S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/03/2019 - 23:04

నేటి ఆధునిక యుగంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన క్రమంలో సమాచార వినిమయానికి ‘సామాజిక మాధ్యమాలు’ ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యంగా యువత కాలాన్ని వృథా చేసుకొని, సామాజిక మాధ్యమాలకు బానిస కావడం కలవరపెట్టే అంశం. సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లలపై, యువతపై రోజురోజుకు మితిమీరుతున్నందున , వారి వ్యక్తిత్వ నిర్మాణం అయోమయంగా మారుతోంది.

05/03/2019 - 01:31

లోక్‌సభ ఎన్నికల్లో 3 దశల పోలింగ్ ముగిసింది. నాయకుల వాదప్రతివాదాలు కొనసాగుతున్నాయి. రాఫెల్ వివాదంపై రాహుల్ గాంధీ మాట మీరి సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పాడు. ఆయన చేసిన ఆలయ ప్రదక్షిణలు, హోమాలు, పట్టుబట్టలతో పటాటోపాలు, కైలాస మానస సరోవరం వెళ్ళివచ్చిన దర్పం తాలూకు డాంబికాలు ఏమైనాయో తెలీదు. కేరళలో ముస్లింలు 35% వున్న వైనాడ్‌కు చేరుకున్నాడు.

05/02/2019 - 01:58

బిహార్ (ఒకప్పుడు కపిలవస్తు రాజ్యం)లోని (బోధ్) గయలో గల ‘బోధి వృక్షం’ సందర్శించేందుకు బౌద్ధమతస్తులు తరలివస్తుంటారు. ముస్లింలకు ‘మక్కా’, క్రైస్తవులకు జెరూసలెం ఎలాగో బౌద్ధం ఆచరించేవారు ‘బోథ్‌గయ’ను అంత పవిత్రంగా భావిస్తారు. రెండున్నర వేల ఏళ్ల క్రితం సిద్ధార్థుడు ఈ వృక్షం కిందనే కూర్చుని ‘్ధ్యనం’ చేయగా ‘జ్ఞానోదయ’మైంది కాబట్టి ఆ ప్రాంతాన్ని, ఆ చెట్టును పవిత్రంగా భావిస్తారు.

04/30/2019 - 01:20

దేనిపైనా వ్యామోహం కూడదని, చివరికి తల జుట్టుపై కూడా వ్యా మోహం వద్దని బౌద్ధ సన్యాసుల తల జుట్టు తీసేస్తారు. కాషాయ వస్త్రాల్లోని గౌతమ బుద్ధుడు మాత్రం ఉంగరాల జుట్టుతో రాజసంతో కనిపిస్తాడు. మరి బౌద్ధ సన్యాసులకు జుట్టు ఉండరాదు ఎందుకు? ఈ వాదన- ‘కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా ఉంద’ని కొందరికి అనిపించినా, ఏదైనా విషయంలోని డొల్లతనం ఇలాంటి సూక్ష్మ విషయాల్లోనే తేటతెల్లమవుతుందని గ్రహిస్తే..

04/28/2019 - 02:02

‘‘రాజ్యం వీరభోజ్యము.. పరాక్రమశాలియె భారతీయ సామ్రాజ్యమునేలజాలు’’- అని ‘మహాభారతం’లో ఓ పద్యం ఉంది. వీరుడంటే ఎవరు? ఎంత ఎక్కువమందిని చంపితే అంత గొప్ప వీరుడు. అంటే రథ గజ తురగ పదాతి దళాలను సమకూర్చుకొని ఇతరులను చంపి భూమిని ఆక్రమించుకున్నవాడే రాజు. ప్రాచీన కాలంలో యుద్ధాలన్నీ ఇలాగే జరిగాయి. విదేశాల్లోనూ ఆయుధమున్నవాడిదే రాజ్యం. రక్తపాతం అపరిమితంగా చేసినవాడే రాజు.

04/26/2019 - 22:23

అందమైన బలియాన్ లోయ.. గాంధార దేశం (అఫ్ఘనిస్తాన్)లో ఎన్నో అపురూప అంశాలకు అది నిలయం.. ‘సిల్క్ రూట్’లోని ఆ లోయ ఎన్నో సంస్కృతులను, సంప్రదాయాల్ని, ఉత్థాన పతనాలను చవిచూసింది. దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం ఈ బలియాన్ వ్యాలీలో కొండలను తొలిచి గాంధార శిల్పశైలిలో భారీ బుద్ధ విగ్రహాలను రూపొందించారు. ఒక్కొక్కటి 500 అడుగుల ఎత్తు గలవి. ఆ కొండలను తొలచి ఎలా చెక్కారబ్బా? అని అవి విస్తుగొల్పుతాయి.

04/24/2019 - 01:57

భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను మిగిల్చే ‘సుస్థిర అభివృద్ధి’ భావనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని నార్వే ప్రధాని బ్రాంట్ లాండ్ అధ్యక్షతన 1987లో జరిగిన ‘ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సదస్సు’లో తీర్మానించారు. అయితే, నేడు మానవ కార్యకలాపాలు సహజ వనరుల వినాశనానికి దారితీస్తూ, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. భూమి అనేది సహజ వనరుల గని. విశ్వంలో అనేక జీవజాతుల మనుగడకు అనుకూలత కలిగిన ఒకే ఒక గ్రహం భూమి.

04/23/2019 - 02:12

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌తోనే మమేకం కావడంతో పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గిపోతోంది. సాంకేతిక రంగంలోనూ, పారిశ్రామీకరణలోనూ వడివడిగా అడుగులు వేస్తున్నప్పటికీ- ప్రపంచ స్థాయిలో మన దేశం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉరుకులు పరుగుల ఆధునిక జీవనం, పాశ్చాత్య సంస్కృతి వల్ల మన దేశంలోనూ పలుమార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక పోకడలతో యువత వెర్రితలలు వేస్తోందేమో అనిపిస్తుంది.

04/21/2019 - 02:21

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాగని ప్రజలు విచ్చలవిడితనంతో వ్యవహరించేందుకు వీల్లేదు. ముందుగా ఏర్పరచుకున్న నియమాలు- నిబంధనలు, మర్యాదలు- మన్ననలను ఆదరించాలి. అప్పుడే దానికి అర్థం.. ప్రజాస్వామ్యానికి పరమార్థం. దీనే్న బాధ్యత అంటారు. నేనొక్కడినే ఓటేయకపోతే ఏమవుతుందన్నట్టుగానే నేనొక్కడినే బాధ్యతను నిర్వర్తించకపోతే ఏమవుతుంది? నేనొక్కడినే క్రమశిక్షణను పాటించకపోతే, నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుంది?

04/19/2019 - 21:51

దేశంలో విద్యార్థి ఉద్యమాలు మరి ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళనలు బలహీన పడటం అటు రాజకీయంగా, ఇటు సామాజిక పరంగా వాంఛనీయం కాదు. చదువుతో పాటు దేశభక్తి, సమాజాభివృద్ధి, సేవాతత్పరతను విద్యార్థులు పెంపొందించుకోవాలి. ప్రభుత్వాల తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన విద్యార్థి ఉద్యమాల అవసరం ఉంది.

Pages