S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

02/28/2017 - 00:52

అమెరికాలో ఒక జాత్యహంకార ఉన్మాది చేతిలో తెలుగు యువకుడు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం. మరో యువకుడు గాయపడడం విచారకరం. ఎలాంటి ఘర్షణ లేకుండానే ఆ ఉన్మాది కాల్పులకు తెగబడడం అమెరికా విడిచిపొమ్మంటూ కూతలు కూయడం కేవలం వివక్షాభావం వల్లనే. విదేశీయులపై వివక్షాపూరిత దాడులు అమెరికాలో ఒక్కసారిగా పెరగడానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధానాలే కారణం.

02/27/2017 - 00:08

రాజకీయ నేతల వ్యాఖ్యల్లో విజ్ఞత, వివేకం, విచక్షణ లేకుండా పోతున్నాయి. అందుకే ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. ఆమధ్య సిపిఐ నారాయణ తమిళనాట కేంద్ర ప్రభుత్వం రావణకాష్ఠం రగిలించిందని విమర్శించాడు. నిజానికి దశాబ్దాల క్రితం నెహ్రూ కాశ్మీర్‌లో రగిల్చిన రావణకాష్ఠం ఇంకా రగులుతూనే వుంది. తమిళనాట మండుతున్నది భోగి మంట.

02/25/2017 - 00:11

సుబ్రహ్మణ్య స్వామి అనగానే అవినీతి కార్యక్రమాలపై కోర్టుల ద్వారా పోరాడిన యోధుడు జ్ఞాపకం వస్తాడు. కొన్ని కేసుల్లో అతనికి చుక్కెదురైనా 2-జి స్కాంని వెలుగులోకి తేవడమే కాదు, జయలలిత, ఆమె నెచ్చెలి శశికళలపై అక్రమాస్తుల కేసు ప్రయోగించిన ఘనుడు.

02/24/2017 - 00:51

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను చూస్తే ‘్భక్త రామదాసు’గా పేరుగాంచిన కంచర్ల గోపన్న గుర్తుకొస్తాడు. ఈయనలాగే ఆయన కూడా వీర భక్తుడు. గోపన్న ఎలాగైతే ప్రజల నుండి శిస్తులు వసూలు చేసి రామాలయం కట్టాడో, కెసిఆర్ కూడా అచ్చం అలాగే ప్రజల నుండి పన్నులు వసూలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నాడు. ఆయన కోదండరాముడికి గుడికట్టి జైలుకెళితే, ఈయన తన ఉద్యమ సహచరుడు కోదండరామ్‌ని అరెస్టు చేయించి గుడికెళ్లాడు.

02/23/2017 - 05:34

కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరగడంతో నేడు ప్రభుత్వరంగంలో విద్య, వైద్య సేవలు లభించక సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. పేదవర్గాల వారు ఖరీదైన ఆస్పత్రులకు, కార్పొరేట్ పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బడుగువర్గాల సంక్షేమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకువచ్చి తగినన్ని నిధులను కేటాయించాలి. వైద్యచికిత్స చేయించుకునే స్థోమత లేనివారు తమిళనాడు వెళుతున్నారు.

02/22/2017 - 00:45

దేశంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు, ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ టెక్నాలజీ చక్కని పరిష్కారం చూపిస్తోంది. ఆరునెలల కాలంలోనే పదివేల స్టార్టప్ కంపెనీలు దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయంటే ఆ ప్రక్రియ పట్ల భారతీయులు ఎంత ఆకర్షితులయ్యారో అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో స్టార్టప్ సంస్థలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది.

02/21/2017 - 00:58

ప్రవేశపరీక్షల్లో ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు మరో రకం పరిణామాలకు దారితీయవచ్చు. ఆమధ్య బిహార్‌లో మేడమీద పరీక్ష రాస్తున్న విద్యార్థులకు కొందరు పైప్‌లైన్లపై ఎగబాకి స్లిప్పులు అందించడం కలకలం రేపింది. స్పిప్పులు అందించడం, మాస్ కాపీయింగ్ వంటి అక్రమాలు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

02/20/2017 - 07:22

ఫేస్‌బుక్ పరిచయాలు, ఆన్‌లైన్ చాటింగ్‌తో మోసపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయినా, యువత గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఇటీవల ఒక అమ్మాయి ఫేస్‌బుక్ ద్వారా ఒక యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకొని, అతని చేతిలో మృత్యువాత పడితే, అతను ఇంట్లోనే ఆమెను సమాధి చేశాడని వార్తలొచ్చాయి. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మోసం బయటపడింది. పెళ్లిపేరుతో లక్షలకు లక్షలు దోచుకున్న ఉదంతాలు కోకొల్లలు.

02/17/2017 - 23:57

ఎట్టకేలకు అవినీతికి శిక్ష పడింది. న్యాయం రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్కా అన్న భరోసాను ప్రజల్లో నింపింది. సరైన సందర్భంలో రావడంతో జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పు చారిత్రకమై నిలుస్తుంది.

02/17/2017 - 01:23

పోటీలో రష్యాని మించిన ‘ఇస్రో’కి మనసార అభివందనం
సాటిలేని ప్రతిభ చక్కగా చూపిన ‘ఇస్రో’కి అభివందనం
శాటిలైటులు పంపి మార్గదర్శకత చూపు ‘ఇస్రో’కి అభివందనం
మేటి అయిన పనులు చాకచక్యముగ చేయు ‘ఇస్రో’కి అభివందనం
ఏటికోరీతిన నూత్న మార్గంబు చూపెడి ‘ఇస్రో’కి అభివందనం
నేటి విద్యార్థులకు శాస్త్ర ప్రేరణనిచ్చు ‘ఇస్రో’కి అభివందనం

Pages