S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/13/2018 - 02:19

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణకు మరో కంపెనీ రానుంది. జపాన్‌కు చెందిన ఇసే పూడ్స్ యూనిట్‌ను సిద్ధిపేట జిల్లాలోని నంగనూర్‌లో 140 ఎకరాల విస్ణీర్ణంలో నెలకొల్పనుంది. ఈ మేరకు ఆ కంపెనికి ప్రభుత్వపరంగా ఇచ్చే రాయితీలు, అనుమతి పత్రాలను సోమవారం పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అందజేసారు.

03/13/2018 - 02:14

ముంబయి, మార్చి 12: బీఎస్‌ఈ సెనె్సక్స్ నేడు 611 పాయింట్లు పెరిగి, 33,917.94 పాయింట్ల వద్ద ముగిసింది. యుఎస్ ఉద్యోగ నివేదిక సానుకూలంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు మంచి లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లనుంచి సానుకూలత కనిపించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు జోరందుకున్నాయి. 2016, మార్చి 1 తర్వాత ఒకే రోజు ఇంతటి లాభాల్లో ట్రేడింగ్ కావడం ఇదే ప్రథమం.

03/13/2018 - 02:10

న్యూఢిల్లీ, మార్చి 12: కేంద్రం ఎయిర్ ఇండియాకు చెల్లించాల్సిన బకాయిలు అక్షరాలా రూ.325 కోట్లు. అసలే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాకు కేంద్రం బకాయి పడటం విచిత్రమే మరి. ఆర్‌టిఐ కార్యకర్త, పదవీ విరమణ చేసిన నేవీ అధికారి కమ్మోడోర్ లోకేష్ బట్రా సమాచార హక్కు కింద ఎయిర్ ఇండియాకు రావాల్సిన బకాయిల వివరాలు తెలియజేయాలని కోరారు. దీంతో ఈ విషయం బయటపడింది.

03/13/2018 - 02:09

ముంబయి, మార్చి 12 : నోట్లరద్దు, జీఎస్టీ అమలుకు సంబంధించిన ఇబ్బందులనుంచి ఆర్థిక వ్యవస్థ చాలావరకు కోలుకున్నప్పటికీ, రూ.10 లక్షల లోపు రుణాలు తీసుకున్న సూక్ష్మ పరిశ్రమలు ఇంకా పూర్తిగా కోలుకోలేదని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ అండ్ సిడ్బి నివేదిక పేర్కొంది.

03/13/2018 - 02:06

విజయవాడ, మార్చి 12: రాష్ట్రంలో ఇరిగేషన్‌కు సంబంధించి ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో మరో రెండు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేర్చారు. పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల రిజర్వాయర్, తోటపల్లి కుడి, ఎడమ కాలువల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు.

03/12/2018 - 07:21

హైదరాబాద్, మార్చి 11: వచ్చే ఆర్థిక సంవత్సరం 2018-19లో ఐటి ఎగుమతులు 7 నుంచి 9 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని నాస్కామ్ సంస్థ అంచనా వేసింది. మరో 20 రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో, దేశ వ్యాప్తంగా సేకరించిన వివరాలతో నాస్కామ్ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2017-18లో ఐటి రంగం ఎగుమతులు 7.8 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు నాస్కామ్ పేర్కొంది.

03/12/2018 - 07:19

విజయవాడ (బెంజ్‌సర్కిల్), మార్చి 11: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసముంటున్న ఉండల్లి గ్రామ సమీపంలోని కొండలపై అగ్గి రాజుకుంది. రాష్టవ్య్రాప్తంగా అడవులు, చెట్లు విస్తృతంగా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించిన మూడోరోజే ఆయన ఇంటికి సమీపంలోని కొండలు కార్చిచ్చుతో తగలబడిపోతున్నాయి. కొందరు ఆకతాయిల చర్యల వల్ల ఆదివారం కొండలు తగులబడటంతో అటవీ సంపదకు నష్టం జరుగుతోంది.

03/12/2018 - 07:18

న్యూఢిల్లీ, మార్చి 11: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వంటి కీలక స్థూలార్థిక గణాంకాలు సోమవారం నుంచి మొదలయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలను నిర్దేశించనున్నాయని నిపుణులు అంచనా వేశారు. ‘సీపీఐ (వినియోగ వస్తువుల ధరల సూచీ), ఐఐపీ గణాంకాల కోసం మదుపరులు అప్రమత్తతతో ఎదురుచూస్తున్నారు.

03/12/2018 - 07:17

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ వేలంలో పాల్గొనడానికి జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్‌ఎం, డెల్టా ఎయిర్‌లైన్స్‌లతో కూడిన కన్సార్టియం సిద్ధంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

03/12/2018 - 07:17

భీమవరం, మార్చి 11: వేసవిరాకుండానే ప్రచండభానుడి ప్రతాపానికి ఆక్వా రంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ ఉష్ణోగ్రతలకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందోనని ఆక్వా రైతులు భయకంపితులవుతున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతుకు ఎదురులేని దెబ్బతగిలినట్లేనని చెప్పవచ్చు. ఫలితంగా ఆక్వా ఉత్పత్తులు మృత్యువాతపడటమేకాకుండా ఆ ప్రభావం విదేశీ ఎగుమతులపై ఎక్కువగా పడనుంది.

Pages