S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/02/2017 - 00:35

విజయగాథల మీద ఆధారపడి నిర్మితమైన సంస్కృతి అసాధారణ ఫలితాలనిస్తుంది, అది మహోన్నత చరిత్రను సృష్టిస్తుంది. అయితే, రేపటి పౌరులైన నేటి విద్యార్థులకు ఎలాంటి చరిత్రను చెబుతున్నాం. మనదైన చరిత్రపై వారికి అవగాహన లేనందున ఎన్ని విపరిణామాలు చోటు చే సుకుంటున్నాయో విశే్లషించాల్సిన అవసరం ఉంది. వ్యా పారం పేరుతో వచ్చి మోసంతో మన దేశాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు మనదైన ప్రతి వ్యవస్థనీ చిన్నాభిన్నం చేశారు.

06/02/2017 - 00:26

కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో పధ్నాలుగేళ్ళ సుదీర్ఘ శాంతియుత ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్రంలో అనేక రంగాల్లో అనిశ్చిత పరిస్థితులు, అధికారులు అందుబాటులో లేకపోవడం, పొ రుగు రాష్ట్రం నుంచి సహకారం లేకపోవడం వంటి సమస్యలుండేవి.

06/01/2017 - 03:42

‘మాతృ దినోత్సవం’, ‘మాతృభాషా దినోత్సవం’ అంటూ ఏటా హడావుడి చేస్తుంటాం. తల్లిదండ్రులు నిరాదరణకు గురవడంతో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతోంది. ఇదే రీతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న మాతృభాష నానాటికీ దీనావస్థకు చేరుకుంటోంది. ఆంగ్లం కింద పడి మాతృభాషలు నలిగిపోతూనే ఉన్నాయి. అమ్మ చేయి తనమీద పడగానే రోజుల శిశువు సైతం మాతృస్పర్శని గుర్తించి ఏడుపు ఆపేస్తుంది.

06/01/2017 - 03:40

ఉపాధ్యాయుని కార్యరంగం తరగతి గది. పిల్లలతో తరగతి గ దిలో ఆప్తవాక్యాలు, ప్రోత్సాహక మాటలు, ఆత్మీయతతో మెలగాలి. ఉపాధ్యాయుడు ఎంతో ఓపిక, సంయమనంతో బోధనను ప్రారంభించవలసి ఉంది. విద్యార్థులు ఉపాధ్యాయుని నోటి నుంచి ఏ మాట వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటారు. పాఠం మొదలుపెట్టేటప్పుడే ఆ పిల్లల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాను సాధించిన జ్ఞానాన్ని సులభ శైలిలో ఉపాధ్యాయుడు వ్యక్తం చేస్తాడు. ఈ పని అంత సులభం కాదు.

05/31/2017 - 06:41

ఎప్పుడో పాతికేళ్ల క్రితం అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి ఇప్పుడు భాజపా అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 12 మందిపై సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించడం ఓ కుట్రగానే కనిపిస్తోంది. నిజానికి అయోధ్యలో ‘బాబ్రీ’ కట్టడాన్ని కూల్చివేయడానికి ఎలాంటి కుట్ర అవసరం లేదు.

05/30/2017 - 04:27

విద్యారంగానికి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వినూత్న ప్రయోగం జరిగినా దానిని అమలు చేసి, ఫలితాలను సాధించి, మంచి చెడులను విశే్లషించడంలో కేరళ రాష్ట్రానిది అందెవేసిన చేయి. గరిష్ట అక్షరాస్యతలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న కేరళ మరో కొత్త రికార్డుకు సిద్ధం అవుతోంది.

05/29/2017 - 06:13

బ్రిటన్‌లోని మాంచెస్టర్ నగరంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 22 మంది అమాయక పౌరులు మృతి చెందడం, పలువురు గాయపడడం అత్యంత విషాదకరం. ఈ కిరాతకం బ్రిటన్ ఇప్పటివరకూ ఎదుర్కొన్న ఉగ్రదాడులకు పూర్తిగా భిన్నమైనది. ఇంతటి దుష్కృత్యానికి పాల్పడింది తామేనని మతోన్మాద ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’ ప్రకటించింది. బ్రిటన్‌పై ఐఎస్ జరిపిన ఈ తొలి ఆత్మాహుతి దాడి ఆ దేశ ప్రజల మానసిక స్థితిపై గట్టి ప్రభావాన్ని చూపక తప్పదు.

05/28/2017 - 07:17

తెలుగుదేశం పార్టీ మూడుతరాల మహానాడు సమ్మేళనం ముందు- ఈసారి చాలా ప్రశ్నలు జవాబు కో సం ఎదురుచూస్తున్నాయి. అధినేత, కార్యకర్త.. ఇద్దరూ మార్పు కోరుకుంటున్న వైచిత్రి! కార్యకర్తలు, నాయకులు మారాలని చంద్రబాబు కోరిక. అధినేతే తమ ఆకాంక్షలకు తగ్గట్టు మారాలని నాయకశ్రేణుల వాదన. అయితే- ఎవరూ మారరని తెలుసు. ప్రతిసారీ ఇద్దరూ మార్పు ఆశిస్తుండటమే విచిత్రం!

05/27/2017 - 05:30

నాలుగు ఓట్లు, రెండు సీట్ల కోసం ఏదో ఒక సమస్యని రాజేసే రాజకీయ నాయకుల వలే జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ ‘ఉత్తరాది, దక్షిణాది’ అంటూ మంటలు రాజేస్తున్నాడు. దక్షిణాది సాంస్కృతిక సంఘం ఏర్పాటు చేస్తాడట. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల సంస్కృతి ఒక్కటేనా? రెండు తెలుగు రాష్ట్రాలకు తప్ప మిగిలిన మూడు రాష్ట్రాలలో ప్రజలకు మాతృభాష, సంస్కృతి పట్ల అభిమానం ఉన్నాయి.

05/27/2017 - 05:28

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దే శంగా తామే మొదటి స్థా నంలో ఉన్నట్లు చైనా చెబుతున్న లెక్కలు వాస్తవం కాదన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమ దేశ జనాభా 137 కోట్లు అని చైనా చెబుతోంది. కానీ, ఆ దేశానికి చెందిన ప్రముఖ శాస్తవ్రేత్త రుూ ఫుక్సియాంగ్ తమ దేశ జనాభా 129 కోట్లుగా ఉండొచ్చని అంటున్నారు. ఇదే నిజమైతే అత్యధిక జనాభాగల దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచినట్లే.

Pages