S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/06/2019 - 23:11

ముంబయి, నవంబర్ 6: అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణులను ప్రదర్శించడంతో ఏడు సెషన్స్‌పాటు లాభాలను ఆర్జించి, మంగళవారం హఠాత్తుగా స్వల్ప నష్టాలను ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. పెట్టుబడులకు విదేశీ మదుపరులు ఆసక్తి ప్రదర్శించడంతో ఆరంభంలో మందకొడిగా సాగిన లావాదేవీలు క్రమేణా పుంజుకున్నాయి.

11/06/2019 - 05:32

ముంబయి: రియాల్టీ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచనప్రాయంగా వెల్లడించారు. మంగళవారం ఇక్కడ జరిగిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ) రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన కొన్ని రాయితీలతో రియాల్టీ రంగం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదని అన్నారు.

11/06/2019 - 02:04

న్యూఢిల్లీ, నవంబర్ 5: ‘సరదా, సరదా సిగిరెట్టు...ఇది దొరలు తాగు భలే సిగిరెట్టు...పట్టుబట్టి ఓ దమ్ములాగితే, స్వర్గానికి ఇది తొలి మెట్టు..’ అనే ఈ పాట ‘రాముడు-్భముడు’ పాత చిత్రంలో భలే హిట్టయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వివాదం అంతా సాధారణ సిగిరెట్లకు, ఈ-సిగిరెట్లకు మధ్యే. ఈ-సిగిరెట్లు మార్కెట్‌లోకి వచ్చేసాయి. అయితే ఇవి వచ్చిన రెండు నెలలకే కేంద్ర ప్రభుత్వం ఈ-సిగిరెట్లను నిషేధించింది.

11/06/2019 - 01:54

ముంబయిలో ఆర్‌బీఐ కార్యాలయం ముందు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు ప్లకార్డులను ప్రదర్శించారు

11/06/2019 - 00:50

హైదరాబాద్, నవంబర్ 5: జీఎస్‌టీ వసూళ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు లేఖ రాశారు. జీఎస్‌టీ వసూళ్ల నుంచి రాష్ట్రాలకు మొత్తం రూ. 1,76,688 కోట్లలో రూ. 67,998 కోట్లు మాత్రమే చెల్లించినట్టు తన లేఖలో హరీశ్‌రావు గుర్తు చేశారు.

11/05/2019 - 23:35

*చిత్రం... న్యూఢిల్లీలో సేవారంగంపై జరిగే గ్లోబల్ ఎగ్జిబిషన్ కర్టెన్‌రైజర్‌కు హాజరైన రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తదితరులు

11/05/2019 - 23:33

ముంబయి, నవంబర్ 5: వరుసగా ఏడు సెషన్స్ సాగిన బుల్ రన్‌కు మంగళవారం బ్రేక్ పడింది. ఒకానొక దశలో ఆల్ టైమ్ రికార్డుకు చేరువైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 53.73 పాయింట్లు (0.13 శాతం) పతనమై 40,248.23 పాయింట్ల వద్ద ముగిసింది. నిజానికి సోమవారం మాదిరిగానే 30 షేర్ బీఎస్‌ఈ సూచీలు లాభసాటిగా ప్రారంభమయ్యాయి. ఈ ర్యాలీ కొంతసేపు కొనసాగడంతో 40,466.55 పాయింట్లకు చేరింది.

11/05/2019 - 05:28

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలు సోమవారం భారతీయ మార్కెట్లకు కొత్త ఊతాన్ని ఇచ్చాయి. ఐటీ, మెటల్, ఆర్థిక రంగానికి చెందిన సంస్థల షేర్లు భారీగా పుంజుకోవడంతో సెనె్స క్స్ 137 పాయింట్లు పెరిగి 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 50.70 పాయింట్లు పెరిగి 11,941.30 వద్ద ముగిసింది.

11/05/2019 - 04:20

హైదరాబాద్, నవంబర్ 4: రైల్వేల ఆస్తుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు జోరందుకున్నాయి. రైల్వే బోర్డ్ ఆదేశాలను పాటిస్తూ స్థానిక రైల్వే అధికారులు ప్రైవేటీకరణకు టెండర్లు పిలుస్తున్నారు. రైల్వేల ఆస్తులను 99 సంవత్సరాల పాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడానికి రైల్వే బోర్డ్ నిర్ణయించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వేకి చెందిన వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు ప్రైవేట్ పరం కానున్నాయి.

11/05/2019 - 03:50

న్యూఢిల్లీ, నవంబర్ 4: అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని జౌళి శాఖ కార్యదర్శి రవి కపూర్ తెలిపారు. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించేందుకు రేవు పట్టణాల సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత మెగా పార్కులను 10కి పైగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Pages