S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

04/17/2017 - 01:45

దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉచిత పథకాల హామీలను తెగ గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో అయతే ఉచిత విద్యుత్, ఋణ మాఫీ, సబ్సిడీ బియ్యం, ఉచిత కరెంట్, సబ్సిడీ క్యాంటిన్‌లు, పింఛన్‌లు అంటూ అడగకపోయినా ఉచితంగా అన్నీ ప్రజలకు వడ్డించడంలో ఈ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. వీటివల్ల కోట్లాది రూపాయలు ఖర్చయి, అంతిమంగా ఆ బరువు రాష్ట్ర ప్రజల నెత్తినే పన్నుల రూపంలో పడుతున్నా పట్టించుకునే వారే లేరు.

04/15/2017 - 02:25

‘పాలిచ్చే ఆవును వదులుకొని తనే్న గాడిదను తెచ్చుకున్నట్లుంది’ నేడు దేశంలో ప్రజల పరిస్థితి. గత సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో గెలిచిన భాజపా నేతలు మేనిఫెస్టోలో అందమైన హామీలు గుప్పించారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని, రూపాయి మారకం విలువ పెంచుతామని, ధరలను తగ్గిస్తామని అరచేతిలో స్వర్గం చూపారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల కాలం పూర్తయినా జనం ఆశలు ఏవీ కార్యరూపం దాల్చలేదు.

04/14/2017 - 01:23

ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం పూ ర్తికావస్తున్నందున రాష్టప్రతి స్థానానికి జరగబోయే ఎన్నిక అత్యంత కీలకం కానుంది. రాష్టప్రతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై అపుడే భాజపా నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. భాజపా సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, నజ్మా హెఫ్తుల్లా తదితరుల పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. రాష్టప్రతి పదవిపై తనకు ఆసక్తి లేదని తాజాగా అద్వానీ ప్రకటించారు.

04/13/2017 - 07:03

భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ని గూఢచారిగా చిత్రీకరిస్తూ పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించడం అత్యంత కిరాతక చర్య. అన్ని అంతర్జాతీయ న్యాయసూత్రాలనీ, మర్యాదల్నీ, నియమాల్నీ నిస్సిగ్గుగా ఉల్లంఘించిన ఉదంతం ఇది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఇనే్నళ్లలో ఏ ఒక్కరూ ఏ దేశంలోనూ గూఢచర్యం నేరంపై మరణశిక్షకి గురి కాలేదు.

04/12/2017 - 01:14

‘చదవేస్తే ఉన్న మతి పోయిన’ట్లు- ఖాతాదార్లకు మెరుగైన సేవలను అందించడానికి బదులు బ్యాంకులు బహిరంగ దోపిడీకి దిగడం దారుణం. పెద్దనోట్ల రద్దు తర్వాత నెలల తరబడి నగదు కోసం ఇబ్బంది పడిన ప్రజలను ఇప్పుడు సరికొత్త నిబంధనల పేరిట బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయి. నగదు రహిత వ్యవస్థ అంటూ ప్రభుత్వం పలు సంస్కరణలు చేస్తుండగా, ఏదో ఒక రూపంలో చార్జీల బాదుడుకు బ్యాంకులు యత్నించడం విడ్డూరం.

04/11/2017 - 00:46

ఆలయాల్లో పనిచేసే అర్చకులకు, ఉద్యోగులకు ‘010 పద్దు’ కింద సమానస్థాయి వేతనాలు ఇస్తామని ఈ ఏడాది జనవరిలో తెలంగాణ సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. నూతన బడ్జెట్‌లో ఆలయ సిబ్బందికి 50 కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చినప్పటికీ జివో ఇంకా విడుదల కాలేదు.

04/10/2017 - 00:53

సిరియాలో రసాయన విష వాయువులను ప్రయోగించిన దాడిలో వంద మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం, మరెంతో మంది తీవ్రంగా గాయపడడం అత్యంత హేయం. ఆ రకమైన ఆయుధాల్ని నిషేధించాక కూడా వాటి వాడకం జరుగుతున్నదంటే అది బీరాలు పలుకుతున్న అంతర్జాతీయ అగ్రరాజ్యాల ద్వంద్వ వైఖరి అ యినా కావాలి లేదా వైఫల్యమైనా కావాలి. అతి ప్రాచీన నాగరికతల్లో మెసపటోమియా తరువాత స్థానం సిరియాదే.

04/08/2017 - 07:11

అహంకారం, అజ్ఞానం కలసి అలంకారంగా తయారైనట్టుంది కొంతమంది ప్రజాప్రతినిధులకి. తప్పుచేసి దొరికిపోయిన శివసేన సభ్యుడికి మద్దతుగా ఆయన పార్టీ నేతలు పార్లమెంటులో సృష్టించిన హడావుడి జుగుప్సాకరం. పౌర విమానయాన మంత్రిని మూకుమ్మడిగా చుట్టుముట్టడం, హంగామా చెయ్యడం చూస్తే ఎవరైనా అది ప్రజలకు సంబంధించిన ముఖ్య విషయమో లేదా రాష్ట్ర, దేశ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ముఖ్యాంశమో? అని భ్రమపడతారు.

04/07/2017 - 07:26

నానాటికీ మారుతున్న వాతావరణం
ఎండవేళ సూర్యుని భగభగలతో రణం
వానాకాలం కానరాని చినుకు
సంవత్సరమంతా ఎండల వేడిమితో
మానవుని కంటికి లేదు కునుకు
అధికమవుతున్న కాలుష్యం
ఎల్‌నినో, వాన్‌నినోల ప్రతాపం
జీవరాశి మనుగడే ప్రశ్నార్థకం
పెరుగుతున్న మన జనాభా
అన్నింటా మితిమీరిన స్వార్థం
అంతరిస్తున్న వృక్షజాలం
వనాలను నరకడంలో మొనగాళ్ళం

04/06/2017 - 08:27

యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని ‘కరడుగట్టిన హిందూత్వ వాది’ అని దృశ్య మాథ్యమంలోనూ, కొన్ని పత్రికల్లోనూ పేర్కొంటున్నారు. యోగి తన మతాన్ని తాను గౌరవించటం లేదా ఆచరించటం నేరమా? నిర్దాక్షిణ్యంగా అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్న ఉగ్రవాదులకు వాడవలసిన ‘కరడుగట్టిన’ అన్న విశేషణాన్ని హిందూత్వానికి ఎందుకు ముడిపెడతారు?

Pages