S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/29/2019 - 01:56

విశాఖపట్నం: విశాఖ నుంచి సింగపూర్‌కు విమాన సేవలందించేందుకు స్కూట్ ఎయిర్‌లైన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం విశాఖ నుంచి సింగపూర్‌కు సిల్క్ ఎయిర్ లైన్స్ వారంలో మూడు రోజుల పాటు సర్వీసులు నడుపుతోంది. దీని స్థానంలో స్కూట్ ఎయిర్‌లైన్స్ వారానికి అయిదు రోజుల పాటు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారాల్లో ఈ విమానం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

10/27/2019 - 02:51

ముంబయి, అక్టోబర్ 26: ఈవారం స్టాక్ మార్కెట్‌లో, దేశంలోని పది టాప్ సంస్థల విలువ భారీగా పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లాభపడింది. భారత స్టాక్ మార్కెట్‌లో ఈవారం జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే, 3టాప్-102 సంస్థల విలువ 76,998 కోట్ల రూపాయలు పెరిగింది. ఇందులో టీసీఎస్ వాటా 25,403.64 కోట్ల రూపాయలు. ఈ పెరుగుదలతో ఈ సంస్థ విలువ 7,87,400.51 కోట్ల రూపాయలకు చేరింది.

10/27/2019 - 02:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 19 శాతం పెరిగాయి. వాణిజ్యపరమైన ఆస్తుల రంగం అత్యధికంగా లాభపడిం ది. మొత్తం మీద పీఈ పెట్టుబడులు ఇప్పుడు 3.8 బిలియన్ డాలర్లకు (సుమా రు రూ.2,691.92 కోట్లు) చేరాయి.

10/27/2019 - 02:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంగాలో ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలు తగ్గుముఖం పట్టాయి. నికర లాభం 6శాతం తగ్గి, రూ.1,131.20 కోట్లుగా నమోదైంది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి రూ.1,204.62 కోట్ల లాభాన్ని గడించిన ఐసీఐసీఐ బ్యాంక్, ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలానికి స్వల్పంగా నష్టపోయింది.

10/27/2019 - 02:06

*చిత్రం...ఆగ్రాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బటేశ్వర్ ప్రాంతంలో ఒంటెలపై సరుకులు తీసుకొచ్చి, అమ్మకాలు కొనసాగించేందుకు కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్న చిరు వ్యాపారులు.

10/26/2019 - 00:10

హైదరాబాద్, అక్టోబర్ 25: వచ్చే ఏడాది (2020)ని కృత్రిమ మేధో (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్) సంవత్సరంగా పాటిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో కృత్రిమ మేధో రంగంలో పనిచేసేందుకు నాస్కామ్ ముందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఏడాది పొడువున పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

10/26/2019 - 00:08

దంతేరస్ సందర్భంగా హైదరాబాద్‌లో బంగారం కొనుగోలు చేస్తున్న మహిళలు

10/25/2019 - 22:01

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్య వారం చివరి రోజైన శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వాటాలు కొందామా వద్దా అన్న సంశయం రోజంతా మదుపర్లలో కనిపించింది. కేవలం బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లకే వారు పరిమితం కావడం జరిగింది. ఈక్రమంలో బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తొలుత ఏకంగా 532 పాయింట్లు ఎగబాకి ఊపుమీదున్నట్టు కనిపించింది.

10/25/2019 - 22:01

ముంబయి, అక్టోబర్ 25: ఒక రోజు సెలవుదినంతో కూడుకుని శుక్రవారంతో ముగిసిన వాణిజ్య వారం మొత్తంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలే మిగిలాయి. సెనె్సక్స్ 240.32 పాయింట్లు (0.61 శాతం) నష్టపోగా, నిఫ్టీ 77.95 పాయింట్లు (0.66 శాతం) నష్టపోయింది. ఇక శుక్రవారంతో ముగిసిన హిందూ కేలండర్ ఇయర్ ‘సంవత్ 2075’లో రెండు సూచీలు మంచి ఫలితాలను నమోదు చేయడం విశేషం.

10/25/2019 - 21:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ధన్‌తేరస్ పర్వదినం పసిడి ధరలకు రెక్కలు తొడిగింది. దీంతో శుక్రవారం దేశ రాజధానిలో 10 గ్రాముల (తులం) బంగారంపై రూ. 220 పెరిగి మొత్తం ధర రూ. 39,240కి చేరింది. ధన్‌తేరస్ నుంచి వరసగా మూడు రోజులపాటు దేశ, విదేశాల్లోని భారతీయులు దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు నేపథ్యంలో వెండి, బంగారాలకు మూడు రోజులు మరింతగా డిమాండ్ నెలకొనడం రివాజుగా మారింది.

Pages