S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/07/2017 - 01:23

ముంబయి, నవంబర్ 6: ‘ప్యారడైజ్ పత్రాల’లో పేరున్న విజయ్ మాల్యాకు చెందిన సంస్థలు సహా తన వద్ద లిస్టయిన వివిధ సంస్థలు, వాటి ప్రమోటర్లు అక్రమంగా నిధుల మళ్లింపునకు పాల్పడ్డాయా, కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఏమైనా లోపాలున్నాయా అనే అంశాలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) లోతుగా పరిశీలించనుంది.

11/07/2017 - 01:22

విజయవాడ, నవంబర్ 6: విశాఖలో టచ్ ప్యానెల్ తయారీ కంపెనీ ఏర్పాటుకు గొట్ట్ఫోన్ టెక్నాలజీ సంస్థ ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం సమావేశమయ్యారు. మొదటి దశలో భాగంగా ఈ సంస్థ 504 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. 300 మందికి ఉద్యోగాలను కల్పించనుంది.

11/07/2017 - 01:21

ముంబయి, నవంబర్ 6: అనిల్ అంబానీ గ్రూపు నియంత్రణలోని రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌ఎన్‌ఎఎం) షేర్లు సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఇ)లో 17 శాతానికి పైగా ప్రీమియంతో లిస్టయ్యాయి. ఆర్‌ఎన్‌ఎఎం ఇష్యూ ధర రూ. 252 కాగా, ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఇలో సోమవారం 17.42 శాతం ప్రీమియంతో రూ. 295.90 వద్ద లిస్టయ్యాయి. లిస్టయిన కొన్ని నిమిషాల్లోనే ఈ కంపెనీ షేర్ల ధర గరిష్ఠంగా రూ.

11/07/2017 - 01:19

హైదరాబాద్, నవంబర్ 6: ప్లాస్టిక్ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉందని రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ప్లాస్టిక్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో 200 ఎకరాలు కేటాయించి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు.

11/07/2017 - 01:19

గుంటూరు, నవంబర్ 6: పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయాన్ని సహించేదిలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరు మిర్చి యార్డులో సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వింటాల్‌కు 4320 మద్దతుధరతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అదే ధరకు రైతులకు 48 గంటల్లోగా చెల్లించాలని స్పష్టం చేశారు.

11/06/2017 - 00:52

న్యూఢిల్లీ, నవంబర్ 5: పెద్ద నోట్ల రద్దు తరువాత 35వేల కంపెనీలు రూ. 17వేల కోట్ల పైచిలుకు నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేశాయని, తరువాత ఆ మొత్తాలను ఉపసంహరించుకున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగిందని పేర్కొంది.

11/06/2017 - 00:50

న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశ ఆహార తయారీ ప్రక్రియ (్ఫడ్ ప్రాసెసింగ్) రంగంలో 11.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో అవగాహనా ఒప్పందాలు కుదిరాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ప్రభుత్వం పెట్టే పెట్టుబడులతో కలుపుకుంటే ఈ రంగంలో మొత్తం పెట్టుబడులు 18.84 బిలియన్ డాలర్లకు చేరాయని ఆమె తెలిపారు.

11/06/2017 - 00:48

హైదరాబాద్, నవంబర్ 5: సంక్షేమ పథకాల ద్వారా బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ స్టాంపు లు, మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. కాగా కేంద్రం రియల్ ఎస్టేట్ రంగం, మద్యం కూడా జిఎస్‌టి (వస్తుసేవా పన్ను) పరిధిలోకి తేవాలని ప్రతిపాదించింది. కాని ఈ ప్రతిపాదనను తెలంగాణతో పాటు దక్షిణాదిరాష్ట్రాలు, మహారాష్ట్ర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

11/06/2017 - 00:48

న్యూఢిల్లీ, నవంబర్ 5: నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులతో ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మిషన్లు కొనడం ఏమిటని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణరంగ కార్మికుల ప్రయోజనాల కోసం ఏర్పాటైన నిధిలో 29వేల కోట్ల రూపాయలు ఉండగా, పది శాతం మొత్తాన్ని కూడా సంక్షేమం కోసం ఖర్చు చేయకపోవడం విస్మయాన్ని, బాధను కలిగిస్తోందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

11/06/2017 - 00:47

హైదరాబాద్, నవంబర్ 5: ప్రముఖ హిటాచి గ్రూప్ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు డేటా ఆధారిత సేవలను అందించేందుకు గాను హిటాచి వంటారా పేరుతో నూతన కంపెనీని ప్రారంభించింది. హిటాచి గ్రూప్‌లోని అంతర్భాగమైన హిటాచి డేటా సిస్టమ్స్, పెంటహోల కార్యకలాపాలను ఏకీకృతం చేసేదే ఈ నూతన కంపెనీ హిటాచి వంటారా అని హిటాచి లిమిటెడ్ అధ్యక్షుడు తోషియాకి హిగషిహోర తెలిపారు.

Pages