S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/08/2017 - 01:01

న్యూఢిల్లీ, నవంబర్ 7: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)లోని అత్యధిక రేటు పన్ను అయిన 28 శాతం శ్లాబులో ప్రస్తుతం ఉన్న వస్తువుల సంఖ్యను తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు. జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన జీఎస్‌టీలో 1,200 పైచిలుకు ఉత్పత్తులను నాలుగు- 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులలో కుదించిన విషయం విదితమే.

11/08/2017 - 00:58

న్యూఢిల్లీ, నవంబర్ 7: అధికారిక పరమైన అసమర్థతలు దేశ అభివృద్ధి అవకాశాలను అడ్డుకోవడం కొనసాగినప్పటికీ, భారత్ రానున్న అయిదు ఆర్థిక సంవత్సరాల పాటు సగటున 6.5 శాతం వాస్తవ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధితో ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతుందని ఓ నివేదిక పేర్కొంది.

11/08/2017 - 00:57

న్యూఢిల్లీ, నవంబర్ 7: 2జి స్పెక్ట్రమ్ కేసు విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ మంగళవారం ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి గుట్టలకొద్దీ సమర్పించిన డాక్యుమెంట్లను, సాంకేతిక సమాచారాన్ని ఇంకా పరిశీలిస్తున్నందున తీర్పును ఇప్పుడే వెలువరించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

11/08/2017 - 00:57

హైదరాబాద్, నవంబర్ 7: నాస్కామ్ ఆధ్వర్యంలో గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ఈ నెల 8వ తేదీన హైటెక్స్‌లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ సదస్సుకు హేమాహేమీలు హాజరవుతున్నారు. భారత్‌లో గేమింగ్ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

11/08/2017 - 00:56

ముంబయి, నవంబర్ 7: దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఉదయం సెషన్ ప్రారంభంలో బాగా పుంజుకున్నప్పటికీ మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు భౌగోళిక-రాజకీయ ఆందోళనల కారణంగా సెషన్ ముగిసేసరికి 360 పాయింట్లు పడిపోయి 33,370.76 పాయింట్ల వద్ద స్థిరపడింది.

11/08/2017 - 00:55

గాజువాక, నవంబర్ 7: ఔషధ కంపెనీలు తయారు చేస్తున్న బల్క్‌డ్రగ్‌కు మార్కెట్‌లో ధర గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో అనేక చిన్న, మధ్య తరగతి ఔషధ కంపెనీల మనుగడ కష్టంగా మారుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇటువంటి ఔషధ కంపెనీల మనుగడ కష్టంగా ఉందని ఔషధ కంపెనీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

11/07/2017 - 01:29

ముంబయి, నవంబర్ 6: దేశీయ మార్కెట్ సూచీల గమనంలో సోమవారం మిశ్రమ స్పందన కనిపించింది. బిఎస్‌ఇ సెనె్సక్స్ 45.63 పాయింట్లు (0.14 శాతం) పుంజుకొని సరికొత్త గరిష్ఠ స్థాయి 33,731.19 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ క్రితం సెషన్‌లో నెలకొల్పిన రికార్డును చేజార్చుకొని ఎదుగూ బొదుగూ లేకుండా దాదాపు ఎక్కడిదక్కడే ఉండిపోయింది.

11/07/2017 - 01:28

న్యూఢిల్లీ, నవంబర్ 6: ఐసిఐజె (ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్ట్స్) బహిర్గతం చేసిన ‘ప్యారడైజ్ పత్రాలు’ జిందాల్ స్టీల్ వంటి కంపెనీలను ఒక కుదుపు కుదిపాయి. సోమవారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ (బిఎస్‌ఇ)లో ఈ కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్ల ధర అత్యధికంగా 2.32 శాతం పడిపోయింది.

11/07/2017 - 01:27

విజయవాడ, నవంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా సాగు చేస్తున్న టమాటా రైతుల కష్టాలు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన, తోట పంటల ద్వారా రైతులకు అత్యధిక లాభాలు వచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి జపాన్ కంపెనీ కాగోమ్ సంసిద్ధత వ్యక్తం చేసింది.

11/07/2017 - 01:25

హైదరాబాద్, నవంబర్ 6: నగరాల్లోనూ, పట్టణాల్లోనూ రవాణా సౌకర్యాలు- సవాళ్లు, వాటి పరిష్కారాల గురించి చర్చించడానికి హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు సోమవారం నాడు ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా సదుపాయాలు మెరుగుకు కొత్త మార్గాలను అనే్వషించాలని సదస్సు పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం లేని కొత్త తరహా రవాణా సౌకర్యాలపై దృష్టిసారించడంపై సదస్సుకు హాజరైన వక్తలు స్వాగతించారు.

Pages