S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

09/10/2019 - 02:21

బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుండి మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన బెంగాలీ, రొహింగియా ముస్లింలను గుర్తించడంలో జాతీయ పౌర జాబితా (నేషనల్ రిజిష్టర్ ఫర్ సిటిజన్స్) ఘోరంగా విఫలమైంది. ఈ జాబితా ఎంత గొప్ప గా పని చేసిందంటే- స్థానిక హిందువులపై ‘అక్రమ వలసదారుల’ని ముద్ర వేసి, ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలను మాత్రం భారత పౌరులుగా గుర్తించింది.

08/27/2019 - 01:46

జమ్మూ కశ్మీర్‌ను జాతీయ జీవన స్రవంతిలో కలిపి నాలుగు వారాలు కావస్తోంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడి ప్రజలు ఎలాంటి కోపతాపాలకు గురికాకుండా- హింసకు తావివ్వకపోవటం అభినందనీయం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో జమ్ము, లద్దాక్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

08/20/2019 - 03:47

గత్యంతరం లేని పరిస్థితిలో సోనియా గాంధీ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టవలసి వచ్చింది. రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం ఫలితంగా క్లిష్టదశకు చేరుకున్న కాంగ్రెస్‌ను- అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా కాపాడగలుగుతారా? రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ దాదాపునిర్వీర్యమైపోయిన దీనస్థితిలో- అధ్యక్షుడే లేకుండా ఒకటిన్నర నెలలు స్తబ్దత కొనసాగడం ఆ పార్టీ నాయకులను మరింతగా నీరసపరచింది.

08/13/2019 - 04:05

కశ్మీర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇపుడు అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని వివాదాస్పదం చేయాలని పాక్ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. పాక్‌కు బాసటగా నిలిచేందుకు ఏ ఒక్క దేశం కూడా ముందుకురాలేదు.

08/06/2019 - 02:01

జాతీయ జనజీవన స్రవంతిలో కలసిపోయి, కశ్మీర్ ప్రాంతం అభివృద్ధి బాటలో పయనించేందుకే ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఈ రెండు అధికరణలను కొనసాగించినంత కాలం జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా కాకుండా పోతుందనేది కాదనలేని వాస్తవం. ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగినంత కాలం కశ్మీర్ సమస్యకు పరిష్కారం అసాధ్యమని కూడా మోదీ ప్రభుత్వం భావించింది.

07/30/2019 - 02:14

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. లోకసభ, శాసనసభల వంటి చట్ట సభల్లో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అదుపులో ఉండటంతోపాటు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది.

07/23/2019 - 02:55

అధికారం కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న ఫిరాయింపుల నాటకానికి తెర దించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నీరు కారిపోతుంది. రాజకీయ పార్టీల పట్ల ప్రజలకు విశ్వసనీయత సన్నగిల్లుతుంది. కర్నాటకలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు మన నేతల అధికార దాహానికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్, భాజపాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం కర్నాటక ప్రతిష్టను దెబ్బతీస్తోంది.

07/16/2019 - 22:36

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘కమల దళం’ ఆధునిక రాజకీయ అశ్వమేధ యాగం ప్రారంభించింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ తామే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో భాజపా అధినాయకత్వం ఇలా ప్రజాస్వామ్య యుగంలో అశ్వమేధ యా గానికి శ్రీకారం చుట్టింది.

07/09/2019 - 04:53

ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనంలో తొలి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌లో నవ భారత నిర్మాణం దిశగా అడుగులు వేశారు. పేదలు, పల్లెలు, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన 2019-20 సంవత్సరం బడ్జెట్ ప్రభుత్వ లక్ష్యాలను సునాయసంగా సాధిస్తుందని చెప్పవచ్చు.

07/02/2019 - 02:58

బ్రిటీష్ పాలన నుండి దేశానికి స్వాతంత్య్రం సంపాదించేందుకు ఊపిరి పోసుకున్న కాంగ్రెస్ తన లక్ష్యాన్ని సాధించింది కాబట్టి మూసివేయాలన్న జాతిపిత మహత్మా గాంధీ కలలను రాహుల్ గాంధీ ఇప్పుడు సార్థకం చేస్తున్నాడా? మహాత్మా గాంధీ తన హత్యకు మూడు రోజుల ముందు అంటే 1948 జనవరి 27 తేదీనాడు ఒక నోట్ రాశాడు.

Pages