S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/10/2019 - 02:13

న్యూఢిల్లీ, నవంబర్ 9: అయోధ్యలోని వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల భారత పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టు ధర్మాసనం ఎంతో ధైర్యంగా, చరిత్రాత్మక తీర్పునిచ్చిందని మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

11/10/2019 - 02:19

న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ నికర రానం పెరిగింది. సెప్టెంబర్ మాసంతో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 3,408.92 కోట్ల రూపాయలని, గతంతో పోలిస్తే ఇది 38 శాతం అధికమని శనివారం బీఎస్‌ఈలో దాఖలు చేసిన ఫైలింగ్‌లో ఎన్టీపీసీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ నికర లాభం 2,477.28 కోట్ల రూపాయలని తెలిపింది.

11/09/2019 - 00:26

అమరావతి, నవంబర్ 8: కడప ఉక్కు కర్మాగారానికి నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్ర పెట్రోలియం, గనులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.

11/08/2019 - 23:45

న్యూఢిల్లీ, నవంబర్ 8: అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ. 196 తగ్గి మొత్తం ధర రూ. 38,706గా ట్రేడైంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అందించిన వివరాల మేరకు గురువారం 10 గ్రాముల ధర రూ. 38,902 పలికింది. స్టాక్ మార్కెట్ల వైపు మదుపర్లు దృష్టి మళ్లించిన క్రమంలో వెండి ధర సైతం కిలోపై రూ. 956 తగ్గి మొత్తం ధర రూ.

11/08/2019 - 23:35

ముంబయి, నవంబర్ 8: జీవితకాల రికార్డు గరిష్టం నుంచి శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారాయి. వృద్ధిరేటును దృష్టిలో ఉంచుకుని మనదేశ ఆర్థిక బల (క్రెడిట్) రేటింగ్ అంచనాలను అంతర్జాతీయ అధ్యయన సంస్థ మూ డీస్2 తగ్గించడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. వారం రోజుల ట్రెండ్‌కు కొనసాగింపుగా బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఓ దశలో మరోదఫా ఇంట్రాడే గరిష్టం 40,749.33కు చేరింది.

11/08/2019 - 23:34

ముంబయి, నవంబర్ 8: నేషనల్ ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా నగదు బదిలీలు చేసేవారికి శుభవార్త. వచ్చే 2020 జనవరి నుంచి ఈ నగదు బదిలీకి బ్యాంకులకు ఎలాంటి చార్జీలూ చెల్లించక్కర్లేదు. ఈమేరకు వచ్చిన ప్రతిపాదనలకు రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం ఆమోద ముద్ర వేసింది.

11/08/2019 - 23:33

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రస్తుతం పెరిగిన మదుపర్ల ఆసక్తి నేపథ్యంలో మారకద్రవ్య వాణిజ్య నిధులు (ఈటీఎఫ్‌లు), జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో ఆస్తుల ఆధారిత సెక్యూరిటీల విలువ గత ఆరు నెలల కాలంలో తొమ్మిది శాతం పెరిగి మొత్తం రూ. 1.5 లక్షల కోట్లకు చేరింది. గడచిన సెప్టెంబర్‌తో ముగిసిన అర్థ సంవత్సర కాలానికి ఈ గణాంకాలు వెలువడ్డాయి.

11/08/2019 - 23:33

న్యూఢిల్లీ, నవంబర్ 8: గడచిన అక్టోబర్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల ఆధారిత విలువ 7.4 శాతం పెరిగి రూ. 26.33 లక్షల కోట్లకు చేరింది. భారీగా ఈక్విటీ, ద్రవ్య పథకాల్లోకి నిధులు రావడంతో ఇది సాధ్యమైంది. గడచిన సెప్టెంబర్ మాసంలో ఈ ఆస్తుల విలువ రూ. 24.5 లక్షల కోట్లుగా ఉందని ఆసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా శుక్రవారం నాడిక్కడ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ హౌస్‌లకు మొత్తం రూ.

11/08/2019 - 22:56

హైదరాబాద్, నవంబర్ 8: పారిశ్రామిక రంగంలో తెలంగాణ చకాచకా అడుగులు వేస్తోంది. దండుమల్కాపూర్‌లో పారిశ్రామిక వాడకు చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల నుంచి లభించిన విశేషమైన డిమాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) దూసుకుపోతోంది. రాష్ట్రంలో పలు నగరాల శివార్లలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు టీఎస్‌ఐఐసీ కసరత్తును ముమ్మరం చేసింది.

11/08/2019 - 05:02

న్యూఢిల్లీ: బీమా నియంత్రణ సంస్థ ‘ఇర్దాయ్’ గురువారం అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఐసీఎల్)పై కొరడా ఝళిపించింది. బలహీన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొత్త పాలసీలేవీ ఈ సంస్థ విక్రయించరాదంటూ ఆంక్షలు విధించింది.

Pages