S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/22/2016 - 04:14

హైదరాబాద్: హైదరాబాద్‌లో సరళ్ రోజ్‌గార్ పథకంలో భాగంగా సోమవారం టెక్ మహీంద్ర మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించింది. ఈ మెగా జాబ్ ఫెయిర్‌లో ఆటోమోటివ్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఎఫ్‌ఎంసిడి రంగాల నుంచి 15 సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ఉద్యోగాల కోసం సుమారు 300 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

03/22/2016 - 04:12

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్ వ్యాప్తంగా విస్తరించడంతో సూచీలు లాభాల్లో కదలాడాయి.

03/22/2016 - 03:59

న్యూఢిల్లీ: కీలక వడ్డీరేట్లను తగ్గించాలంటూ వస్తున్న డిమాండ్లను రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పరిశీలించే అవకాశాలున్నాయని, దీంతో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు పావు శాతం చొప్పున దిగివచ్చే వీలుందని డ్యూషే బ్యాంక్ సోమవారం ఓ నివేదికలో అంచనా వేసింది.

03/22/2016 - 03:59

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను నిల్వచేసి, వాటిని తగిన ధర లభించినప్పుడు అమ్ముకునేలా రూ. 1,024 కోట్ల వ్యయంతో 335 గోడౌన్లను నిర్మించనున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

03/21/2016 - 06:00

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష ప్రభావం కూడా ట్రేడింగ్‌పై కనిపిస్తుందని పేర్కొంటున్నారు.

03/21/2016 - 05:57

అనంతపురం: అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమ లు తరలిపోతున్నాయ. కరవు జిల్లా.. నాలుగు పరిశ్రమలు వస్తే జనానికి ఉపాధి దొరుకుతుందనుకుంటే శ్రుతి మించుతున్న రాజకీయ జోక్యం దాన్ని కాస్తా దూరం చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు అండగా నిలవాల్సిన కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అడ్డం పడుతున్నారు. వాటాలు, మామూళ్ల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తూ, బెదిరింపులకు దిగుతున్నారు.

03/21/2016 - 05:56

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నెలకుముందు పెట్టుబడు ల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గత మూడు వారాల్లో మాత్రం షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ఈ నెల ట్రేడింగ్ జరిగిన పదమూడు రోజుల్లో 11,000 కోట్ల రూపాయల కుపైగా పెట్టుబడులను పట్టుకొచ్చారు.

03/21/2016 - 05:56

న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా వ్యవహారంపై విచారణను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మరింత లోతుగా జరుపుతోంది. మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యుబి) గ్రూప్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ తదితర అంశాలను దగ్గరగా గమనిస్తోంది.

03/21/2016 - 05:55

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో దభోల్, జిఎమ్‌ఆర్, ల్యాంకో తదితర తొమ్మిది పవర్ ప్లాంట్లు ఆదివారం విజయవంతంగా 7.62 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎమ్‌ఎమ్‌ఎస్‌సిఎమ్‌డి) రీగ్యాసిఫైడ్ లిక్విడ్ నాచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జి)ను గెలుచుకున్నాయి. ఈ గ్యాస్‌తో ఈ తొమ్మిది ప్లాంట్లు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మొత్తం 6.79 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేయనున్నాయి.

03/20/2016 - 07:21

న్యూఢిల్లీ, మార్చి 19: తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ (టిఎస్‌పిడిసి)కు విద్యుత్ సరఫరా కోసం టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ (టిపిటిసిఎల్)తో నవ భారత్ వెంచర్స్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం బిఎస్‌ఇకి నవ భారత్ వెంచర్స్ తెలిపింది.

Pages