S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/10/2018 - 23:49

విశాఖపట్నం, జనవరి 10: రైతులు పండించే పంటను నిల్వచేసుకుని, గిట్టుబాటు ధర లభించినప్పుడు విక్రయించుకునే అవకాశాల్లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. తద్వారా సాలీనా రూ.70వేల కోట్ల మేర ఆహార పదార్థాలు వృథాగాపోతున్నాయి. కోల్డ్ స్టోరేజ్‌ల సామర్థ్యం పెంచితేనే రైతుకు తద్వారా దేశానికి మేలు చేకూరుతుందన్నది రైతుల అభిప్రాయం.

01/10/2018 - 23:49

విజయవాడ, జనవరి 10: ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ అమలు కోసం సీఎం చంద్రబాబు ఆరు మాసాల క్రితం జారీ చేసిన 107, 121 జీవోల తక్షణ అమలు కోరుతూ ఈ నెల 12న రాష్టవ్య్రాప్తంగా నిరసనోద్యమం చేపట్టబోతున్నామని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్

01/10/2018 - 23:48

న్యూఢిల్లీ, జనవరి 10: విద్యార్థులు, సిబ్బంది కోసం విద్యాసంస్థలు నిర్వహించే హాస్టల్ మెస్‌లకు 5 శాతం జీఎస్టీ (వస్తు సేవా పన్ను) మాత్రమే వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. హాస్టళ్లను విద్యాసంస్థలు నడిపినా, బయటి వ్యక్తులు నడిపినా కనిష్ఠ స్థాయిలోనే జీఎస్టీ ఉంటుంది.

01/10/2018 - 23:48

న్యూఢిల్లీ, జనవరి 10: తమ వెబ్‌సైట్ ద్వారా ఎరువులను కొనుగోలు చేస్తే వాటిని నేరుగా రైతుల ఇళ్లవద్దకు ఉచితంగా చేరవేస్తామని ‘ఇఫ్కో’ (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో-ఆపరేటివ్) ప్రకటించింది. ఈ తరహా సేవలను అందించేందుకు ‘ఇఫ్కో’ ఇటీవల ‘సహకార డిజిటల్ వేదిక’ను (తీతీతీ.జచిచిజష్యఇ్ఘచ్ఘీ.జశ) ప్రారంభించింది. 13 ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన ఈ వేదికలో ఇప్పటికే సభ్యుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరింది.

01/10/2018 - 00:07

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల రంగంలో 18 శాతానికి పైగా అదనపు వనరులను సమీకరించగలిగింది. అంతకుముందున్న కాలంతో పోలిస్తే ఏప్రిల్-డిసెంబర్ మధ్య ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 6.65లక్షల కోట్లమేర పెరిగాయి. ముఖ్యంగా అడ్వాన్స్ టాక్స్‌ల వల్ల ఈ పెరుగుదల నమోదైనట్టు తెలుస్తోంది.

01/10/2018 - 00:06

న్యూఢిల్లీ, జనవరి 9: భారత స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల ఊతంతో వరుసగా మూడోరోజు కూడా భారీగానే రాణించాయి. సమాచార టెక్నాలజీ, ఎఫ్‌ఎంసిజి, చమురు వాయువు, ఇంధన రంగాలకు చెందిన షేర్లు భారీగా పుంజుకోవడంతో సెనె్సక్స్ రికార్డుస్థాయిలో 34వేల 443.19 పాయింట్లకు చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా మరింతగా రాణించి 10637 పాయింట్ల వద్ద ముగిసింది.

01/10/2018 - 00:04

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రభుత్వరంగంలోని కోల్ ఇండియా కంపెనీ తక్షణమే అమల్లోకి వచ్చేవిధంగా ఇంధన, ఇంధనేతర వినియోగదారులకు వర్తించే రీతిలో థర్మల్ బొగ్గు ధరలను భారీగానే పెంచింది. దీని ప్రభావం వల్ల విద్యుత్ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఎదురవుతుందని ఉత్పత్తిదారులు స్పష్టం చేశారు. యూనిట్‌కు 0.50 శాతంమేర విద్యుత్ రేట్లు పెంపు అనివార్యమవుతుందన్న అభిప్రాయాన్ని ఉత్పత్తిదారులు వ్యక్తం చేశారు.

01/10/2018 - 00:02

న్యూఢిల్లీ, జనవరి 9: చదువు పూరె్తైన తరువాత ఉద్యోగమే పరమార్థం అనుకునేవారికి వాస్తవికంగా ఎదురయ్యే సవాళ్లు మింగుడుపడనివిగా ఉన్నాయని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో స్పష్టమైంది. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునేవారికి అనేక ఆశలు, కోరికలు ఉంటాయి.

01/10/2018 - 00:02

కర్నూలు, జనవరి 9: ఉత్పత్తి అయిన వెంటనే విద్యుత్ వినియోగించుకోవాల్సిన పరిస్థితి నుంచి నిల్వ చేసుకునే స్థాయికి సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందింది. ఈక్రమంలో విద్యుత్ నిల్వ చేసుకునే పరికరాలను తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. విదేశాల్లో అందుబాటులో ఉన్న పరికరాలు ప్రస్తుతం రాష్ట్రానికి చేరుకోవడానికి ఖర్చు ఎక్కువ అవుతుందని వారు పేర్కొంటున్నారు.

01/10/2018 - 00:01

రాజమహేంద్రవరం, జనవరి 9: రాష్ట్రంలో ప్రముఖ విమానాశ్రయంగా విస్తరిస్తోన్న రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి నేరుగా బెంగళూరు, చెన్నై వెళ్లడానికి సర్వీసులు మొదలయ్యాయి. మంగళవారం నుంచి ఇండిగో సంస్థ తన సర్వీసులను రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి ప్రారంభించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి.

Pages