S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/18/2017 - 00:03

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రాధమ్యాలు నిర్ణయించుకోవడంలో తడబడుతున్నట్టున్నారు. ‘అనవసరమైన చోట చొరబాటు, అవసరమైన చోట తడబాటు’ అన్నట్టుగా ఆయన ధోరణి కనిపిస్తోంది. ఇది ఆయనకు, కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రతిపక్షాల ఐక్యతకు కూడా అడ్డంకిగా మారుతోంది. గతంలో ఒకానొక సందర్భంలో పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీని నిలదీయాలని ప్రతిపక్షాలన్నీ కూడబలుక్కున్నాయి.

07/17/2017 - 01:03

అంపశయ్యపై ఉన్న చేనేతను జిఎస్టీ పరిధిలోకి చేర్చడం అత్యంత దురదృష్టకరం. చిలపనూలు, చేనేత వస్త్రాలపై 23 శాతం పన్ను విధించడంతో ఈ పరిశ్రమకు మరణ మృదంగం మోగించడమే అవుతుంది. ఇప్పటికే ఈ పరిశ్రమ వీడి వేలాదిమంది చేనేత కార్మికులు ఇల్లు వదిలి, పల్లె దాటి సుదూర ప్రాంతాలకు వలసపోతున్న సంగతి తెలిసిందే. మరి కొంతమంది ప్రత్యామ్నాయ వృత్తులోకి వెడుతున్నారు.

07/15/2017 - 00:40

ముక్కుపచ్చలారని వయసు నుండే చిన్నారుల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు తమ మూర్ఖత్వంతో చేజేతులా పాడుచేస్తున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు అలవాటు చేయడం, కూల్‌డ్రింక్స్‌కు బానిసలను చేయడం, పానీపూరీ, పిజ్జాలు, బర్గర్లు తదితర అనారోగ్యకర ఆహార పదార్థాలను తినిపించడం, ఫ్రిజ్‌లో వుంచిన నీటిని తాగించడం, కల్తీ నూనెలతో తయారైన ఫాస్ట్ఫుడ్స్‌కు బానిసలను చేయడం వంటివి పేరెంట్స్ చేస్తున్నారు.

07/14/2017 - 00:46

సరైన ధర లభించక రెండు నెలల క్రితం ‘రైతు గొంతులో పచ్చి టమాటా’గా మిగిలిన ఈ ప్రసిద్ధ కూరగాయ- నేడు ధర అమాంతం పెరిగి వినియోగదారులకు బరువుగా మారింది. పంట ఎక్కువై కిలో టమాటా ధర రూపాయి పలికి, గతిలేని పరిస్థితిలో రైతులు వాటిని బస్తాలకొద్దీ రోడ్డుమీదే పారవేసిన సంగతి ఇంకా మనం మరచిపోలేదు. ఈ పరిస్థితుల్లోనే దిగుబడి లేక టమాటా ధర కిలోకు వంద రూపాయలు పలకడం ఆశ్చర్యకరం.

07/12/2017 - 01:08

వర్షాలు కురవడం ఆనందదాయకమే. ప్రజలకు, రైతులకు ప్రయోజనకరమే. అయితే, వానాకాలం వర్షాలతో పాటు వ్యాధులనూ మోసుకువస్తుందనే విషయం మరువకూడదు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి. విషజ్వరాలు, వైరల్ జ్వరాలు, డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, కలరా వంటి వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. ఆరోగ్య శాఖ ఈ వ్యాధుల పట్ల ప్రజలను, ముఖ్యంగా గ్రామీణులను అప్రమత్తంగా ఉంచాలి.

07/11/2017 - 00:07

దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్
మనుషులంటే వనరులోయ్.. ‘పవరు’ నిండిన టవరులోయ్
మంది పెరిగితే మజ్జిగన్నది పలుచబడునని పాత మాటోయ్
మానవాళి ఏకమయ్యిన అద్భుతాలే చేయగలరోయ్
పుడమితల్లికి నిత్య పురుడై జనాభాయే పెరుగుచుండోయ్
ప్రకృతి కోపం, తీవ్రవాదం విధికి తోడై-
జనం కొందరు రాలుతుండోయ్
చైనా, భారత్ జనాభాలో ఒకటి రెండూ ర్యాంకులండోయ్

07/10/2017 - 00:46

టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగీ, ఆంత్రాక్స్ వంటి వ్యాధులు ఏటా వందలాదిమందిని బలి తీసుకుంటున్నాయి. ఇవి ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్నాయి. పౌష్టికాహారం, పరిశుభ్రమైన నీరు, పరిసరాలపై అవగాహన లేమితో ఈ వ్యాధులు ప్రజలను ఆవహిస్తున్నాయి.

07/08/2017 - 01:01

సమాజంలో అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న ఒక సామాజిక వర్గాన్ని అవహేళన చేసేలా ఇటీవల సినిమాలు నిర్మిస్తున్నారు. ఇతర సామాజిక వర్గాల గురించి, వారి ఆచార వ్యవహారాల జోలికి సినిమా వాళ్లు వెళ్లరు. కారణం వారు తిరగబడతారు అనే కదా! కేవలం వ్యాపార దృష్టితో చూస్తూ అవగాహన రాహిత్యం వలన ఇటువంటి పోకడలు ఏర్పడుతున్నాయి. కొన్ని సామాజిక వర్గాల్లో కట్టుబాట్లు, ఆచారాలు, మత విశ్వాసాలు ఏనాటి నుంచో ఉన్నాయి.

07/07/2017 - 00:38

ప్రధాని మోదీ మాటలు కోటలు దాటి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. పెద్దనోట్ల రద్దుతో పేదలకు మేలు జరుగుతుందని, నల్లకుబేరుల రోగం కుదురుతుందని, నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని మోదీ ఎన్నో మాటలు చెప్పారు. ఇలా పేదల జపం దేనికి? రాబోయే ఎన్నికల కోసం కాదా? ‘గరీబీ హఠావో’ అన్న ఇందిరాగాంధీ నినాదాన్ని గేలి చేసినవారు ఇపుడు అధికారంలోకి వచ్చాక పేదల కోసం చేస్తున్నదేమిటి?

07/05/2017 - 01:04

కృష్ణా జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు ‘ఒమర్’గా మతం మారి ఉగ్రవాదుల సానుభూతిపరుడిగా పోలీసులకు చిక్కడం విచారకరం. ఒక వర్గం వారు మతం మారడం, ఆధ్యాత్మిక పరిధిని దాటిపోవటం పాలక పక్షాల వైఫల్యంగానే చెప్పుకోవాలి. ఈ విషయంలో తప్పనిసరిగా చెప్పుకోవలసిన విషయం- ఓ దశాబ్దానికి ముందు ఇస్లామిక్ ఉగ్రవాదం పదం వినిబడినపుడు- ‘ఉగ్రవాదానికి మతం వుండద’ని నాటి కేంద్ర పాలక పక్షం యుపిఎ చైర్‌పర్సన్ సెలివిచ్చారు.

Pages