S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/03/2017 - 00:49

న్యూఢిల్లీ, మే 2: అలీబాబా సారథ్యంలోని పేటిఎమ్.. గత ఆరు రోజుల్లో 30 కిలోలకుపైగా ‘డిజిటల్ గోల్డ్’ అమ్మకాలు జరిగినట్లు మంగళవారం తెలిపింది. గోల్డ్ రిఫైనర్ ఎమ్‌ఎమ్‌టిసి-పిఎఎమ్‌పి భాగస్వామ్యంతో గత వారం ‘డిజిటల్ గోల్డ్’ సర్వీసును పేటిఎమ్ ప్రారంభించినది తెలిసిందే. పేటిఎమ్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు బంగారం అమ్మకాలు, కొనుగోళ్లు జరిపేందుకు ఈ ‘డిజిటల్ గోల్డ్’ సర్వీసు అవకాశం కల్పించింది.

05/03/2017 - 00:48

న్యూఢిల్లీ, మే 2: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అనుబంధ విభాగమైన ఎస్‌బిఐ కార్డు.. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ రెడ్‌జిరాఫీతో చేతులు కలిపింది. దీంతో ఆన్‌లైన్‌లో రెడ్‌జిరాఫీపై ఇక ఎస్‌బిఐ కార్డుతో నెలసరి అద్దెలు చెల్లించే వీలు కలిగింది.

05/03/2017 - 00:46

న్యూఢిల్లీ, మే 2: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. గత నెల మొత్తం అమ్మకాలు 6 శాతం క్షీణించి 39,357 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఏప్రిల్‌లో 41,863 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దేశీయంగా ఈసారి 37,829 యూనిట్ల అమ్మకాలు జరగగా, ఎగుమతులు 1,528 యూనిట్లుగా ఉన్నాయని సంస్థ తెలిపింది.
మహీంద్ర ట్రాక్టర్

05/03/2017 - 00:46

మంగళవారం న్యూఢిల్లీలో రెనాల్ట్ సంస్థ.. పెట్రోల్ విభాగంలో తమ సరికొత్త ఎస్‌యువి డస్టర్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 10.32 లక్షల రూపాయలు

05/03/2017 - 00:44

ముంబయి, మే 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 2.78 పాయింట్లు పెరిగి 29,921.18 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 9.75 పాయింట్లు అందుకుని 9,313.80 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభంలో భారీ లాభాలను పొందినప్పటికీ, చివరిదాకా అవి కొనసాగలేకపోయాయి.

05/03/2017 - 00:43

విశాఖపట్నం, మే 2: పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు నవ్యాంధ్రలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) విశాఖపట్నం జోన్ చైర్మన్ డి తిరుపతి రాజు అన్నారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ‘ఒక పరిశ్రమ స్థాపించాలంటే భూమి అవసరం.

05/02/2017 - 00:30

న్యూఢిల్లీ, మే 1: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్నట్లుగా షేర్ చిన్నది.. లాభం పెద్దది అనాల్సి వస్తోంది. అవును.. స్టాక్ మార్కెట్లలో బడా సంస్థల షేర్ల కంటే చిన్న, మధ్యశ్రేణి షేర్లే.. మదుపరులకు పెద్దగా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. బ్లూచిప్ సూచీ షేర్లలో పెట్టుబడులతో పోల్చితే స్మాల్, మిడ్-క్యాప్ సూచీల షేర్లలో పెట్టుబడులతో ఆకర్షణీయమైన లాభా లు అందుతున్నాయి.

05/02/2017 - 00:28

న్యూఢిల్లీ, మే 1: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 976.48 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 695.78 కోట్ల రూపాయలుగా ఉంది.

05/02/2017 - 02:14

ముంబయి, మే 1: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. వివిధ కాలపరిమితి గల తమ టర్మ్ డిపాజిట్ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. కోటి రూపాయల దిగువన ఉన్న మధ్య, ధీర్ఘకాలిక డిపాజిట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీంతో రెండు నుంచి మూడేళ్ల డిపాజిట్లకు ఎస్‌బిఐ ఇచ్చే వడ్డీరేటు 6.25 శాతానికి పడిపోయింది. ఇంతకుముందు ఇది 6.75 శాతంగా ఉంది.

05/02/2017 - 00:27

న్యూఢిల్లీ, మే 1: రాయితీ వంటగ్యాస్ (ఎల్‌పిజి) ధర సిలిండర్‌కు దాదాపు 2 రూపాయలు పెరిగింది. అలాగే లీటర్ కిరోసిన్ ధర కూడా 26 పైసలు పెరిగింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం.. నెమ్మదిగా వంటగ్యాస్, కిరోసిన్‌లపైనా ఇలా కొద్దికొద్దిగా పెంచుతూ తొలగించాలని చూస్తోంది.

Pages