S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/03/2018 - 01:06

గజ్వేల్, మార్చి 2: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని పిడిచెడ్ శివారులో గల ఈశ్వరసాయి కాటన్ ఇండస్ట్రీస్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రూ. 2కోట్ల విలువ చేసే పత్తి దగ్ధమైం ది. ఈ సంఘటనకు సంబంధించి బాదితులు, పోలీసులు, ఫైర్‌స్టేషన్ అధికారులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పిడిచెడ్ గ్రామ శివారులో ఈశ్వరసాయి కాటన్ ఇండస్ట్రీస్‌కు ఓ రైతు ఆటోలో పత్తి తీసుకువచ్చాడు.

03/03/2018 - 01:04

పరకాల, మార్చి 2: ప్రభుత్వ సేవలు ఇక మరింత చేరువకానున్నాయి. 150 రకాల ప్రభుత్వ, ఇతర సేవలతో తెలంగాణ ప్రభుత్వం టీ-యాప్ పోలియో అప్లికేషన్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించడంతో మీ సేవ సర్వీసులన్నీ ఓపెన్ అన్‌లైన్‌లోకి వచ్చాయి. యాప్ ద్వారా ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే అరచేతి ద్వారా ప్రభుత్వ సేవలు పొందవచ్చు.

03/03/2018 - 01:01

న్యూఢిల్లీ, మార్చి 2: స్పైసిస్ బోర్డు కార్యాలయంలోనే తెలంగాణ పసుపునకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. తెలంగాణలో పసుపు బోర్డు స్థాపించాలని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

03/02/2018 - 04:42

నల్లమాడ, మార్చి 1 : కరవు జిల్లాగా పేరొందిన అనంతపురంలో పండించే అరటికి విదేశాల్లో భలే గిరాకీ లభిస్తోంది. జిల్లాలో వర్షాధార భూములు అధికంగా ఉండి అత్యధిక శాతం మంది రైతులు వేరుశెనగ పంటపైనే ఆధారపడేవారు. అయితే అదే సమయంలో ఉద్యానవన పంటలు కూడా అధికంగా సాగులో ఉన్నాయి. బోరుబావుల్లో నీళ్లుండి ఉద్యానవన పంటలు పండించే రైతన్నల ఇంట సిరులు కురుస్తున్నాయి.

03/02/2018 - 01:28

ముంబయి, మార్చి 1: స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యలోటు పెరుగుతుందనే ఆందోళనతో పాటు అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందనే భయం కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్న అమ్మకాల ఒత్తిడి గురువారం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.

03/02/2018 - 01:27

హైదరాబాద్, మార్చి 1: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి , రవాణాలో ఈ ఏడాది తొలి 11 నెలల్లో 7.2 శాతం వృద్ధిరేటును సాధించినట్లు సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. గత ఏడాది ఇదే కాలానికి 543 లక్షల టన్నులబొగ్గును రవాణా చేయగా, ఈ ఏడాది 582 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు ఆయన చెప్పారు. మొదటి 11 నెలల కాలంలో 286 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగించినట్లు చెప్పారు.

03/02/2018 - 01:25

న్యూఢిల్లీ, మార్చి 1: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన మూడు ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్తంభింపచేసింది. ఈ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా దర్యాప్తు సంస్థలకు అందజేసినట్లు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.

03/02/2018 - 01:23

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ప్రతిష్టాకరమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య సెక్రటరీ జనరల్‌గా సంజయ్ కపూర్‌ను నియమించినట్లు ఫ్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిఏ అరుణ్ లుహరుక ప్రకటించారు. ఆంధ్ర, తెలంగాణలో వాణిజ్య వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మంచి పరిష్కారం చూపిస్తారని ఆయన చెప్పారు.

03/02/2018 - 01:22

హైదరాబాద్, మార్చి 1: ప్రపంచంలో ఉన్నత విద్యాసంస్థలకు ప్రామాణిక సర్వేగా భావించే క్యూ ఎస్ వరల్డ్ రేటింగ్స్‌లో 25 భారతీయ ఉన్నత విద్యా సంస్థలకు చోటు దక్కింది. ప్రపంచంలో ఉత్తమ వెయ్యి విద్యాసంస్థల జాబితాను క్యూ ఎస్ వరల్డ్ గురువారం నాడు విడుదల చేసింది. ఆ జాబితాలో దేశాల వారీ చూసినపుడు భారత్‌లో ఐఐటి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.

03/02/2018 - 01:21

కాకినాడ, మార్చి 1: రాష్ట్రంలోని అన్ని చౌక డిపోల్లో కిలో కంది పప్పును రూ.40కే విక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ తెలిపారు.

Pages