S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/12/2019 - 05:47

అబుదాబీ/న్యూఢిల్లీ, నవంబర్ 11: భారత్‌లోని చమురు, సహజ వాయువుల రంగంలో విరివిగా పెట్టుబడులు మదుపు చేయాలని సోమవారం నాడిక్కడ విదేశీ కంపెనీలకు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారైన భారత్ దేశీయంగా చమురు, సహజ వాయువుల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన వౌలిక వసతులకోసం 100 బిలియన్ డాలర్లు వెచ్చించే ప్రణాళికలతో ముందుకెళుతోందన్నారు.

11/11/2019 - 23:18

ముంబయి, నవంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్పంగా లాభపడ్డాయి. రోజంతా ఒడిదుడుకులతో సాగిన సూచీలు బ్యాం కింగ్ స్టాక్స్ తెచ్చిన లాభాలతో ఎట్టకేలకు లాభాలను నమోదు చేశాయి. హాంగ్‌కాంగ్‌లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా ఈక్విటీలు స్వల్పంగా నష్టాల పాలవడం, అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో అనిశ్చితి నెలకొడం కూడా ఆసియా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.

11/11/2019 - 05:48

న్యూఢిల్లీ: కీలక స్థూలార్థిక అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల దిశను నిర్దేశించే అవకాశం ఉంది. ఎందుకంటే, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి సీజన్ దాదాపు ముగింపునకు వస్తోందని, అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మొత్తంమీద ఇనె్వస్టర్ల సెంటిమెంట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని మార్కెట్ విశే్లషకులు అంచనా వేశారు.

11/11/2019 - 05:11

చండీగఢ్, నవంబర్ 10: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో గల చురురు గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ అనే పెయింటర్‌కు భారీ బహుమతి లభించింది. పంజాబ్‌లో నిర్వహించిన లాటరీలో ఆయనను రూ. 2.5 కోట్ల బహుమతి వరించింది. పంజాబ్ స్టేట్ మా లక్ష్మీ దివాలీ-పూజా బంపర్-2019 సంజీవ్ కుమార్ జీవితంలో వెలుగులు నింపింది.

11/11/2019 - 04:03

ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఓ పుస్తకాన్ని ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ డెబ్రో. ఈ పుస్తకాన్ని అనంత నాగేశ్వరరావు రాశారు (కుడి వైపుఉన్న వ్యక్తి)

11/11/2019 - 03:58

న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇనె్వస్టర్లు నవంబర్ తొలి వారంలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడటంతో విదేశీ ఇనె్వస్టర్లు నవంబర్ తొలి వారంలో నికరంగా రూ. 12వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

11/11/2019 - 03:57

న్యూఢిల్లీ, నవంబర్ 10: మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) అక్టోబర్ నెలలో తన ఉత్పత్తిని 20.7 శాతం తగ్గించింది. దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి తన ఉత్పత్తిలో కోత విధించుకోవడం ఇది వరుసగా తొమ్మిదో నెల. ఎంఎస్‌ఐ ఈ సంవత్సరం అక్టోబర్‌లో మొత్తం 1,19,337 యూనిట్లను ఉత్పత్తి చేసింది.

11/10/2019 - 06:12

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు గల రెండో త్రైమాసికంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ నష్టాన్ని చవిచూసింది. శనివారం బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో 357.18 కోట్ల రూపాయల నికర నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ నష్టం 132.31 కోట్ల రూపాయలుకాగా, ఈ ఏడాది భారీగా పెరిగింది.

11/10/2019 - 02:17

విశాఖపట్నం, నవంబర్ 9: పారిశ్రామిక ప్రగతి, సుస్థిర వాణిజ్యంలో లాజిస్టిక్ రంగానిదే కీలకపాత్రగా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) విశాఖ చాప్టర్ ఆధ్వర్యాన విశాఖలో శనివారం జరిగిన లాజిస్టిక్స్ 2019 కాన్ఫరెన్స్‌లో విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ మాట్లాడారు.

11/10/2019 - 02:15

ముంబయి, నవంబర్ 9: వివాదాస్పద అయోధ్య-రామ మందిర్ వివాదానికి తెరదించుతూ శనివారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కనిపిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. గత వారం ఇటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజి (బీఎస్‌ఈ), అటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి (ఎన్‌ఎస్‌ఈ) కొనసాగిన బుల్ రన్‌కు ఈవారం బ్రేక్ పడింది. ఏడు సెషన్స్‌పాటు వరుస లాభాల్లో సాగిన స్టాక్ మార్కెట్లు ఈవారం ఒడిదుడుకులకు లోనైయ్యాయి.

Pages