S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/03/2019 - 23:58

వాషింగ్టన్, నవంబర్ 2: అమెరికా, చైనా దేశాల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి త్వరలోనే తెరపడుందా? కనీసం ఆ దిశగా ఒక అడుగు ముందుకు పడుతుందా? ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే, ఇది నిజమేనని అనిపిస్తున్నది. ఈనెల రెండోవారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సాంటియాగో (చిలీ)లో సమావేశం కావాల్సి ఉంది.

11/03/2019 - 23:57

న్యూఢిల్లీ, నవంబర్ 3: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) నేపథ్యంలో, హానుంగ్ టాయిస్ ప్రమోటర్ అశోక్ కుమార్ బన్సాల్, ఆయన భార్య అంజూ బన్సాల్‌ను ఢిల్లీ విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హానుంగ్ టాయిస్ అండ్ టెక్స్‌టైల్స్ లిమిటెడ్ సంస్థకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌సహా మొత్తం 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2,300 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చాయి.

11/03/2019 - 23:56

న్యూఢిల్లీ, నవంబర్ 3: మిడ్ క్యాప్‌లో ‘టాప్ టెన్’ జాబితాలోని ఎనిమిది కంపెనీలు గత వారం లాభాల పంట పండించాయి. వాటి మార్కెట్ విలువ ఏకంగా 1.34 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. శుక్రవారంతో ముగిసిన లావాదేవీల్లో మార్కెట్ కేపిటలైజేషన్ ర్యాలీ కొనసాగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లాభపడితే, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంక్ నష్టాలను చవిచూశాయి.

11/03/2019 - 04:48

న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఇండియాబుల్ భారత మార్కెట్‌ను విస్తరణ, బకాయిల చెల్లింపుల కోసం లండన్‌లోని తన ఆస్తులను అమ్మేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, సాధ్యమైనంత త్వరలో ఒక ప్రమోటర్ గ్రూప్‌కు లండన్ ఆస్తులను 200 మిలియన్ పౌండ్లు (సుమారు 1,830 కోట్ల రూపాయలు)కు విక్రయించాల్సి ఉంది.

11/02/2019 - 23:07

ముంబయి, నవంబర్ 2: భారత స్టాక్ మార్కెట్ ఈవారం మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఐదు రోజుల లావాదేవీల్లో సెస్సెక్స్ 1,106.97 పాయింట్లు (2.83 శాతం) పెరిగింది. నిఫ్టీ కూడా లాభాల బాటలోనే నడిచింది. 306.70 పాయింట్లు (2.64 శాతం) మెరుగుపడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో, దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.

11/02/2019 - 23:05

న్యూఢిల్లీ, నవంబర్ 2: గుర్‌గావ్‌లో గృహ నిర్మాణ సముదాయాలను నిర్మించడానికి 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని ప్రముఖ రియాల్టీ సంస్థ ఎంఆర్‌జీ నిర్ణయించింది. సరసరమైన ధరలకే ఇళ్లను అందించాలనే ఉద్దేశంతో, 22 నుంచి 26 లక్షల రూపాయల మధ్య ఈ ఇళ్ల ధరలను ఖాయం చేస్తామని శనివారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆ సంస్థ పేర్కొంది.

11/02/2019 - 23:04

న్యూఢిల్లీ, నవంబర్ 2: జెరాఫిన్ ఫినె్వస్ట్‌ను ఆన్‌లైన్ ఆటోమొబైల్ మార్కెట్ దిగ్గజం డ్రూమ్ ఫైనాన్స్ కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి ఈ ఒప్పందం కుదిరిందనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. గత 12 నెలల కాలంలో డ్రూమ్ క్రెడిట్ పది వేలకుపైగా రుణాలను ప్రాసెస్ చేసింది.

11/02/2019 - 23:03

బ్యాంకాక్, నవంబర్ 2: థాయ్ ఎయిర్‌వేస్ చైర్మ న్ ఎక్నిటీ నితితాన్‌ప్రపాస్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. థాయ్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో, ఆయన పనితీరుపై కొద్దికాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజీనామా చేసితీరాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తున్నది. మరోవైపు కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

11/01/2019 - 23:50

చౌటుప్పల్, నవంబర్ 1: దేశానికే దిక్సూచిగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఇండస్ట్రియల్ పార్కుకు భూమిపూజ చేశారు.

11/01/2019 - 22:31

ముంబయి, నవంబర్ 1: అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాల బాటలో నడిచాయి. ఈవారం లావాదేవీలకు చివరి రోజున శుక్రవారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో నిఫ్టీ 35.98 పాయింట్లు (0.09 శాతం) పెరిగి, 40,165.03 పాయింట్ల వద్ద ముగిసింది.

Pages