో 1,586 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో, ఇదే కాలానికి వసూలైన మొత్తం 1,087 కోట్ల రూపాయలుకాగా, ఈ సారి 46 శాతం పెరిగిందని వివరించింది. మోటార్ వాహనాలు, పంటలు, ఆరోగ్య బీమా విభాగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపింది.

12/24/2019 - 22:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎస్ బ్యాంక్‌తో హిందూజా గ్రూప్‌లో భాగమైన అశోక్ లేలాండ్ కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కంపెనీ నుంచి ఉత్పత్తయ్యే వాహనాలకు రుణాలను మంజూరు చేయడానికి ఎస్ బ్యాంక్ అంగీకరించింది. ఈ విషయాన్ని అశోక్ లేలాండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంజూ కథూరియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదరిందని పేర్కొన్నారు.

12/24/2019 - 22:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: భారత గేమింగ్ పరిశ్రమలో బాజీ గేమ్స్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. స్టార్టప్స్, టెక్నాలజీ అభివృద్ధి విభాగాల్లో 35 కోట్ల రూపాయలు (సుమారు 5 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో ఈ పెట్టుబడుల ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది.

12/24/2019 - 05:36

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు వినూత్న ప్రక్రియలతో తన సత్తాను, ప్రత్యేకతను చాటుకుంటున్న భారత్ పేటెంట్లపరంగా కూడా పట్టును సాధించింది.

12/23/2019 - 23:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశ వ్యాప్తంగా 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేయడం అంత తేలికైన అంశం ఏమీ కాదని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు. అయితే విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు వీలుగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

12/23/2019 - 23:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ‘అసోచామ్’ అధ్యక్షుడిగా హీరానందని గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ హీరానందని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పారిశ్రామికవేత్తలకు చెందిన అసోచామ్‌కు నిరంజన్ ఇటీవల నూతన అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆయన వెల్సన్ గ్రూపు చైర్మన్ బాలకృష్ణ గోయెంకా విజయం సాధించారు. న్యూ ఇండియా ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి యత్నిస్తున్నది.

12/23/2019 - 03:11

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న వివిధ భారీ కంపెనీలకు సంబంధించిన మూడో త్రైమాసిక ఫలితాల అంచనాలే ఈవారం స్టాక్ మార్కెట్‌కు దిక్సూచి కానున్నాయి. ఈనెల 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగుస్తుంది. ఆతర్వాతే వివిధ కంపెనీలు ఈ మూడు నెలల ఫలితాలను వెల్లడిస్తాయి. అయితే, ఈలోపే మార్కెట్‌లో ఆయా కంపెనీల ఫలితాలపై అంచనాలు, విశే్లషణలు జోరందుకుంటాయి.

12/23/2019 - 03:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలోని వౌలిక రంగాల్లో ఖర్చు తడిసి మోపెడవుతున్నది. అంచనా వ్యయానికి, ఆతర్వాత పెరుగుతున్న ఖర్చుకు లంకె కుదరక యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. 150 కోట్ల రూపాయలకు మించిన విలువ గల ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో 377 ప్రాజెక్టులు ఈ విధంగా అదనపు ఖర్చుతో అల్లాడుతున్నాయి. స్థూలంగా చూస్తే, అదనపు ఖర్చు 3.94 లక్షల కోట్ల రూపాయలుగా తేలింది.

12/23/2019 - 03:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: మార్కెట్ విలువ అత్యధికంగా ఉన్న దేశీయ టాప్-10 కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ విలువ గత వారం 1.13 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ భారీ పెరుగుదలలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

12/22/2019 - 05:13

న్యూఢిల్లీ: నగదు రహిత (క్యాష్ లెస్) ఇండియాను కేంద్రం కోరుతున్నప్పటికీ, ఏటీఎంల సంఖ్య దేశంలో పెరుగుతునే ఉంది. ఈ సంఖ్య 2.30 లక్షలకు చేరువైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం అక్టోబర్ చివరి నాటికి దేశంలో 2,29,374 ఏటీఎంలు ఉన్నా యి. పెద్ద నోట్ల రద్దు (డీ మానిటైజేషన్) తర్వాత కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల ప్రకారం నగదు చలామణిని సాధ్యమైనంత వరకూ నియంత్రించాల్సి ఉంటుంది.

Pages