S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/12/2018 - 07:16

న్యూఢిల్లీ, జనవరి 11: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దీర్ఘకాలిక బాండ్ల ద్వారా రూ. 20వేల కోట్లు సేకరించడానికి కసరత్తు చేస్తోంది. ఎస్‌బీఐ అఫర్డబుల్ హౌసింగ్ కోసం ఈ నిధులను వినియోగిస్తుంది. ఎస్‌బీఐ ఇందుకోసం రూ. 5వేల కోట్లు సేకరించాలని గతంలో ప్రతిపాదించింది. దేశీయ, విదేశీ మార్కెట్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అఫర్డబుల్ హౌసింగ్ కోసం గతంలో ప్రతిపాదించిన రూ.

01/12/2018 - 07:15

న్యూఢిల్లీ, జనవరి 11: తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి ఆల్పోన్స్ కన్నన్‌తనంకు విజ్ఞప్తి చెశారు. గురువారం దత్తాత్రేయ కన్నన్‌తనంతో సమావేమయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు.

01/12/2018 - 07:14

విశాఖపట్నం, జనవరి 11: పండుగ దగ్గర పడుతోంది. ఖర్చు ఎంత ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విశాఖ నగరంలో ఏటీఎంలలో నగదు నిల్వలు లేకుండా పోయాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని దాదాపు 80 నుంచి 85 శాతం ఏటీఎంలలో నగదు లేకపోవడం గమనార్హం. చాలా ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు తగిలించారు. మరికొన్నింటిని పాక్షికంగా మూసేశారు.

01/12/2018 - 07:12

హైదరాబాద్, జనవరి 11: ఆధునిక రవాణా వ్యవస్థ మెట్రోరైలు ఎపుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన మహానగర వాసులు మెట్రోతో పెద్దగా ప్రయోజనం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. నవంబర్ 28న ప్రదాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించిన మెట్రోరైలు ఆ మరుసటి రోజు 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చి నెలన్నర రోజులు పూర్తి చేసుకుంది.

01/12/2018 - 07:09

ముంబయి, జనవరి 11: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నికర లాభం 2017 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 3.6 శాతం తగ్గిపోయింది. కంపెనీ ఈ త్రైమాసికంలో రూ. 6,531 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న టీఎస్‌ఎస్ 2016 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ. 6,778 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

01/10/2018 - 23:54

న్యూఢిల్లీ, జనవరి 10: ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో విస్తృత సంస్కరణలు తీసుకొస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం బుధవారం భారత స్టాక్‌మార్కెట్లపై ఎలాంటి సానకూల ప్రభావాన్ని కనబరచలేకపోయింది. ఈమార్పుల కంటే కూడా రానున్న రోజుల్లో కార్పొరేట్ మూడో త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనే మదుపరులు ఆశలుపెట్టుకున్నారు. మంగళవారం జరిగిన లావాదేవీల్లో బాగా పుంజుకున్న సెనె్సక్, నిఫ్టీలు బుధవారం మందగించాయి.

01/10/2018 - 23:52

న్యూఢిల్లీ, జనవరి 10: రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ‘ట్రంప్ టవర్స్’ తొలిసారిగా ఉత్తర భారత్‌లో తన వ్యాపార లావాదేవీలను ప్రారంభిస్తోంది. ‘ఎం3ఎం ఇండియా’, ట్రైబెకా డెవలపర్స్ పేరిట అత్యంత విలాసవంతమైన గృహసముదాయాలను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ వద్ద ‘ట్రంప్ టవర్స్’ నిర్మిస్తుంది. ఇందుకు సుమారు 1,200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది.

01/10/2018 - 23:51

న్యూఢిల్లీ, జనవరి 10: బినామీ లావాదేవీలపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ దృష్టిసారించింది. నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు జరిపేవారిపై కొరడా ఝుళిపించాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ఇక నుంచి బినామీ లావాదేవీలు చెల్లవు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలు బినామీలను ఓ కంటకనిపెడతాయి.

01/10/2018 - 23:50

న్యూఢిల్లీ, జనవరి 10: మన దేశంలో ఇంటర్నెట్ వేగం తక్కువేనని వినియోగదారుల హక్కుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. దీంతో సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్న మాటలకు అర్థం లేదని స్పష్టమైంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌లో ఇంటర్నెట్ వేగం అత్యంత తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.

01/10/2018 - 23:50

విజయవాడ, జనవరి 10: దాదాపు 15 నెలల క్రితం గుంటూరు జిల్లా తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో జరిగిన కోటీ 20 లక్షల రూపాయల ఆర్థిక పరమైన కుంభకోణంపై బుధవారం శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా ఉప సంచాలకులు జోగారావు ఆ కార్యాలయ ప్రాంగణంలోనే తొలిరోజు ప్రధాన నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ వరుణ్‌బాబును విచారించారు.

Pages