S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/18/2017 - 08:44

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి, ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్ర మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని యావత్ జాతి ఆశించింది. సామాజిక అసమానతలు, శాంతి భద్రతలు, పేదరిక నిర్మూలన, ఉపాధి వంటి రంగాల్లో పెను మార్పులు చోటుచేసుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు.

04/17/2017 - 01:45

దక్షిణ అమెరికాలో బ్రెజిల్‌కి వాయువ్యంగా 5.5 మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అతిపెద్ద వర్షారణ్యం- ‘అమెజాన్’. వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, బొలీవియా, గయానా, సురినామ్ దేశాల్లోకి ఇది విస్తరించింది. ఈ అడవి మొత్తంలో ఎన్నో నదులు విస్తరించి ఉన్నాయి. మత్స్య సంపదకు, ఇతర జలచరాలకు ఈ నదులు నెలవు. ఈ నదులే స్థానికులకు రవాణా మార్గాలు.

04/16/2017 - 08:53

రైతులకు 2008 సంవత్సరంలో 70,000 కోట్ల రూపాయల మేరకు రుణాలను ప్రభుత్వాలు రద్దు చేశాయి. అయినప్పటికీ, కొత్త రుణాలను తీర్చలేక రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ‘రైతులకు రుణమాఫీ’ అంటూ అన్ని పార్టీల నేతలూ వాగ్దానం ఇస్తున్నారు. కొత్త రుణాలకు, రుణమాఫీలకు, రైతుల ఆత్మహత్యలకు అంతం కనిపించడం లేదు. ఎందుకిలా జరుగుతోందని నిపుణులు నిశితంగా ఆలోచించాలి.

04/16/2017 - 08:50

అయోధ్యలోని ‘రామజన్మభూమి’ వివాదంపై న్యా య నిర్ణయం చేసేందుకు తమకు సమయం లేదని దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా ప్రకటించడం మరో చర్చనీయాంశమైంది. అత్యున్నత న్యాయస్థానం- ‘తాను చెప్పిన మాటల్ని తానే వెనక్కి తీసుకున్న ట్టు’ (యూటర్న్)గా దీన్ని భావించాలి.

04/15/2017 - 02:24

ప్రకృతి వనరులు వసుధైక కుటుంబంలో ప్రతి జీవికి అన్వయించగల మహాద్భుత శక్తి. సహజ సంపదను ఏ కొందరో ఒడిసి పట్టుకుని తమ గుప్పెట్లో వుంచుకోగలమనేది వట్టి భ్రమ. శాస్త్ర, సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా ప్రకృతిని శాసించి తమ వశం చేసుకోబోవడం ఏ దేశానికైనా దుస్సాధ్యమే అవుతుంది. కృత్రిమ వర్షాలను కురిపించడానికి, నదుల ప్రవాహ గతిని మార్చడానికి చైనా చేపట్టిన పథకాలు భారత్‌కు ఆందోళన కలిగించేవే.

04/13/2017 - 07:01

‘పెద్దాయన మాటంటే.. బ్యాంకులో మూటే’ అనే నానుడి జన వ్యవహారంలో ఉండేది. అంటే బ్యాంకులో డబ్బు దాచుకుంటే ఎంత భద్రంగా, వినియోగానికి వీలుగా వుంటుందో- పెద్దాయన ఇచ్చిన వాగ్దానం కూడా అంత విలువైనది అని అర్థం. ఇది పాతకాలం నాటి మాట. ఇప్పుడు ప్రజల్లో అలాంటి నమ్మకం సడలిపోతున్నది.

04/13/2017 - 06:58

ఉత్పత్తి రంగంలో వచ్చిన మార్పులు, ఆవిష్కరణలు సమాజంలోని ఇతర రంగాలనూ ప్రభావితం చేస్తాయి. పారిశ్రామిక విప్లవాలు ఈనాటి విద్యారంగానికి పునాది. పరిశ్రమల్లో ఒక మూసలో పోసిన యంత్రాలు తయారవుతాయి. వాటి నిర్మాణాలతో కొద్దిగా మార్పు వచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. కొత్త నమూనాలో వస్తువులు తయారుచేస్తారు. విద్యా రంగంలోనూ విద్యార్థిని ఒక మూసలో పోసిన యంత్రంగా తయారుచేస్తారు.

04/11/2017 - 00:42

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు వివిధ రూపాల్లో శాంతియుత ఉద్యమాలు నిర్వహించినా ఫలితం దక్కకపోవడంతో చివరికి పోరాటాన్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే మానవ ప్రయత్నాలకు తోడు భగవంతుడి కృపను పొందేందుకు ఉద్యమకారులు దేవుళ్లకు మొక్కుకున్నారు. ఉద్యమంలో కీలకనేతగా ఎదిగిన తెరాస వ్యవస్థాపకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా దైవాన్ని నమ్మి వివిధ దేవుళ్లకు మొక్కుకున్నారు.

04/10/2017 - 00:52

గత 50 సంవత్సరాలలో మన వ్యవసాయ రంగం మంచి ప్రగతినే సాధించింది. ‘హరిత విప్లవం’ వల్ల తీవ్ర కరవు తొలగిపోయింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1952-53లో 5.92 కోట్ల టన్నులు. 2014-15లో ఇది 25.27 కోట్ల టన్నులు. ఈ కాలంలో ఉత్పాదకత హెక్టారుకు 580 కేజీల నుండి 2070 కేజీలకు పెరిగింది. ఆహార సబ్సిడీ 2005-06లో రు.23,071 కోట్లు వుంటే 2015-16 నాటికి రూ. 1,05,509.41 కోట్లకు పెరిగింది.

04/09/2017 - 01:24

అంతా ఆ తాను ముక్కలే.. వైసీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల చేత ఏపిలో గవర్నరు మహాశయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు వర్తమాన రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారికి కలిగిన భావన ఇది!

Pages