S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/04/2017 - 01:06

నల్లధనం ఏరివేస్తామంటూ సామాన్య, మధ్య తరగతి, పేద వర్గాలు బ్యాంకుల్లోనుండి డబ్బులు తీసుకోవడంపై పరిమితి విధించడం సరికాదు. ప్రజలనెందుకు ఇబ్బందులకు గురిచేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ప్రేముంటే ప్రభుత్వ అధికారుల అవినీతిపై వల పన్ని పట్టుకోవాలి. సిఐడి, సిబిఐ ద్వారా నల్లధనం ఎక్కడ వుందో తెలుసుకోవాలి. అంతే తప్ప ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదని మనవి.

07/03/2017 - 00:55

ఇల్లు అలకగానే పండగ కాదంటారు. అలాగే ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం యోగాపై ప్రత్యేక దృష్టిని పెట్టినందున రాష్ట్ర ప్రభుత్వాలుకూడా తదనుగుణంగా స్పందించాలి. అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో తగు పాఠ్య ప్రణాళికను రూపొందించి ఆ తరువాత యోగా శిక్షకులను నియమించడానికి చర్యలు తీసుకోవాలి.

07/01/2017 - 00:53

పూడ్చకుండా వదిలేసిన బోరు గుంతల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో నిత్యకృత్యంగా మారాయి. ఈ విషాద ఉదంతాలను నివారించేందుకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎక్కడైనా ఇటువంటి సంఘటన జరిగితే వెంటనే ఆ బోరుగుంతకు సమాంతరంగా గోతులు తవ్వడం, సహాయక చర్యలను టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం తంతుగా మారింది.

06/30/2017 - 00:28

‘ఎర్రరంగు వాళ్లు’ ఈ దేశానికి ఎంత గొప్ప భక్తులో ఈ సంఘటన చెబుతోంది. ముగ్గురు ఆకతాయి కుర్రాళ్లు రైల్లో ఒక ముస్లిం కుర్రాడిని చంపడానికి- దేశమంతానూ, కేంద్ర ప్రభుత్వమూను కారణమే అన్న విధంగా షబ్నా ఆజ్మీ, అపర్ణసేన్ మొదలైన ‘వీరు’లంతా అన్ని మెట్రో నగరాల్లోను ఉద్యమాలు చేస్తున్నారని వార్త. వాళ్ల గుండెల్లో వున్న దేశభక్తి గోదావరి వె ల్లువలాగా ప్రవహించడం సహజమే.

06/28/2017 - 02:07

సాధారణంగా చినుకు పడిందంటే ఊరు వాడా పులకించాలి. కాని మన్యం పరిస్థితి వేరు. చినుకుల ఋతువు వస్తుందంటేనే వెన్నులో వణుకు మొదలౌతుంది. ఇక్కడ రుతుపవనాలు మృత్యు పవనాలౌతున్నాయి. వరుణుడి కంటే ముందుగానే యముడు వస్తున్నట్లుంది. గత కొనే్నళ్లుగా ఏటా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మన్యం మరణశయ్యగా, అనారోగ్యానికి కేంద్రంగా మారడం రివాజు అయ్యింది.

06/27/2017 - 00:15

మన దేశంలో వ్యవసాయం తర్వాత చేనేతను జీవనోపాధిగా చేసుకున్నవారు అధికం. మరమగ్గాలపై తయరయ్యే వస్త్రాలు తక్కువ ధరకు లభించడం, కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా పూట గడవడం గగనమవుతుండడంతో నేటి యువత ఇతర మార్గాల వైపు చూడడం, వారంలో ఒక్కరోజైనా ఖద్దరు దుస్తులు ధరించాలన్న నిబంధనను పాలకులే ఆచరించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో బడ్జెట్‌లో చేనేత రంగానికి విదిల్చేది ఎంగిలి మెతుకులే!

06/26/2017 - 01:04

స్వచ్ఛ భారత్ పేర అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది విజయవంతం కావాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి. దీనితో సమానంగా పర్యావరణ పరిరక్షణ కూడా భాగమే. ముఖ్యంగ మన దేశాన్ని ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తోంది. దీన్ని నివారించాలంటే ప్రజలు సహకరించాలి. కాలుష్యం పెరగడానికి వర్షపాతం తగ్గడానికి ముఖ్య కారణం ఇదే.

06/24/2017 - 01:04

అధికార ఎన్డీఏ కూటమి రాష్టప్రతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్‌గా పనిచేస్తున్న బిజెపి సీనియర్ నేత కోవింద్‌ని ప్రతిపాదించిన లగాయతు ప్రతిపక్షాల ఐక్యత ప్రమాదంలో పడింది. చట్టసభల్లో ఆధిక్యత కారణంగా ఎటూ అధికారిక అభ్యర్థి నెగ్గడం ముందే ఖాయమైంది. అయితే ప్రతిపాదించబడ్డ అభ్యర్థి వివాదరహితుడు, సామాన్య దళిత నేపథ్యం కలిగి ఉండడమన్నది అధికారపక్షానికి అదనపు అర్హతగా తయారైంది.

06/23/2017 - 00:51

వంట గ్యాస్ (ఎల్‌పిజి)పై సబ్సిడీ వదులుకోవల్సిందిగా కేంద్ర ప్ర భుత్వం ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు కోటిమంది వినియోగదారులు సహకరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతభత్యాలు భారీగా పెంచడం సమంజసం కాదు. వీరికి అరవై శాతం వేతనాలు పెంచటం, ఇంటి అద్దె, రైలు చార్జీలు, పేపరు ఖర్చులు, కారు లోన్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు.

06/21/2017 - 01:47

అది యుద్ధమా? జబ్బా? వైరస్‌నా? కాలుష్యమా? జూదమా? కలహాల కుంపటా? టైం కిల్లరా? సస్పెన్స్ థ్రిల్లరా? దేశభక్తికి కొలమానమా? ఏమని పోల్చాలో ఈ క్రికెట్‌ని.. ఆట అంటే వినోదం అనే పరిధిని దాటి బహుముఖ వికృత ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఆటంటే అన్నీ కాదు ఒక్క క్రికెట్‌కే ఆ మహద్భాగ్యం దక్కింది. పాకిస్తాన్‌కి, భారత్‌కి మధ్య మ్యాచ్ పడితే అది యుద్ధం కంటే ఎక్కువ అన్నంతగా మన భావనని మార్చేసుకున్నాం.

Pages