S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

06/09/2017 - 00:03

కులవృత్తులకు చేయూతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మేరు (దర్జీ) కులస్థులను గుర్తించకపోవడం శోచనీయం. తెలంగాణలోని మొత్తం 31 జిల్లాల్లో ఈ కులస్థుల జీవన స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఇతర కులాల, మతాల వారు సైతం దర్జీపని చేస్తున్నందున మేరు కులస్థులకు ఉపాధి తగ్గుతోంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ కులస్థులకు సంక్షేమ పథకాలను, రుణాలను, ఇతర రాయితీలను అందించాలి.

06/07/2017 - 00:02

ప్రభుత్వ టీచర్లందరికీ ‘ఏకీకృత సర్వీస్ రూల్సు’ అమలు చేసేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులు ఇదివరకే ప్రకటించారు. టీచర్లందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తామన్న వారి వాగ్దానం ఇపుడు అటకెక్కిపోయింది. ప్రస్తుతానికి పంచాయతీ రాజ్ టీచర్లకు మాత్రమే ఏకీకృత సర్వీస్ రూల్సు వర్తిస్తాయని స్పష్టమైంది. ‘ఏకీకృతం’ అంటే వేర్వేరుగా ఉన్న వాటిని కలపడమే కదా.

06/06/2017 - 00:17

తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. సగం మురుగు కాల్వలు శిథిలావస్థలో ఉండగా మురుగంతా రోడ్లపైకి వచ్చేస్తోంది. ప్రధాన రోడ్లపై ఏర్పడిన గుంతల్లో నీరు నిల్వ వుండి దోమలు, ఇతర క్రిమికీటకాదులకు పట్టణం నిలయంగా మారుతోంది. స్వచ్ఛ భారత్ అంటూ పాలకులు హడావుడి చేస్తున్నా చెత్తాచెదారం రోడ్లపైనే వుంటోంది. మున్సిపల్ సిబ్బంది తరచూ డస్ట్‌బిన్‌లను శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది.

06/06/2017 - 00:16

అవినీతి ఏ రూపంలో జరిగినా సహించేది లేదని తెలుగు రాష్ట్రాల సిఎంలు కెసిఆర్, చంద్రబాబు స్పష్టం చేశారు. అవినీతి మచ్చుకు కూడా కనిపించకూడదని వారు ఆదేశించారు. అధికారులు అవినీతికి పాల్పడితే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఆస్తిపాస్తుల రిజిస్ట్రేషన్‌లు డబ్బులిస్తే చేస్తారని, లేకుంటే చేయరనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు జరగాలి.

06/05/2017 - 00:34

తాజాగా తెలిసొచ్చిన జీడిపి అంకెలు జనం ఉత్సాహంపై నీళ్లు జల్లాయి. దేశంలో స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా మందగించింది. నోట్ల రద్దు తరువాత దేశం తన వృద్ధిలో వేగాన్ని కోల్పోయింది. ఆ మాటే భయం గొలుపుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర దీన్ని అధిగమించడానికి స్థిరమైన ప్రణాళిక ఉందా? అసలు ఈ స్థితిని ముందస్తుగా ఊహించలేని, ఊహించినా ఒప్పుకోని, ఒప్పుకొన్నా తేలిగ్గా తీసుకొనే విధానానికే ఇంతవరకూ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

06/01/2017 - 03:44

అభివృద్ధి, పరిశ్రమలు, రోడ్ల విస్తరణ పేరిట ప్రభుత్వాలు అవసరాన్ని మించి భూములు సేకరిస్తున్నాయి. నిర్వాసితులకు పెద్దమొత్తంలో నష్టపరిహారం అందిస్తున్నామని ప్రభుత్వాలు భావించవచ్చు. కాని పరిహారం పరిహాసంగా మారుతున్నది. నష్టపరిహారం పొందిన వారెందరో తెలియనిచోట, తెలియని వ్యాపారాలు చేసి నష్టపోవటం, తెలిసిన వారి చేతిలో మోసపోవటమో చూస్తున్నాం.

05/31/2017 - 07:26

స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’, మీరాక కోసం మీ ఇంట్లోవారు వేచి చూస్తున్నారు, పరిమిత వేగం పరమ పవిత్రం’ ..ఇలాంటి ప్రకటన బోర్డులు రహదారుల వెంట పెడుతున్నా, వాహన చోదకులు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. తమతో ప్రయాణం చేసేవారికి కూడా ఆపదలను కలుగజేస్తున్నారు. ఖరీదైన కార్లు సుఖప్రయాణానికి అనువుగా ఉండడానికే కాని, అతివేగంగా నడపడానికి కాదు.

05/30/2017 - 04:23

బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ‘ఎగవేతదారులు’గా మారిన బడాబాబుల వివరాలను వెల్లడించరాదని రిజర్వు బ్యాంకు ఏమైనా ఆదేశాలిచ్చిందా? ప్రభుత్వ,ప్రైవేటు బ్యాంకులు ఈ విషయమై ఎందుకు వౌనం వహిస్తున్నాయి? రుణాలు వసూలు కాకపోతే బ్యాంకులు, ఎగవేతదారులు కుమ్మక్కయ్యారన్న అనుమానాలు కలగడం సహజం. అక్రమాలకు పాల్పడినవారు ప్రముఖ రాజకీయ నేతలైనప్పటికీ వారి బాగోతం ప్రజలకు తెలియాలి.

05/29/2017 - 06:25

‘రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం’ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో ‘విప్లవజ్యోతి’ అల్లూరి స్మృత్యర్థం 9 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు అయ్యాయి.

05/26/2017 - 07:56

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది, జరుగుతున్నదీ అన్యాయమే. గతంలో నేషనల్ ఫ్రంట్ , యునైటెడ్ ఫ్రంట్ , యూపిఎ నేడు ఎన్‌డిఏ అయినా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ప్రతి చిన్న విషయానికీ కేంద్రంతో పోరాటం చెయ్యాల్సి వస్తున్నది.

Pages