S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/05/2018 - 16:51

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 300‌ పాయింట్ల నష్టంతో 33746 వద్ద నిఫ్టీ 100 పాయింట్ల పతనంతో 10,358 వద్ద క్లోజ్‌ అయ్యాయి.

03/05/2018 - 03:31

న్యూఢిల్లీ, మార్చి 4: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే కీలక అంశాలేవీ సమీప భవిష్యత్తులో లేకపోవడంతో మార్కెట్లు రానున్న రోజుల్లో సంఘటితం అవుతాయని, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా మార్కెట్ల ధోరణి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న అంచనాతో ఈ వారం మొదట్లో దేశీయ స్టాక్ మార్కెట్ పుంజుకున్న సూచనలు కనిపించాయి.

03/05/2018 - 03:30

న్యూఢిల్లీ, మార్చి 4: ఎస్-400ట్రింఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు భారత్-రష్యాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ.40,000 కోట్ల విలువైన ఈ డీల్‌కు సంబంధించి ధర విషయంలో రెండు దేశాల మధ్య ఒక అంగీకారం కుదరలేదు.

03/05/2018 - 03:28

న్యూఢిల్లీ, మార్చి 4: ఫారిన్ ఇనె్వస్టర్లు ఫిబ్రవరి నెలలో భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 11వేల కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. అయిదు నెలల కాలంలో వారు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇదే మొదటిసారి. అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లలో మెరుగయిన అవకాశాలు ఉండటం వల్లనే వారు భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను గణనీయంగా ఉపసంహరించుకున్నారు.

03/05/2018 - 03:26

న్యూఢిల్లీ, మార్చి 4: 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 15 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంకోసం భారత్-వియత్నాంలు అనువైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ మేరకు రెండు దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. శనివారం ప్రధాని నరేంద్రమోది, వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్‌ల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

03/05/2018 - 03:25

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి రాజధాని హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, ఇక్కడ శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయని, పెట్టుబడిదారులకు స్వర్గ్ధామమని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన హైటెక్స్‌లో క్రెడాయ్ మూడు రోజుల ప్రోపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

03/04/2018 - 02:14

హైదరాబాద్, మార్చి 3: దేశం మొత్తం మీద రియాల్టీ రంగంలో హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ప్రపంచ స్థాయి పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం ఇక్కడ ఆయన, మంత్రి జూపల్లితో కలిసి కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) 6వ ఎడిషన్‌ను ప్రారంభించారు.

03/04/2018 - 02:09

వాషింగ్టన్, మార్చి 3: స్టీలు, అల్యూమినియం దిగుమతులపై సుంకం విధించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అమెరికా, దాని భాగస్వామ్య దేశాల ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని ఐఎంఎఫ్ హెచ్చరించింది. సమస్యాత్మక పరిణామాన్ని రాష్ట్రాలన్నీ సంయుక్తంగా ఎదుర్కోవాలని సూచించింది.

03/03/2018 - 01:09

సిరిసిల్ల, మార్చి 2: రైతుకు సహకార సంస్థల కంటే ప్రభుత్వం అధిక సాయం చేయాలని, ఇది ప్రజాస్వామ్యమని, రైతులకు కోఆపరేటివ్ కాదు, కోఆపరేషన్ జరుగుతున్నదని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ‘బహిరంగ విచారణ’ జరిగింది.

03/03/2018 - 01:07

హైదరాబాద్, ఫిబ్రవరి 2: మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఫిబ్రవరి నెలలో 93.59 ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్)ను సాధించింది. ఈ ఏడాది ఇంతవరకు 90.70 శాతం పిఎల్‌ఎఫ్‌ను సాధించినట్లు సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ చెప్పారు. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నామన్నారు.

Pages