S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/13/2017 - 01:53

‘సైబర్ స్పేస్’ అంటే కంప్యూటర్ నెట్‌వర్క్ ద్వారా ‘ఆన్‌లైన్’ సమాచార వ్యవస్థను నిర్వహించే ఎలక్ట్రానిక్ మాధ్యమం. ఈ రంగంలో ఇంటర్‌నెట్ సమాచార వ్యవస్థకు అవసరమైన బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు, మోడెమ్‌లు, వైర్‌లెస్ డేటా కార్డులు, మొబైల్ ఫోన్‌ల వంటి ప్రధాన ఉత్పత్తులను అందిస్తోంది ‘హువేయ్’. ఇది చైనాకు చెందిన అతి పెద్ద టెలికాం సంస్థ.

05/12/2017 - 01:32

మన దేశంలోని అత్యధిక బ్యాంకులు ‘నెట్ బ్యాం కింగ్’కు అవసరమైన ‘వన్ టైం పాస్‌వర్డ్’ను ఖాతాదార్లు సెల్‌ఫోన్‌కే పంపుతున్నాయి. ఈ కారణంగా నెట్ బ్యాంకింగ్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలంటే నెట్ బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేయాల్సి ఉంది. చాలామంది బ్యాంకు ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్‌లో వెనుకపడడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

05/11/2017 - 02:39

మావోయిస్టుల దూకుడుకు అదే తీరుగా ‘సమాధానం’ ఇవ్వాలని దిల్లీలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ఉన్నతాధికారుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునివ్వడం ఇపుడు చర్చనీయాంశమైంది. ఇలాంటి సమావేశాలు, సదస్సులు గతంలో ఎన్నో జరిగినప్పటికీ, ఈసారి మాత్రం మావోల కట్టడికి కఠిన చర్యలు తీసుకునే సమగ్ర ప్రణాళికను రూపొందించారు. అదే- ‘సమాధాన్’.

05/10/2017 - 01:55

ఎవ్వరైనా దేనినైనా ఎందుకు వదిలేసుకొంటారు? తమకు ఉపయోగపడకపోతేనో, పాడై పనికిరాకుండాపోతేనో..! అంతేగా..? మరి ప్రాచీనభాష హోదా కలిగి, ఇప్పటివరకూ విద్యాలయాల్లో బోధనా మాధ్యమంగా ఉపయోగపడి, ఎందరినో సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన తెలుగును బోధనా భాషనుండి తొలగించి, ఆ స్థానంలో ఆంగ్లాన్ని ఎందుకని ప్రవేశపెట్టబోతున్నట్లు? ఈ ప్రయత్నం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి జరిగింది.

05/09/2017 - 09:02

వీధుల్లో జీవించే పిల్లల్ని మనం ‘వీధి బాలలు’ అంటున్నాం. అనాథలైన వీరంతా నివసించే గృహాన్ని అనాథాశ్రమాలు అంటున్నాం. అనాథలు అనగానే వారిని చూసే దృష్టికోణం మారిపోతోంది, ఎవరి ప్రేమను పొందలేని నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. వీరిని మనం విధి ఎదురించే వీరులుగా, వీరి నివాసా న్ని ‘బాల కుటీరం’గా వ్యవహరిస్తే వారిని చూసేటపుడు అందరి ఆలోచనల్లో మార్పు వస్తుందేమో..! అసహాయులు ఎప్పటికీ అలా ఉండిపోవల్సిందేనా?

05/07/2017 - 08:31

‘మీ చేతికున్న గాజులు తీసేసి, మీరు చేయగలరో లేదో చెప్పండి.. ఇదేం ప్రభుత్వం? ఈయనేం ప్రధాని?’ - సరిహద్దు ప్రాంతంలో పాక్ కీచకులు భారత జవాన్ల కుత్తుకలు కత్తిరించి, వారి దేహాలను ఛిద్రం చేసిన అమానవీయ ఘటన క్రమంలో, జాతి కోపాగ్నితో రగులుతున్న వేళ కాంగ్రెస్ మహనీయుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్య ఇది. పైగా ఉగ్రవాదులను అణచివేయడంలో సరైన విధానమంటూ లేకపోవడాన్ని ఆ పార్టీ గళధారులు ఆక్షేపించారు.

05/06/2017 - 08:21

ఇటీవలి రాజకీయ పరిణామాలు మన పార్లమెంటరీ వ్యవస్థలోని డొల్లతనాన్ని ప్రస్ఫుటంగా తెలుపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు, చట్టసభల్లో కీచులాటలు ప్రజలకు వెగటు కలిగిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన దేశానికి సరిపోదన్న అనుమానాలు కలుగుతున్నాయి. పాతతరం నాయకులకు ప్రజాశ్రేయస్సే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఉండేవి కావు.

05/06/2017 - 08:19

ఆయుష్షు నూరేళ్లు.. వ్యాజ్యం వెయ్యేళ్లు’ అనే సామెత నేటి మన న్యాయవ్యవస్థకు వర్తిస్తుంది. ‘అప్పీల్’ అనే తురుఫుముక్కను ఆధారంగా చేసుకుని కేసులను ఎంత కాలమైనా సాగదీయవచ్చు. లెక్కలేనన్ని వాయిదాలు లేకుండా ఏ తీర్పూ లభించదు. కొన్ని న్యాయస్థానాలు తీర్పు చెప్పి, అవసరమైతే అప్పీలు చేసుకోవచ్చునని సూచిస్తున్నాయి. అంటే- తమ తీర్పుపై తమకే నమ్మకం లేనట్లా? ఒక కోర్టు శిక్ష విధించాక తీర్పును వెంటనే ఎందుకు అమలు చేయరు?

05/05/2017 - 08:21

చత్తీస్‌గఢ్‌లోని సుకుమా అటవీ ప్రాంతంలో గత నెల 24వ తేదీన మావోయిస్టు గెరిల్లా ఆర్మీ సభ్యులు మెరుపుదాడి చేసి, కేంద్ర రిజర్వు పోలీసు దళానికి (సిఆర్‌పిఎఫ్) చెందిన 25 మందికి పైగా జవాన్లను అత్యంత కిరాతకంగా హతమార్చడం దారుణం. గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టులు జరుపుతున్న ఊచకోతలో ఎంతోమంది జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు.

05/04/2017 - 07:08

బస్తర్‌లో గాని, ఒడిశాలో గాని ‘వేదాంత’ కంపెనీ పేరు వినిపించినా, బోర్డు కనిపించినా మావోయిస్టులు అగ్గిమీద గుగ్గిలమవుతారు. కొండకోనల్లో ఖనిజాల్ని కొల్లగొట్టడానికి పొంచివున్న రాకాసి కంపెనీగా ‘వేదాంత’ను మావోలు భావిస్తారు. అక్కడి ఆదివాసీల్లో ఆ కంపెనీ పట్ల వారు విద్వేషం నింపుతారు. కంపెనీ యజమానులు నరరూప రాక్షసులన్న భావనను బలంగా నూరిపోస్తారు.

Pages