S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/09/2018 - 23:58

భోగాపురం, జనవరి 9: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను మార్చిలో ప్రారంభిస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ వేంకటేశ్వర్లు వెల్లడించారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించారు.

01/09/2018 - 23:56

అనంతపురం, జనవరి 9: దేశంలోనే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న అనంతపురం జిల్లాకు త్వరలో మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ వేగవంతంగా సాగుతోంది. రామగిరి, కనగానపల్లి మండలాల పరిధిలో ఈ కొత్త ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో సోలార్, విండ్ హైబ్రీడ్ ప్రాజెక్టుగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

01/09/2018 - 00:17

న్యూఢిల్లీ, జనవరి 8: మొబైల్ ఫోన్లలో సంభాషణలకు సంబంధించి ‘కాల్ డ్రాప్స్’ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు ఈ సేవలు అందిస్తున్న ఆపరేటర్లు, వాటిని పర్యవేక్షిస్తున్న నియంత్రణ సంస్థ టెలికం రెగ్యులేటరి అథారిటి ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో టెలికాం శాఖ (డీఓటీ) ఈ నెల 10న సమావేశం కానుంది.

01/09/2018 - 00:16

ముంబయి, జనవరి 8: మూడో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు, స్థూలార్థిక గణాంకాలు, రానున్న బడ్జెట్ సానుకూలంగా ఉంటాయనే ఆశావాదంతో ఉన్న మదుపరులు ఈ వారం తొలి రోజు సోమవారం భారీగా షేర్ల కొనుగోలుకు పూనుకోవడంతో దేశీయ మార్కెట్ సూచీలు పుంజుకొని, జీవిత కాల గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి.

01/09/2018 - 00:24

విశాఖపట్నం, జనవరి 8: భారత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలే వెనె్నముకని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విశాఖలో జరిగే సమీక్షను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు సాలీనా రూ.18.54 లక్షల కోట్ల టర్నోవర్ సాధిస్తూ, రూ.1.15 లక్షల కోట్ల లాభాలను ఆర్జిస్తున్నాయన్నారు.

01/09/2018 - 00:12

న్యూఢిల్లీ, జనవరి 8: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విదేశాలలో విస్తరించడం కోసం రెండు బిలియన్ డాలర్ల (రూ. 12,600 కోట్లు) నిధులు సేకరించడానికి రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో అమెరికన్ డాలర్ లేదా ఇతర మారకం చేయగలిగిన కరెన్సీలో బాండ్లను జారీ చేయడానికి కసరత్తు చేస్తోంది.

01/09/2018 - 00:11

విశాఖపట్నం, జనవరి 8: దేశంలో సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పారిశ్రామిక రంగంలోనే అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనల శాఖ సహాయ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. సెంటర్ ఫర్ భారతీయ మేనేజ్‌మెంట్ బోర్డు (సీబీఎండీ) ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న హస్తకళల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు.

01/09/2018 - 00:10

విజయవాడ, జనవరి 8: విద్యుత్ ఉత్పాదక రంగాన్ని వెంటాడుతూ వస్తున్న నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ సరఫరా చార్జీల పెంపుదలపై ఫిబ్రవరి 5తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్నామని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ అన్నారు.

01/08/2018 - 01:41

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రస్తుత ఎన్నికల విరాళాల వ్యవస్థతో పోలిస్తే ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్నికల బాండ్ల విధానం వల్ల పారదర్శకత గణనీయంగా పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడానికి వివిధ వర్గాల సూచనలు, సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఆదివారం సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో స్పష్టం చేశారు.

01/08/2018 - 01:39

న్యూఢిల్లీ, జనవరి 7: సోమవారం మొదలయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో లావాదేవీల సరళి స్థూల ఆర్థిక గణాంకాలతో పాటు డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్‌లు చూపిన పనితీరుపై ఆధారపడి ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Pages