S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/22/2017 - 07:36

భారత రాష్టప్రతిగా తమ పార్టీకి చెందిన నేత ఎన్నికయ్యేలా చేయడంలో బిజెపి అధినాయకత్వం సఫలీకృతం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి తన అభ్యర్థిని రాష్టప్రతిగా గెలిపించుకొనే బలం బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమికి లేదు. అయితే, ప్రతిపక్షాల అనైక్యతే బిజెపికి వరంలా మారే అవకాశం ఉంది.

05/21/2017 - 08:58

తెలుగు రాష్ట్రంలో ‘మీడియా స్వా మ్యం’ చూస్తే భలే ముచ్చటేస్తుంది. ‘వికీలీక్సు’కు పెద్దన్నలే ఇక్కడున్నారు. పెన్నుపెట్టి రాయడం రాకపోయినా, ఇక్కడ ప్రతి ఒక్కరూ గిరీశాలే. సమాజంలో మార్పు కోసమే తమ చానెళ్లు పుట్టాయంటూ చెప్పిందే చెప్పే ‘నిరంతర వార్తా స్రవంతు’లు, తమంత ‘దమ్మున్న మొనగాళ్లు’ తెలుగునేలపై ఇంకొకరు లేరని చెప్పే మీడియా మారాజులు రాష్ట్ర పాలకులు, పాలితులను ఉద్ధరించే పనిలో ఉన్నారు.

05/20/2017 - 01:00

ధృవప్రాంతాల వద్ద మంచు ఫలకాలు, మంచు చరియలు కరిగిపోతున్నందున ఇప్పటికిప్పు డు ఉపద్రవమేమీ లేదని చాలామంది భావిస్తు వుండవచ్చు. ధృవప్రాంతాల వద్ద, ఇతర శీతల ప్రాంతాల వద్ద భారీ స్థాయిలో ఉన్న మంచు భూ వాతావరణాన్ని నియంత్రించడంలోను, సమస్త జీవజాలానికి అవసరమైన నీటిని సమకూర్చడంలోను ప్రధాన పాత్ర వహిస్తోంది. ఏళ్ల తరబడి సముద్రం గడ్డకట్టి ఉండే ప్రాంతాన్ని క్రయోస్పియర్ అంటారు. అలాంటి ప్రాం తాలు నివాసయోగ్యం కావు.

05/19/2017 - 07:45

జలవనరులు కలుషితం కారాదని, పర్యావరణ శోభతో పుడమి పరిఢవిల్లాలని ఆయన పరితపించారు.. అదే లక్ష్యంతో తుదిశ్వాస విడిచేవరకూ నిబద్ధతతో కృషి చేసి జన హృదయాల్లో ‘పర్యావరణ ప్రేమికుడి’గా చెరగని ముద్ర వేసుకున్నారు. మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ హఠాన్మరణం చెందిన అనిల్ మాధవ్ దవే (60) రాజకీయాల్లోకి రాకముందు నుంచీ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తూ ప్రజలతో మమేకం అయ్యారు.

05/17/2017 - 23:43

ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో మాత్రమే నాయకులను, కార్యకర్తలను చైతన్యపరచడం మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అలవాటు. అయితే, రాజకీయ పార్టీ అంటే నిరంతరం ప్రజలతో మమేకం అవ్వాలని, తద్వారా వారి అభిమానాన్ని చూరగొనవచ్చనే సూత్రాన్ని ఆచరణలో పెడుతోంది భారతీయ జనతా పార్టీ.

05/17/2017 - 23:41

నైజాం కాలంలో తెలంగాణ జిల్లాల్లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండటానికి కారణాలు ఏమిటి? దాని వెనక వున్న రహస్యమేమిటి? ఆనాడు విద్యాశాఖను నిర్వహించిన మంత్రుల దూరదృష్టి గొప్పది. ఆదర్శ విద్యా విధానాన్ని రూపొందించడంలో వారి దీక్షకు ఇప్పటికీ నేను సలాం చేస్తాను. విద్య కొంతమందికే అందినప్పటికీ ప్రమాణాలు గల చదువును వారికి నేర్పించారు. ఉపాధ్యాయుల నియామకమే అందుకు బలమైన పునాదిగా నిలుస్తుంది.

05/17/2017 - 01:13

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడం లేదనే చెప్పాలి. బాల కార్మికుల్ని చదివించేందుకు పాఠశాలల్లో చేర్పిస్తున్నామని అధికారులు గణాంకాలు చూపిస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో బాల కార్మికులు దర్శనమిస్తునే ఉన్నారు. అధికారులు చెబుతున్న గణాంకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

05/16/2017 - 00:53

పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఉగ్రవాదుల, మావోస్టుల విధ్వంసకాండకు అడ్డుకట్ట వేయవచ్చన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు అడియాసలయ్యాయి. కాశ్మీర్‌లో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పదే పదే చెలరేగిపోతున్నారు. చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని సుకుమా జిల్లా ప్రస్తుతం మావోయిస్టులకు కంచుకోటగా ఉంది.

05/15/2017 - 00:20

‘సంతులిత ఆహారం’ అంటే ఒక వ్యక్తి లేదా జీవి ఆరోగ్యంగా ఉండేందుకు లేదా బరువు పెరగకుండా ఉండేందుకు వినియోగించే ఆహారమే. నేటి ఆధునిక కాలంలో రకరకాల కారణాలతో ఆహారపు అలవాట్లు మారడంతో బయట తేలికగా లభించే చిరుతిళ్ల (జంక్‌ఫుడ్)కు అలవాటు పడే సంస్కృతి వచ్చేసింది. ఇది పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంది.

05/14/2017 - 01:26

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు సహజంగా రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులుంటారు. కానీ ఇదో విచిత్రం. నవ్యాంధ్రలో మాత్రం బిజెపికి రెండు పెద్ద పార్టీలూ దోస్తులే. ఇది చాణక్యుడిని మించిన మోదీకి మాత్రమే సాధ్యమైన చిత్రవిచ్రిత రాజకీయం. ఏపిలో పాము- ముంగిస మాదిరి శత్రుత్వం ఉన్న టిడిపి-వైకాపా అగ్రనేతలిద్దరూ చెరోసారి దిల్లీ వెళ్లి ప్రధాని చెవిలో ఏదో ఒకటి ఊదుతుంటారు.

Pages